Viral Video: రైల్వే స్టేషన్‌లో చిందులేసిన యువతి.. పోలీసులు ఆమెకు ఎలా బుద్ధి చెప్పారంటే..
ABN , Publish Date - Dec 17 , 2023 | 08:57 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొందరు వ్యక్తులు ఎలాగైనా పాపులారిటీ సంపాదించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకు ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొందరు వ్యక్తులు ఎలాగైనా పాపులారిటీ సంపాదించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకు ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. రైల్వే స్టేషన్లలో (Railway Station), బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్సులు వేయడం, ప్రమాదకర బైక్ స్టంట్లు (Bike Stunts)చేయడం వంటివి చేసి వాటిని రికార్డు చేస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా రైల్వే స్టేషన్‌లో డ్యాన్స్ చేసిన యువతికి రైల్వే పోలీసులు తగిన బుద్ధి చెప్పారు (Viral Video).
seemakanojiya87 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ముంబైలోని (Mumbai) ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సీమా కన్నౌజియా డ్యాన్స్ వేస్తూ వీడియో రూపొందించింది. ఆమె చేష్టల వల్ల చుట్టుపక్కల వారు ఇబ్బందులు పడ్డారు. ఆ వీడియోను సీమా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఆ వీడియో వైరల్ అయి చివరకు రైల్వే సిబ్బంది వరకు వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు సీమాపై చర్యలు తీసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా సీమ మరో వీడియోను విడుదల చేసింది. తనలా ఎవరూ పబ్లిక్ ప్లేస్‌లలోనూ, రైల్వే స్టేషన్‌లు, రైళ్లలో వీడియోలు చేయవద్దని, అలా చేయడం శిక్షార్హమైన నేరమని పేర్కొంది. తన చర్య పట్ల క్షమాపణలు కోరింది. ఇకపై అలాంటి పనులు చేయనని తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.