Ex wife gets Rs.1.75 Crores: విడాకులు ఇస్తే సరిపోతుందనుకున్నాడు.. కానీ 25 ఏళ్లుగా భార్య చేసిన ఇంటి పనులకు ‘లెక్క’తేల్చిన కోర్టు..!

ABN , First Publish Date - 2023-03-10T16:37:47+05:30 IST

భార్యాభర్తలు అనగానే సుఖదుఖాల్లో పాలుపంచుకుని ముందుకు సాగిపోవడమే సంసారం. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు పోతే ఎలాంటి సమస్యలు రావు. అలా కాకుండా

Ex wife gets Rs.1.75 Crores: విడాకులు ఇస్తే సరిపోతుందనుకున్నాడు.. కానీ 25 ఏళ్లుగా భార్య చేసిన ఇంటి పనులకు ‘లెక్క’తేల్చిన కోర్టు..!
‘లెక్క’తేల్చిన కోర్టు..!

భార్యాభర్తలు అనగానే సుఖదుఖాల్లో పాలుపంచుకుని ముందుకు సాగిపోవడమే సంసారం. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు పోతే ఎలాంటి సమస్యలు రావు. అలా కాకుండా సీరియస్‌గా తీసుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ తర్వాత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కి విడిపోతుంటారు. ఇలా చాలా కుటుంబాలు దెబ్బతింటున్నాయి. పిల్లల భవిష్యత్ నాశనం అయిపోతుంటాయి.

ఇదిలా ఉంటే కొందరు మహిళలు కుటుంబం కోసం కెరీర్‌ను త్యాగం చేస్తుంటారు. అనుక్షణం భర్తకు అండగా ఉంటూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంటారు. ఒకవేళ హఠాత్తుగా వివాహ బంధం ముక్కలైతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఉన్నపళంగా బయటకు వెళ్లిపోవాల్సి వస్తే ఆ మహిళ భవిష్యత్ ఏంటి?. ఈ తరహా కేసులో స్పెయిన్‌కు చెందిన ఓ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతోంది.

స్పెయిన్‌ (Spain) కు చెందిన ఇవానా మోరల్‌ అనే మహిళ తన వైవాహిక జీవితంలో విభేదాలతో 2020లో భర్త నుంచి విడాకులు (Divorce) పొందింది. తన ఇద్దరు కుమార్తెలతో బయటకు వచ్చేసింది. అనంతరం న్యాయస్థానం (Court of law) ముందు ఆమె ఏం చెప్పిందంటే.. ‘మా వివాహ బంధం ముగిసిన రోజున నా చేతుల్లో ఏమీ లేదు. అన్నేళ్లు కేవలం ఇంటి పనులకే పరిమితం కావాల్సి వచ్చింది. అంతకాలం నా భాగస్వామికి అన్ని పనుల్లో సహకరించా. కానీ ఆర్థిక విషయాలను నాకు తెలియనిచ్చేవారు కాదు. అన్నీ ఆయన పేరు మీదే ఉన్నాయి’ అని ఆమె కోర్టుకు తెలిపింది. దీంతో ఆ జంటకు విడాకులు ఇచ్చిన న్యాయస్థానం.. కీలక తీర్పును వెలువరించింది. 25 ఏళ్ల పాటు ఆమె చేసిన ఇంటి పనులకు లెక్క కట్టింది. వార్షిక కనీస వేతనం ఆధారంగా ఆమె పనికి రూ.1.75 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అలాగే నెలవారీగా ఆమెకు భరణం, పిల్లల పోషణ కోసం డబ్బులు ఇవ్వాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Chit chat: బార్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్న మాటలతోనే వీడిన మర్డర్ మిస్టరీ.. అచ్చం అతడు సినిమాలో జరిగినట్టుగానే..!

Updated Date - 2023-03-10T16:38:45+05:30 IST