Hair vs Oil: జుట్టుకు నూనె రాసుకునే అలవాటు అస్సలు లేదా..? అయితే ఈ వార్తను తప్పక చదవాల్సిందే..!

ABN , First Publish Date - 2023-08-18T12:46:47+05:30 IST

యువతులు ప్రతిరోజు బయటకెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుండటంతో తలకు నూనె రాసుకుని వెళ్లడానికి ఇష్టపడటం లేదు. దీనికితోడు తలకు నూనె రాసుకుంటే ముఖమంతా జిడ్డుగా కనబడుతుందనే భావన చాలామందిలో ఉంది.

Hair vs Oil: జుట్టుకు నూనె రాసుకునే అలవాటు అస్సలు లేదా..? అయితే ఈ వార్తను తప్పక చదవాల్సిందే..!

జుట్టు సంరక్షణలో నూనె రాసుకోవడం ఒక భాగం. ఒకప్పుడు తలకు నూనె రాసుకుని, జుట్టు అణిగేలా దువ్వుకుని జడవేసుకునేవారు. పిల్లలకు చిన్నప్పుడు కూడా చక్కగా నూనె రాసి రెండు జడలు వేసి స్కూలుకు పంపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యువతులు ప్రతిరోజు బయటకెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుండటంతో తలకు నూనె రాసుకుని వెళ్లడానికి ఇష్టపడటం లేదు. దీనికితోడు తలకు నూనె రాసుకుంటే ముఖమంతా జిడ్డుగా కనబడుతుందనే భావన చాలామందిలో ఉంది. ఏదైమైనా తలకు నూనె రాసుకుని బయటకు వెళ్లే అమ్మాయిల సంఖ్య తగ్గిపోయింది. తలకు నూనె రాయడానికి బదులుగా చాలామంది అమ్మాయిలు ఉదయాన్నే తలంటుపోసుకుని ఆ తరువాత జుట్టుకు కండీషనర్ రాసుకుని జుట్టు సంరక్షణ ఫాలో అవుతుంటారు. కానీ జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల చాలా లాబాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుంటే మళ్లీ పాతరోజుల్లోలాగా జుట్టుకు నూనె పెట్టడం అలవాటు చేసుకుంటారు.

జుట్టుకు నూనె రాస్తే(Hair oiling) ఫ్యాషన్ గా కనిపించరనే మాట అటుంచితే.. నూనె రాయడం వల్ల జుట్టు బలపడుతుంది. జుట్టును లోపలినుండి ధృడంగా మారుస్తుంది. నూనె కారణంగా జుట్టు మీద రక్షణ పొర ఏర్పడుతుంది.

నూనె రాయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. తేమను కలిగి ఉన్నప్పుడు సహజమైన మెరుపు(natural shining) జుట్టుకు లభిస్తుంది. జుట్టుమీద ఏర్పడే రక్షణ పొర దుమ్ము,ధూళి, ఎండ, సూర్యుడి అతినీలలోహిత కిరణాలు మొదలైనవాటి నుండి జుట్టును సంరక్షిస్తుంది.

Longer Life: ఎక్కువ కాలం బ్రతకాలని ఉందా..? అయితే మీరు చేయాల్సిన మొట్టమొదటి పనేంటంటే..!



హెయిర్ ఆయిల్ లు జుట్టు ఎదుగుదలను ప్రేరేపించే విటమిన్లు, ఎంజైమ్ లను కలిగి ఉంటాయి. క్రమం తప్పకుండా కల్తీ లేని నూనెలు జుట్టుకు రాయడం వల్ల జుట్టు మూలాల నుండి బలంగా మారతుంది. నూనెలలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

హెయిర్ కేర్ లో చాలామంది ఫాలో అయ్యేది ఆయిల్ మసాజ్(oil massage). పెళుసుగా, పొడిగా, చిట్లిపోయిన జుట్టును తిరిగి మళ్ళీ మంచి కండీషన్ కు తీసుకురావడంలో హెయిర్ ఆయిల్ మసాజ్ చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ ఆయిల్స్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రు, వెంట్రుక చివర్లు చిట్లడం వంటి సమస్యలను అరికట్టడమే కాకుండా జుట్టుకు పోషణ అందిస్తాయి. జుట్టును తేమగా, మృదువుగా ఉండేలా చేస్తాయి. అలాగే హెయిర్ ఆయిల్స్ లో మాశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి అతినీలలోహిత కిరణాల నుండి జుట్టును సంరక్షిస్తాయి.

జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలంటే..

జుట్టు ఆరోగ్యంగా పెరగాలన్నా, డ్యామేజ్ అయిన జుట్టు రికవర్ కావాలన్నా ఆయిల్ అప్లై చేసేవిధానం కూడా ముఖ్యమైనది. రోజ్ మేరీ ఎసెంటియల్ ఆయిల్, ల్యావెండర్ వంటి నూనెలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. 20మి.లీ ల కొబ్బరినూనెలో నాలుగైదు చుక్కల ఎసెంటియల్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ నూనెను గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతి కొనవేళ్ళతో అద్దుకుంటూ జుట్టు కుదుళ్ళకు అంటేలా సున్నితంగా మసాజ్ చేయాలి. తరువాత టవల్ లేదా షవర్ క్యాప్ తో జుట్టును కవర్ చేయాలి. 30నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. లేదంటే రాత్రి సమయంలో నూనె పెట్టుకుని రాత్రంతా అలాగే వదిలి మరుసటి రోజు తలస్నానం చేయవచ్చు. ఇలా చేస్తే జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయి. జుట్టు ఒత్తుగా, నల్లగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

Uber Auto: ఉబెర్ ఆటోను బుక్ చేసుకున్న యువతికి షాకింగ్ అనుభవం.. అంత రద్దీలోనూ రూ.6 కే రైడ్..!


Updated Date - 2023-08-18T12:46:47+05:30 IST