Viral Video: చనిపోయిన తల్లి కోసం తల్లడిల్లిన పిల్ల కోతి.. తల్లి చుట్టూ తిరుగుతూ రోదన.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!

ABN , First Publish Date - 2023-02-25T15:58:51+05:30 IST

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది ఇంకేమీ లేదు.. మనుషులకైనా, ఇతర జంతువులకైనా తల్లి ప్రేమ ఎంతో అమూల్యమైనది.. అలాంటి అమ్మ లేకపోతే జీవితం శూన్యమే. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.

Viral Video: చనిపోయిన తల్లి కోసం తల్లడిల్లిన పిల్ల కోతి.. తల్లి చుట్టూ తిరుగుతూ రోదన.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది ఇంకేమీ లేదు.. మనుషులకైనా, ఇతర జంతువులకైనా తల్లి ప్రేమ ఎంతో అమూల్యమైనది.. అలాంటి అమ్మ లేకపోతే జీవితం శూన్యమే. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తల్లి కోసం పిల్ల కోతి (Baby Monkey) మూగ రోదన ఎంతో మందిని కంటతడి పెట్టిస్తోంది.

అసోంలో (Assam) ఓ వానరం (Monkey) రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న వాహనం దానిని ఢీకొట్టింది. దాంతో ఆ కోతి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లి కోతితో పాటు అక్కడే పిల్ల కోతి కూడా ఉంది. ఆ చిన్ని కోతి తన తల్లిని లేపేందుకు ప్రయత్నించింది. కేకలు వేసింది. అయినా తల్లి లేవకపోవడంతో అది తల్లడిల్లిపోయింది (Baby monkey cries for dead mother). త‌న తల్లికి ఏమైందో తెలియక రోదించింది. రోడ్డుపై విగత జీవిగా పడి ఉన్న త‌ల్లిని చుట్టుకుని పిల్ల కోతి ఏడుస్తున్న వీడియో అంద‌రినీ కంటతడి పెట్టిస్తోంది.

Updated Date - 2023-02-25T15:58:53+05:30 IST