ఈ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఇలా చేసిందేంటి..? రెండేళ్ల క్రితమే పెళ్లి.. నెలన్నర క్రితమే ఓ బాబు కూడా పుట్టాడు కానీ..
ABN , First Publish Date - 2023-02-21T12:55:12+05:30 IST
ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగిని. కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంది. రెండేళ్ల కింద వివాహమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగిని. కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంది. రెండేళ్ల కింద వివాహమైంది. నెలన్నర క్రితమే ఓ బాబు కూడా పుట్టాడు. కానీ, పది రోజుల తర్వాత చనిపోయాడు. దాంతో ఆమె డిప్రేషన్‌లోకి వెళ్లిపోయింది. ఎలాగోలా కుటుంబ సభ్యులు పలుచోట్ల వైద్యం చేయించి ఆమెను మాములు మనిషి చేశారు. అయితే, ఆమె పూర్తిగా కోలుకోలేదు. ఎప్పుడూ బాబు గురించే ఆలోచిస్తూ ఉండేది. ఈ క్రమంలో తాజాగా ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. తాను నివాసం ఉంటున్న పోలీస్ క్వార్టర్స్‌లోనే ప్రాణాలు తీసుకుంది.
అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాకు చెందిన జ్యోతి స్థానిక నోహ్తా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్. ఆమెకు రెండేళ్ల కింద సాగర్ అనే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లైంది. ప్రస్తుతం ఈ దంపతులు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లోని డీ బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గర్భందాల్చిన జ్యోతి నెలన్నర క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చింది. కానీ, బాబు పది రోజుల తర్వాత చనిపోయాడు. దాంతో ఆమె డిప్రేషన్‌లోకి వెళ్లిపోయింది. ఎప్పుడూ చనిపోయిన బాబు గురించే ఆమె ఆలోచన. అది గమనించిన జ్యోతి కుటుంబ సభ్యులు చికిత్స చేయించారు. ఇప్పటికీ ఇంకా చికిత్స కొనగుతూనే ఉంది. కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఒంటరిగా వదలడం లేదు.
ఇది కూడా చదవండి: సోషల్ మీడియాను కుదిపేసిన సందేశం.. నెలకు రూ.6వేల నిరుద్యోగ భృతి.. ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందంటే..

ఇక సూసైడ్ చేసుకోవడానికి ముందు కూడా ఆమె తన తల్లి నివాసం ఉండే జబల్‌పూర్ నకాకు వెళ్లింది. అక్కడ భోజనం చేసి తన క్వార్టర్స్‌కు వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. తన విధులు ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో జ్యోతికి భర్త ఫోన్ చేశాడు. కానీ, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో అనుమానం వచ్చి తన అత్తారింటికి వారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు కూడా ఫోన్ చేసి చూశారు. జ్యోతి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. వెంటనే ఆమె చెల్లి క్వార్టర్స్‌కు వచ్చింది. ఇంటి తలుపులు మూసి ఉండడంతో కిటికీ తెరిచి చూసింది. అప్పటికే ఆమె ఉరి వేసుకుని కనిపించింది. దాంతో ఇరుగుపొరుగు వారిని ఈ విషయం చెప్పి తలుపులు బద్దలుకొట్టించింది. లోపలికి వెళ్లి చూస్తే అప్పటికే ఆమె చనిపోయింది. ఈ ఘటనతో క్వార్టర్స్‌లో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఓరి బుడ్డోడా.. నీకు ధైర్యం కూసింత ఎక్కువేరోయ్.. నెటిజన్లను స్టన్ చేస్తున్న వీడియో..!