RRR-Olivia Morris: ఫ్యాన్స్‌ రచ్చ.. జెన్నీకి కూడా ఒక్క అవార్డు ఇవ్వొచ్చుగా!

ABN , First Publish Date - 2023-03-04T09:49:32+05:30 IST

ఆర్‌ఆర్‌ఆర్‌ .. ఆర్‌ఆర్‌ఆర్‌ .. ఆర్‌ఆర్‌ఆర్‌...(RRR) ఎక్కడ విన్నా ఇదే పేరు మార్మోగిపోతుంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వాప్తంగా కీర్తి సాధించిన ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకుంటూ ట్రెండింగ్‌లో ఉంది.

RRR-Olivia Morris: ఫ్యాన్స్‌ రచ్చ.. జెన్నీకి కూడా ఒక్క అవార్డు ఇవ్వొచ్చుగా!

ఆర్‌ఆర్‌ఆర్‌ .. ఆర్‌ఆర్‌ఆర్‌ .. ఆర్‌ఆర్‌ఆర్‌...(RRR)

ఎక్కడ విన్నా ఇదే పేరు మార్మోగిపోతుంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వాప్తంగా కీర్తి సాధించిన ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకుంటూ ట్రెండింగ్‌లో ఉంది. గోల్డెన్‌ గ్లోబ్‌ (Golden globe award) అవార్డుతోపాటు గత శుక్రవారం కాలిఫోర్నియాలో జరిగిన ‘హాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డు వేదికపై ఐదు కేటగిరీల్లో పురస్కారాలు అందుకుంది. దీనికి హాజరు కాని ఎన్టీఆర్‌(NTR), ఆలియాభట్‌లకు ఈ వారం అవార్డులు పంపిస్తామని హెచ్‌సీఏ పేర్కొంది. అయితే మొన్నటి వరకూ ‘చరణ్‌కు (Ram charan) మాత్రమే అవార్డులు వస్తున్నాయి.. తారక్‌కు రావడం లేదని’ ఎన్టీఆర్‌ అభిమానులు నెట్టింట చేసిన రచ్చకు ‘హెచ్‌సీఏ దిగొచ్చి.. ఎన్టీఆర్‌కు అవార్డు ఉంది అని ట్విట్టర్‌ వేదికగా సెలవిచ్చింది. దాంతో అభిమానుల్లో కాస్త వేడి తగ్గింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో (RRR) రామ్‌చరణ్‌ సరసన సీతగా నటించిన అలియా భట్‌ (ALIA bhatt) కూడా అవార్డు సొంతం చేసుకుంది. అందరికి అవార్డులు రావడం సంతోషంగానే ఉంది కానీ.. తారక్‌ సరసన నటించిన మా జెన్నీని వదిలేయడం కొంచెం అసంతృప్తిగా అనిపిస్తోంది అని ఒలీవియా మోరీస్‌ను( Olivia Morris) అభిమానించే వాళ్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తారక్‌ పక్కన ఎంతో అద్భుతంగా నటించిన జెన్నీకి ఒక్క అవార్డు కూడా రాకపోవడమేంటీ.. ఆమెకు కూడా ఒక అవార్డు ఇస్తే ఆమె అభిమానులుగా మేం సంతోషిస్తాం’’ అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అవార్డులు అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ఒలీవియా. అవార్డు అందుకున్న ఫొటో షేర్‌ చేసింది. అయితే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చేసిన రచ్చకు స్పందించిన హెచ్‌సీఏ ఒలీవియా విషయంలో కూడా స్పందిస్తుందేమో చూడాలి! (Hollywood Critics associations)

Updated Date - 2023-03-04T10:33:30+05:30 IST