Google Pay: గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్ పే.. కొత్తగా వచ్చిన ఈ స్పెషల్ ఫీచర్ మీకు పనికొస్తుందో లేదో చెక్ చేసుకోండి..!

ABN , First Publish Date - 2023-06-09T16:04:53+05:30 IST

చాలామంది గూగుల్ పే వాడుతూ ఉంటారు. ఈ గూగుల్ పే లో ఇప్పుడొక కొత్త ఫీచర్ వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ కొత్త ఫీచర్ వల్ల గూగుల్ పే మరింత

Google Pay: గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్ పే.. కొత్తగా వచ్చిన ఈ స్పెషల్ ఫీచర్ మీకు పనికొస్తుందో లేదో చెక్ చేసుకోండి..!

గూగుల్ పే, ఫోన్ పే, పేటియం.. ప్రస్తుతకాలంలో ఆన్ సైన్ చెల్లింపులకోసం విరివిగా ఉపయోగిస్తున్న యుపిఐ పేమెంట్ యాప్స్. వీటిలో గూగుర్ పే ప్రముఖమైనది. చాలామంది గూగుల్ పే వాడుతూ ఉంటారు. ఈ గూగుల్ పే లో ఇప్పుడొక కొత్త ఫీచర్ వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ కొత్త ఫీచర్ వల్ల గూగుల్ పే ఉపయోగం మరింత సులువుకానుంది. గూగుల్ పే వినియోగదారులు ఈ ఫీచర్ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటి? దాని వల్ల ఉపయోగం ఏంటి? ఇది గూగుల్ పే వినియోగదారులకు ఎంతవరకు పనికొస్తుంది పూర్తీగా తెలుసుకుంటే..

ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటియం కావచ్చు.. ఎందులోనైనా ఆర్థికలావాదేవిలుonline transections) జరపాలంటే మొదట డెబిట్ కార్డు(Debit card) సహాయంతో సదరు యాప్స్ లో యుపిఐ ఐడి(UPI ID) యాక్టీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ పేలో(Google Pay) కూడా ఇన్నాళ్ళు ఇలాగే ఉండేది. కానీ ఇప్పుడు డెబిట్ కార్డుకు చెల్లుచీటి ఇచ్చింది గూగుల్ పే. గూగుల్ పే ని యాక్టీవ్ చేయడానికి ఇప్పుడు డెబిట్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు అవసరం లేదు. దీనికి కేవలం అన్నింటికీ మనం ఉపయోగిస్తున్న ఆధార్ కార్డ్(Google Pay with Aadhaar card) సరిపోతుంది. ఆధార్ కార్డుతో గూగుల్ పే ద్వారా సేవలు అందించడానికి ప్రస్తుతం 22బ్యాంకులు పచ్చజెండా ఊపాయి. తరువాత మరిన్ని బ్యాంకులు ఈ లిస్ట్ లో వచ్చి చేరనున్నాయి. డెబిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లేకుండా కేవలం ఆధార్ సహాయంతో గూగుల్ పే ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చంటే..

UPI payments: ఫోన్ పే.. గూగుల్ పే నుంచి పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపితే.. తిరిగి రాబట్టుకోవడానికి ఏం చేయాలంటే..!


గూగుల్ పే ను ఆధార్ సహాయంతో యాక్టివేట్ చేయడానికి మొదట ఆధార్ కార్డును, బ్యాంక్ అకౌంట్ ను ఒకే మొబైల్ నెంబర్ తో లింక్ చేసి ఉండాలి. గూగుల్ పే యాప్ లో ఆధార్ కార్డులోని మొదటి 6అంకెలను(Aadhaar first 6 digits) నమోదు చేయాలి. ఈ నెంబర్ ను సదరు గూగుల్ పే సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ద్వారా UIDAI కి పంపుతుంది. UIDAI ఆధార్ కార్డుకు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ కు ఓటిపి(OTP) పంపుతుంది. ఆ ఓటిపి సహాయంతో గూగుల్ పే ను యాక్టీవ్ చేయచ్చు. ఆ తరువాత UPI పిన్ ను సెటప్ చేసుకుని ఆర్థిక లావాదేవిలు జరపవచ్చు. ఈ ప్రాసెస్ లో గూగుల్ పే ఆధార్ నెంబర్ ను కేవలం NPCI కి మాత్రమే షేర్ చేస్తుంది. ఆధార్ గూగుల్ సంస్థవారు సేవ్ చేసుకోరు కూడా. కాబట్టి దీనివల్ల ఎలాంటి సమస్యలూ ఉండవని గూగుల్ తెలిపింది.

Viral Video: పాపం.. ఈ బామ్మకు ఈ వయసులో ఇన్ని కష్టాలేంటి..? ఎర్రటి ఎండలో నడుస్తూనే 170 కిలోమీటర్ల ప్రయాణం..!


Updated Date - 2023-06-09T16:04:53+05:30 IST