Google Pay: ఆధార్ కార్డ్ ఉన్నవారందరికీ గూగుల్ పే కీలక సమాచారం... ఇకపై...

ABN , First Publish Date - 2023-06-11T22:01:59+05:30 IST

ఆధార్‌తో కూడా గూగుల్ పేని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆధార్ ఆధారిత ఐడెంటిఫికేషన్‌ను కల్పించింది. కాబట్టి వినియోగదారులు ఆధార్‌ని ఉపయోగించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా యూపీఐని రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంతో డెబిట్ కార్డ్ లేకుండానే యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

Google Pay: ఆధార్ కార్డ్ ఉన్నవారందరికీ గూగుల్ పే కీలక సమాచారం...  ఇకపై...

వినియోగదారులు తమ మొబైల్స్‌లో గూగుల్ పే (Google Pay) యాక్టివేట్ చేయాలంటే డెబిట్ కార్డ్ (Debit card) ఉండాల్సిందే అనేది ఇప్పటివరకు ఉన్న నిబంధన. అయితే ఇకపై ఆధార్‌తో కూడా గూగుల్ పేని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆధార్ ఆధారిత ఐడెంటిఫికేషన్‌ను కల్పించింది. కాబట్టి వినియోగదారులు ఆధార్‌ని ఉపయోగించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా యూపీఐని రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంతో డెబిట్ కార్డ్ లేకుండానే యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవచ్చని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ రిపోర్ట్ పేర్కొంది.

కొన్ని బ్యాంకులకు చెందిన కస్టమర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మిగతా బ్యాంకులు కూడా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాయని తెలుస్తోంది. కాగా ఈ కొత్త విధానంలో పెద్ద సంఖ్యలో యూపీఐ ఐడీలు తీసుకునే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. వాళ్లంతా యూపీఐ వంటి డిజిటల్ పేమెంట్లు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందనే అంచనాలున్నాయి.

‘‘ ఆధార్ ఆధారిత యూపీఐ అందుబాటులోకి వస్తుండడంతో గూగుల్ పే యూజర్లు డెబిట్ కార్డ్ లేకుండానే యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవచ్చు. మరిన్ని మిలియన్ల మంది భారతీయులకు యూపీఐ పేమెంట్ సర్వీసులు చేరువవుతాయి. ఫలితంగా యూపీఐ ఐడీలు సెట్ చేసుకొని డిజిటల్ పేమెంట్లు చేస్తారు ’’అని గూగుల్ పే వెల్లడించింది.

ఆధార్‌తో యూపీఐ యాక్టివేట్ చేయాలంటే...

- యూజర్లు ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యమ్నాయాన్ని ఎంచుకోవాలి.

- ఆధార్ ద్వారా యూపీఐ యాక్టివేట్ చేసుకోవాలనుకునేవారికి ఆధార్ తప్పనిసరిగా ఉండాలి.

- ఫోన్ నంబర్ యూఐడీఏతో రిజిస్టర్ అయ్యుండాలి. బ్యాంకు‌తో కూడా మొబైల్ రిజిష్టర్ అవ్వాలి.

- బ్యాంక్ అకౌంట్ - ఆధార్ అనుసంధానమయ్యుండాలి.

Updated Date - 2023-06-11T22:01:59+05:30 IST