Viral Video: రక్తసంబంధమంటే ఇదే కదా.. ఏడేళ్ల తర్వాత అన్నయ్యను చూసిన ఆనందంలో ఆ చెల్లి ఏం చేసిందో చూడండి..!
ABN , First Publish Date - 2023-09-04T15:42:20+05:30 IST
అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దాదాపు ఏడేళ్ల తర్వాత తన సోదరుడిని చూసిన సోదరి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధానికి (Brother and sister bonding) సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దాదాపు ఏడేళ్ల తర్వాత తన సోదరుడిని (Brother) చూసిన సోదరి (Sister) తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు (Emotional Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ తన ఆఫీస్‌లో పని చేసుకుంటూ ఉండగా అక్కడకు ఆమె సోదరుడు వస్తాడు. లోపలి నుంచి అతడిని చూసిన యువతి షాక్‌కు గురవుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని గట్టిగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వీడియో goodnews_movement అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యువతి కెనడాలో జాబ్ చేస్తుండగా, ఆ యువకుడు అమెరికాలో ఉంటున్నాడు. గత ఏడేళ్లుగా వారిద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు.
Weird Facts: నమ్మలేని నిజమిది.. ఈ ఒక్క కారణం వల్లే 5 ఏళ్లు తగ్గిపోతున్న భారతీయుల ఆయుర్థాయం..!
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 66 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు చాలా ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు. ``చాలా ఎమోషనల్``, ``వారిద్దరూ సంతోషంగా ఉండాలి``, ``గొప్ప అనుబంధం``, ``నాకు మా అక్క గుర్తుకు వచ్చింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.