Viral Video: పాపం.. ఈ బామ్మకు ఈ వయసులో ఇన్ని కష్టాలేంటి..? ఎర్రటి ఎండలో నడుస్తూనే 170 కిలోమీటర్ల ప్రయాణం..!

ABN , First Publish Date - 2023-06-09T13:23:42+05:30 IST

పేదరికంలో ఉన్న వృద్దులు పడే ఇబ్బందుల గురించి చెబితే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇక వృద్ద వికలాంగులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఓ వికలాంగ వృద్దురాలి కష్టం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎర్రటి ఎండలో నడుస్తూ..

Viral Video: పాపం.. ఈ బామ్మకు ఈ వయసులో ఇన్ని కష్టాలేంటి..? ఎర్రటి ఎండలో నడుస్తూనే 170 కిలోమీటర్ల ప్రయాణం..!

మనిషి జీవితంలో వృద్దాప్యం ఒక దశ. కానీ చాలామంది వృద్దులుగా మారిన తరువాత ఇబ్బందులు ఎదుర్కొంటారు. పేదరికంలో ఉన్న వృద్దులు పడే ఇబ్బందుల గురించి చెబితే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇక వృద్ద వికలాంగులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఓ వికలాంగ వృద్దురాలి కష్టం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎర్రటి ఎండలో నడుస్తూ 170కిలోమీటర్ల ప్రయాణంచేస్తూ కనిపించింది. ఓ వ్యక్తి ఆ బామ్మతో ఎక్కడికి వెళుతున్నావని ప్రశ్నిస్తే ఆ బామ్మ చెప్పన సమాధానం అందరి హృదయాలను బరువెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ బామ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

కౌమారం, యవ్వనం, మధ్యవయసు లాగా వృద్దాప్యం కూడా ఓ దశ. కానీ చాలామందికి వృద్దాప్యం బాధను కలిగిస్తుంది. పిల్లలు పట్టించుకోకపోవడం ఒక కారణమైతే.. శరీరం సహకరించకపోవడం మరొక కారణం. వృద్ద వికలాంగుల ఇబ్బందులు చాలా బాధాకరమైనవి. పిల్లలు తల్లిదండ్రులను వద్దనుకున్నా, తల్లిదండ్రులు పిల్లలను వదులుకోలేరు. మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం రాజ్ గర్ జిల్లాలో ఉదంఖేడి గ్రామంలో లిబియా బాయి అనే వృద్దురాలు(old women) నివసిస్తోంది. ఆమె వికలాంగురాలు. ఈమెకు కన్న కూతురు తప్ప నా అనేవాళ్లు ఎవరూ లేరు. కూతురు మధ్యప్రదేశ్ లోనే గుణ జిల్లాలోని పచోర్ లో నివసిస్తోంది. బామ్మ తన కూతురును( చూసి చాలా కాలమైంది. దీంతో కూతురును చూడటానికి వెళ్ళాలని అనుకుంది(old women want to see his daughter). కానీ కూతురు దగ్గరకు వెళ్ళడానికి ఆమె దగ్గర బస్ ఛార్జీలకు డబ్బు కూడా లేదు(old women has no money). ఎంతో మంది బస్ డ్రైవర్లకు తన గోడు చెప్పుకున్నా ఏ డ్రైవరు,కండక్టరు ఆమెను బస్ లో కూర్చోబెట్టుకోలేదు. దీంతో ఆ బామ్మ తనదగ్గరున్న ట్రై సైకిల్(tricycle) లోనే కూతురు దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. తనున్న ప్రాంతానికి, కూతురున్న గ్రామానికి మధ్య 170కిలోమీటర్ల దూరముందే(170 km distance) అని ఆమె బెంబేలు పడిపోలేదు. తనదగ్గరున్న మూడుచక్రాల బండే తనకు బోలెండంత ఆసరా అనుకుని దాంతోనే ప్రయాణం మొదలుపెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8రోజులు ప్రయాణం చేసింది(old women 8days walking journey).

Viral News: సైబర్ నేరగాళ్లకే చుక్కలు చూపించాడుగా.. చిన్న పని చేస్తే డబ్బే డబ్బంటూ మెసేజ్ పెడితే మనోడు ఏకంగా చాటింగ్ స్టార్ట్ చేసి..!


ఆమె రాజ్ పచోర్-బియోరా మధ్య రహదారిలో ప్రయాణం చేస్తూ పలువురి కంట పడింది. తన కుడిచేత్తో ట్రైసైకిల్ ను లాగుతూ, ఎడమ చేత్తో తన సైకిల్ ముందు చక్రాన్ని ముందుకు తోస్తూ మెల్లిగా నడుస్తూ కనిపించింది.ఆ సైకిల్ మీద ఆ బామ్మకు సంబంధించిన సామాను మొత్తం ఉంది. ఓ వ్యక్తి ఆ బామ్మకు ఎదురువెళ్ళాడు. బామ్మతో ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు. దానికి ఆ బామ్మ పచోర్ అని సమాధానం ఇచ్చింది. ఎక్కడినుండి వస్తున్నావని అదే వ్యక్తి ప్రశ్నించగా రాజ్ గర్ నుండి వస్తున్నట్టు తెలిపింది. నడుచుకుంటూ ఎందుకు వెళ్తున్నావని అడగగానే తన కష్టమంతా చెప్పుకుని కంటతడిపెట్టింది. ఈ వీడియోను @ajaychauhan41 అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఈ బామ్మకు ఈ వయసులో ఎంత కష్టమొచ్చిందో' అని బాధపడుతున్నారు. 'ఆ బామ్మ కూతురు కోసం ఎందుకు వెళ్ళాలి? కూతురే బామ్మను చూడటానికి రావచ్చు కదా?' అని తమ అభిప్రాయం చెబుతున్నారు.

UPI payments: ఫోన్ పే.. గూగుల్ పే నుంచి పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపితే.. తిరిగి రాబట్టుకోవడానికి ఏం చేయాలంటే..!


Updated Date - 2023-06-09T13:23:42+05:30 IST