Height Increasing: పొట్టిగా ఉండటంతో ఎవరూ పెళ్లిచేసుకోవడం లేదని.. రూ.66 లక్షలు ఖర్చు చేసి ఎత్తు పెంచుకున్నాడు..!
ABN , First Publish Date - 2023-06-26T15:49:56+05:30 IST
తక్కువ ఎత్తు ఉండే వాళ్లు మానసికంగా, సామాజికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆత్మన్యూనతతో బాధపడుతుంటారు. అలాగే కొన్ని ఉద్యోగాల విషయంలో కూడా తక్కువ ఎత్తు ఉన్న వారు అర్హత సాధించలేరు. అమెరికాకు చెందిన ఒక అబ్బాయికి పై సమస్యలతో పాటు మరో సమస్య కూడా ఎదురైంది.
తక్కువ ఎత్తు (Low Height) ఉండే వాళ్లు మానసికంగా, సామాజికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆత్మన్యూనతతో బాధపడుతుంటారు. అలాగే కొన్ని ఉద్యోగాల విషయంలో కూడా తక్కువ ఎత్తు ఉన్న వారు అర్హత సాధించలేరు. అమెరికా (America)కు చెందిన ఒక అబ్బాయికి పై సమస్యలతో పాటు మరో సమస్య కూడా ఎదురైంది. తక్కువ ఎత్తు ఉన్న ఆ అబ్బాయిని ఏ అమ్మాయి కూడా ఇష్టపడడం లేదు. దీంతో ఆ అబ్బాయి ఎలాగైనా సరే ఎత్తు పెరగాలని నిర్ణయించుకున్నాడు (Viral News).
అమెరికాలోని అట్లాంటాలో నివసిస్తున్న డైంజెల్ సిగర్స్ అనే వ్యక్తి వయస్సు 27 సంవత్సరాలు. అతని ఎత్తు మాత్రం 5 అడుగుల 5 అంగుళాలే. అతడు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పడు అతనికి హైట్ ప్రతిబంధకంగా మారింది. ఏ అమ్మాయి అతడిని ఇష్టపడలేదు. ప్రతి అమ్మాయి అతణ్ని తిరస్కరించేది. పొట్టిగా ఉండడం వల్ల అతను చాలా ఇబ్బందిపడ్డాడు. దాంతో అతడు తన హైట్‌ను పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. హైట్ పెంచుకునే మార్గం గురించి ఇంటర్నెట్‌లో శోధించాడు. అప్పుడు అతనికి ఓ విషయం తెలిసింది. ఎత్తును పెంచే శస్త్రచికిత్స ఒకటి ఉందని తెలుసుకున్నాడు (Height increasing Surgery).
MS Dhoni: విమానంలో క్యాండీక్రష్ ఆడుతున్న ధోనీకి చాక్లెట్లు ఆఫర్ చేసిన ఎయిర్ హోస్టెస్.. ధోనీ రియాక్షన్ ఏంటంటే..
సిగర్స్ వెంటనే అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు. గతేడాది చివర్లో ఎత్తు పెంచేందుకు సర్జరీ చేయించుకున్నాడు. ఈ సర్జరీలో అతని ఎముక సగానికి కోసి అందులో రాడ్‌ని అమర్చారు. అలాగే బయట నుంచి ఆ రాడ్‌ను కలుపుతూ ఓ ఫిక్సేటర్ కూడా అమర్చారు. ఈ శస్త్రచికిత్స కోసం సిగర్స్ 66 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశాడు. శస్త్రచికిత్స తర్వాత 90 రోజుల తర్వాత ఆ ఫిక్సేటర్‌ను తొలగించారు. ఇక, ఎముక లోపల అమర్చిన రాడ్‌ను సంవత్సరం తర్వాత తొలగిస్తారు. ఈ సర్జరీ తర్వాత సిగర్స్ ఫిజియోథెరపీ సహాయంతో నడవడం మొదలుపెట్టాడు. సిగర్స్ ఎత్తు ఇప్పుడు 5 అంగుళాలు పెరిగి 6 అడుగులకు చేరుకుంది.