నా పెళ్లిని చెడగొట్టాడు.. ఇకపై ఇదే నా ఇల్లు.. అంటూ పెట్టేబేడా సర్దుకుని నేరుగా ప్రియుడి ఇంటికే వచ్చేసిన ప్రేయసి.. చివరకు..

ABN , First Publish Date - 2023-02-07T18:53:24+05:30 IST

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.. అయితే అమ్మాయికి తల్లిదండ్రులు వేరే సంబంధం చూసి పెళ్లి చేశారు.. పెళ్లి తర్వాత కూడా అమ్మాయిని ఆ యువకుడు వదల్లేదు.. మాట్లాడుతూ, కలుస్తూనే ఉన్నాడు..

నా పెళ్లిని చెడగొట్టాడు.. ఇకపై ఇదే నా ఇల్లు.. అంటూ పెట్టేబేడా సర్దుకుని నేరుగా ప్రియుడి ఇంటికే వచ్చేసిన ప్రేయసి.. చివరకు..

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.. అయితే అమ్మాయికి తల్లిదండ్రులు వేరే సంబంధం చూసి పెళ్లి చేశారు.. పెళ్లి తర్వాత కూడా అమ్మాయిని ఆ యువకుడు వదల్లేదు.. మాట్లాడుతూ, కలుస్తూనే ఉన్నాడు.. ఆ విషయం భర్తకు తెలియడంతో గొడవ జరిగింది.. భార్యను బయటకు పంపేశాడు.. దీంతో ఆ యువతి నేరుగా లగేజీతో ప్రియుడి ఇంటికి చేరుకుంది.. అక్కడ గొడవ జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పారు (Girl reached her lover's house with Luggage).

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) గోరఖ్‌పూర్‌కు సమీపంలోని లుహ్సీ గ్రామానికి చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు (Love Affair). పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి చేశారు. పెళ్లయిన తర్వాత కూడా ఆ యువకుడితో అమ్మాయి మాట్లాడుతూనే ఉంది. అప్పుడప్పుడు కలుసుకునే వారు (Extra Marital Affair). ఈ విషయం అత్తమామలు, భర్తకు తెలియడంతో వివాహ బంధం తెగిపోయింది. దీంతో అమ్మాయి తన వస్తువులను తీసుకొని నేరుగా ప్రేమికుడి ఇంటికి చేరుకుంది. దీంతో అక్కడ దుమారం చెలరేగింది. ఆ యువతిని తమ ఇంట్లో ఉంచుకోవడానికి యువకుడి కుటుంబ సభ్యులు నిరాకరించారు.

కొద్ది రోజుల్లో పెళ్లి.. కాబోయే భర్తను జాబ్‌లోంచి తీసేసిన మైక్రోసాఫ్ట్‌.. ఆ యువతి ఏం చేసిందంటే..!

ఆ అమ్మాయి పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. అయినా ఆ అమ్మాయి వినలేదు. చివరకు ఇరు కుటుంబాల వారితో మాట్లాడి సమస్యను పరిష్కరిద్దామని పోలీసులు చెప్పడంతో ఆ యువతి తన ఇంటికి వెళ్లిపోయింది.

Updated Date - 2023-02-07T18:53:25+05:30 IST