Odisha Train Accident: చనిపోయాడని 24 ఏళ్ల కుర్రాడిని మార్చురీలో పడేస్తే.. వెతుక్కుంటూ వచ్చిన తండ్రి బతికించుకున్నాడు..!

ABN , First Publish Date - 2023-06-05T20:21:55+05:30 IST

``మీరు ఏదైనా బలంగా కోరుకుంటే.. దానిని మీరు పొందడంలో ఈ విశ్వం మొత్తం సహకరిస్తుంది``.. ఓ బాలీవుడ్ సినిమాలో షారూక్ ఖాన్ చెప్పే డైలాగ్ ఇది. సినిమా డైలాగ్ మాత్రమే కాదు.. ప్రఖ్యాత ``సీక్రెట్`` పుస్తకం కూడా ఈ వాక్యం చుట్టూనే తిరుగుతుంది. కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి తన కొడుకు విషయంలో కోరుకున్న బలమైన కోరిక అక్షరాల నిజం అయింది.

Odisha Train Accident: చనిపోయాడని 24 ఏళ్ల కుర్రాడిని మార్చురీలో పడేస్తే.. వెతుక్కుంటూ వచ్చిన తండ్రి బతికించుకున్నాడు..!

``మీరు ఏదైనా బలంగా కోరుకుంటే.. దానిని మీరు పొందడంలో ఈ విశ్వం మొత్తం సహకరిస్తుంది``.. ఓ బాలీవుడ్ సినిమాలో షారూక్ ఖాన్ చెప్పే డైలాగ్ ఇది. సినిమా డైలాగ్ మాత్రమే కాదు.. ప్రఖ్యాత ``సీక్రెట్`` పుస్తకం కూడా ఈ వాక్యం చుట్టూనే తిరుగుతుంది. కోల్‌కతాకు (Kolkata) చెందిన ఓ వ్యక్తి తన కొడుకు విషయంలో కోరుకున్న బలమైన కోరిక అక్షరాల నిజం అయింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. గత శుక్రవారం ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే (Odisha Train Accident). దాదాపు 280 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

కోల్‌కతాకు చెందిన హెలారం మాలిక్ అనే వ్యక్తి కుమారుడు విశ్వజిత్ మాలిక్ కూడా కోరమాండల్ రైలు ప్రమాదంలో (Coromandel Express) చిక్కుకున్నాడు. రైలు ప్రమాదం తర్వాత అతడి నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారమూ రాలేదు. ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో విశ్వజిత్ మరణించి ఉంటాడని కుటుంబ సభ్యులు, బంధువులు అనుకున్నారు. అయితే తండ్రి మాత్రం కొడుకు చనిపోయాడని భావించలేదు. తన కొడుకు బతికే ఉన్నాడని బలంగా నమ్మాడు. తన కొడుకును వెతకడానికి కోల్‌కతా నుంచి బాలాసోర్‌ (Balasore)కు తన కుటుంబాన్ని తీసుకుని వాహనంలో బయలుదేరాడు. బాలాసోర్ చేరుకుని బాధితులు ఉన్న అన్ని హాస్పిటల్స్ వెతికారు. ఎక్కడా విశ్వజిత్ ఆచూకీ దొరకలేదు.

Indian Railway: రైలు పట్టాలను లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటారు కానీ.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా..?

చివరకు మృతదేహాలను ఉంచిన బహనాగా హైస్కూల్‌లో వెతకమని ఎవరో చెప్పారు. తన మనసు అంగీకరించకపోయినా హోలారం ఆ హైస్కూల్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ వరసగా తెల్లటి వస్త్రాలతో మృతదేహాలను కప్పి ఉంచారు. అక్కడ వెతకడం ప్రారంభించారు. అక్కడ ఒక వస్త్రం లోపలి నుంచి ఓ వ్యక్తి చేయి బయటకు వచ్చింది. ఆ చేయి తన కొడుకుదేనని హోలారం గుర్తు పట్టాడు. ఆ చేయి వణకడం గమనించాడు. తన కొడుకు బతికే ఉన్నట్టు తెలుసుకుని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించి కటక్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. ప్రస్తుతం విశ్వజీత్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

Updated Date - 2023-06-05T20:21:55+05:30 IST