అత్తాకోడళ్ల మధ్య వంట విషయంలో గొడవ.. చివరకు ఎంత పని జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-03-08T11:06:51+05:30 IST

కోడలు ఇంట్లో అడుగుపెట్టి కేవలం నాలుగు నెలలే.. వంట విషయంలో కోడలితో గొడవ పడిన ఈ అత్త

అత్తాకోడళ్ల మధ్య వంట విషయంలో గొడవ.. చివరకు ఎంత పని జరిగిందంటే..

రెండుకొప్పులు ఒకచోట ఇమడవు అని పెద్దలు అనడం, అత్తాకోడళ్ళను శత్రువులుగా సీరియళ్ళు చూపెట్టడం చాలా సహజం. అవన్నీ సమాజంలో ఆడవారి ప్రవర్తనను చూసే చేస్తారు. అత్త గయ్యాళి అనే మాటలు వ్యాపించడానికి ఇదిగో ఇలాంటి అత్తలే కారణం. కోడలు ఇంట్లో అడుగుపెట్టి కేవలం నాలుగు నెలలే.. వంట విషయంలో కోడలితో గొడవ పడిన ఈ అత్త చేసిన పని తెలిసి 'అయ్యో పాపం ఆ కోడలు..' అంటున్నారంతా.. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగరం కిల్ గేట్ లోని గోలందాజ్ మొహల్లాలో రుక్సర్ బానో అనే అమ్మాయి కుటుంబం నివసిస్తోంది. ఆమెకు నాలుగు నెలల క్రితం ఇర్ఫాన్ ఖాన్ అనే వ్యక్తితో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లయిన తరువాత కొన్ని రోజులు అత్తగారింట్లో బానే ఉంది. కానీ ఆ తరువాత బానో అత్త హసీనా బేగం, ఆమె బావ సమీర్ ఖాన్ ఇద్దరూ బానోను వేధించడం మొదలుపెట్టారు. వారికి ఇర్ఫాన్ ఖాన్ కూడా జత అయ్యేవాడు. బానో అప్పుడప్పుడు అత్తగారి వేధింపులకు గట్టిగా సమాధానం ఇస్తూ ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు వంట విషయంలో అత్తాకోడళ్ళ మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఉగ్రురాలైన అత్త తన కొడుకును పిలిచి 'కోడలు నన్నేధిక్కరిస్తోంది' అని కంపైంట్ చేసింది. దీంతో కొడుకు బానోను వంటగదిలోకి బలవంతంగా లాక్కెళ్ళాడు.వారి వెనుకే వెళ్ళిన సమీర్ స్టవ్ మీద బాండిలో కాలుతున్న నూనె బానో చేతులమీద పోశాడు.

Read also: Train Journey Rules: రైలు ప్రయాణాలు చేసే వాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్.. రాత్రి 10 తర్వాత టికెట్లను టీటీఈ ఎందుకు చెక్ చేయరంటే..


నూనె పోస్తన్నప్పుడు బానో అటూ ఇటూ కదలడంతో ఆ నూనె ఆమె నడుముమీద, కాళ్ళమీద కూడా పడింది. చర్మం చాలావరకు కాలిపోయింది. దీని తరువాత సమీర్, ఇర్పాన్, హసీనా ముగ్గురూ బానోను కాళ్ళతో తన్నారు,దారుణంగా కొట్టారు. పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చంపేస్తామని బానోను బెధిరించారు. దీంతో బానో బాధను దిగమింగుకుని మౌనంగా ఉండిపోయింది. కానీ జరిగిన సంఘటన మొత్తం కుటుంబ సభ్యులకు ఫోన్ లో సమాచారం ఇచ్చింది. కుటుంబ సభ్యులు కంగారుగా బానో దగ్గరకు చేరుకుని ఆమెను వైద్యచికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బానో అత్తగారింటికి చేరుకోగా అప్పటికే నిందితులు ముగ్గురూ పారిపోయారు. వారికోసం వెతుకుతున్నామని తొందరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-03-08T11:06:51+05:30 IST