Share News

Viral Video: ఏం క్రియేటివిటీ బాసూ.. ఆవుకు హెడ్ లైట్.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

ABN , Publish Date - Dec 22 , 2023 | 08:53 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందరినీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది.

Viral Video: ఏం క్రియేటివిటీ బాసూ.. ఆవుకు హెడ్ లైట్.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందరినీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి (Viral Video). ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఆవుకు హెడ్‌లైట్ అమర్చారు. @Enezator అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు (Jugaad Videos).

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఆవు (Cow) రాత్రి సమయంలో గడ్డి మేస్తోంది. ఆ ఆవు తలపై ఓ లైట్‌ను అమర్చారు (Head light on Cow). బెల్ట్ సహాయంతో ఆవు రెండు కొమ్ముల మధ్య ఆ లైట్‌ను అమర్చారు. ఆ వెలుగులో ఆవు గడ్డి మేస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్.. ``స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ`` అని కామెంట్ చేశారు. ఈ వెరైటీ ఐడియా నెట్టింట చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది.

Viral Video: వార్నీ.. ఏం ఐడియా తల్లీ.. హై హీల్స్‌ను ఇలా కూడా వాడొచ్చా.. వీడియో వైరల్!

ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. 5.5 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``ఇది హైటెక్ ఆవు``, ``ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో``, ``ఆవు రాత్రి గడ్డి మేయాల్సిన అవసరం ఏముంది``, ``ఐడియా బాగుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Dec 22 , 2023 | 08:54 PM