Bus Driver: డ్రైవరన్నా.. నీ సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్.. ఓ ప్రయాణీకుడిలాగే బస్సు ఎక్కిన దొంగోడికి చుక్కలు చూపించాడు..!

ABN , First Publish Date - 2023-07-28T12:53:38+05:30 IST

పోలీసులను చూసి బస్సు డ్రైవర్ బస్సును ఆపేశాడు. దొంగను పోలీసులకు అప్పగించేందుకు తలుపులు తెరిచాడు.

Bus Driver: డ్రైవరన్నా.. నీ సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్.. ఓ ప్రయాణీకుడిలాగే బస్సు ఎక్కిన దొంగోడికి చుక్కలు చూపించాడు..!
thief

దొంగతనం జరిగిందని ఎవరైనా చెపితే తెలిసేది. అలాంటిది ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చిన తరువాత ఏ చిన్న గల్లీలో చిన్న తప్పు జరిగినా అది రికార్డ్ అయ్యి దొంగను ఇట్టే పట్టించేస్తుంది. అయితే ప్రతిసారీ ఇలా జరగకపోయినా సాంకేతికత అప్పుడప్పుడూ మంచిపనే చేసిపెడుతుంది. అయితే ఇక్కడ సాంకేతికతతో పాటు చాకచక్యంగా వ్యవహరించడం కూడా ఆ దొంగను పట్టించింది. అదేవిటంటే..

బస్సులో ఓ వ్యక్తి మహిళ పర్సును దొంగిలించేందుకు ప్రయత్నించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని ప్రయత్నం ఘోరంగా విఫలమయింది. బస్సు డ్రైవర్ సీటు పైన అమర్చిన సీసీటీవీ కెమెరాలో వీడియో రికార్డైంది. దీనిని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రయాణీకులు బస్సులో ఎక్కి, బస్సులో కూర్చోగానే, వారి టిక్కెట్ ఛార్జీని చెల్లించడానితి క్లిప్ తెరుస్తారు. బస్సు ఎక్కే ముందు దొంగ తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. బస్ ఎక్కగానే తన మొదటి ప్రయత్నంలో, బస్ వరుసలో కూర్చున్న మహిళ నుండి బ్యాగ్ దొంగిలించడానికి ప్రయత్నించాడు కానీ..

ఇది కూడా చదవండి: భారత్‌లో అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు ఇవే.. టెర్రరిస్టుల భయం కాదండోయ్..!


దాన్ని లాక్కోవడంలో విఫలమై మామూలుగా నవ్వాడు. ఆ వెంటనే మరోసారి బ్యాగ్ దొంగిలించడానికి మళ్లీ ప్రయత్నించాడు, కానీ మహిళ తన బ్యాగ్‌ను గట్టిగా పట్టుకుంది. ఈ విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే స్పందించి దొంగ వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆటోమేటిక్‌గా బస్సు డోర్‌ను మూసేశాడు. దొంగకు గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో డ్రైవర్ బస్సును నడుపుతూనే ఉన్నాడు.

డోర్ మూసుకోగానే, బస్సు డ్రైవర్ దొంగను లాఠీతో అనేకసార్లు కొడుతూనే ఉన్నాడు, ఆ దొంగ తనను విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. వ్యక్తి ఏడుస్తూ వేడుకున్నాడు. పోలీసులను చూసి బస్సు డ్రైవర్ బస్సును ఆపేశాడు. దొంగను పోలీసులకు అప్పగించేందుకు తలుపులు తెరిచాడు. ఆ వ్యక్తి బ్యాగ్‌ని లాక్కునేందుకు ప్రయత్నించిన మహిళ కూడా ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాకచక్యంగా డ్రైవర్ తలుపులు మూయడంతో అతని చేయి తలుపు సందులో ఇరుక్కుని బస్సులో చిక్కుకుపోయాడు. డ్రైవర్ చేతిలో చావు దెబ్బలూ తిన్నాడు.

Updated Date - 2023-07-28T12:53:38+05:30 IST