కొద్ది రోజుల్లో పెళ్లి.. కాబోయే భర్తను జాబ్‌లోంచి తీసేసిన మైక్రోసాఫ్ట్‌.. ఆ యువతి ఏం చేసిందంటే..!

ABN , First Publish Date - 2023-02-07T15:46:33+05:30 IST

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పడగ విప్పుతుండడంతో ప్రముఖ కంపెనీలన్నీ తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి (Massive layoffs). ఎంతో మందిని ఇళ్లకు పంపిస్తున్నాయి. దీంతో ఎంతో మంది రోడ్డున పడుతున్నారు.

కొద్ది రోజుల్లో పెళ్లి.. కాబోయే భర్తను జాబ్‌లోంచి తీసేసిన మైక్రోసాఫ్ట్‌.. ఆ యువతి ఏం చేసిందంటే..!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పడగ విప్పుతుండడంతో ప్రముఖ కంపెనీలన్నీ తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి (Massive layoffs). ఎంతో మందిని ఇళ్లకు పంపిస్తున్నాయి. దీంతో ఎంతో మంది రోడ్డున పడుతున్నారు. వారిపై ఆధారపడ్డ వారు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యువతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ ఉద్యోగంలో నుంచి తీసేసిందని, ఇప్పటికీ అతడిని పెళ్లి చేసుకోవచ్చా? అని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించింది.

తనకు మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేసే వ్యక్తితో పెళ్లి కుదిరిందని, ఈ నెలలోనే పెళ్లి జరగబోతోందని తెలిపింది. అతని జీతం నెలకు రూ.2.5 లక్షలని, ఇంతలో అతని ఉద్యోగం పోయిందని, ఇప్పుడు అతడిని పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే విషయంలో సందిగ్ధం నెలకొందని పేర్కొంది (Fiancé gets laid off by Microsoft). ఎవరైనా తనకు మంచి సలహా ఇవ్వాలని కోరింది. గుర్తు తెలియని యువతి పెట్టిన ఆ సోషల్ మీడియా పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.

అర్ధరాత్రి పోలీసులను పరుగులు పెట్టించింది.. ప్రియుడిని బుక్ చేయాలనుకుని బుక్ అయింది..

ఆ యువతి చేసిన పోస్ట్‌పై నెటిజన్లు భిన్న రకాలు స్పందిస్తున్నారు. కొందరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తే, మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాల్లా మారిపోయిన ప్రస్తుత రోజుల్లో అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారని ఒకరు కామెంట్ చేశారు. ఆ వ్యక్తికి నీ కంటే మంచి వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తుందని మరొకరు పేర్కొన్నారు.

Updated Date - 2023-02-07T15:46:35+05:30 IST