Share News

Cold Cough Remedy: చలికాలంలో ఉండే సమస్య ఇదే.. ఎంతకూ దగ్గు తగ్గడం లేదా..? జామ ఆకులతో ఇలా కనుక చేస్తే..!

ABN , First Publish Date - 2023-12-01T16:52:43+05:30 IST

జామ ఆకులను ఇలా వాడితే చాలు.. వేధించే దగ్గు అయినా తగ్గాల్సిందే..

Cold Cough Remedy: చలికాలంలో ఉండే సమస్య ఇదే.. ఎంతకూ దగ్గు తగ్గడం లేదా..? జామ ఆకులతో ఇలా కనుక చేస్తే..!

చలికాలపు వాతావరణం చాలా తొందరగా ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. పొడిగాలులు పీల్చడం వల్ల గొంతులో చికాకు ఏర్పాడుతుంది. ఇది జలుబు, దగ్గుకు కారణం అవుతుంది. సాధారణంగా దగ్గు వస్తే రెండు మూడు రోజుల్లో, కొన్ని సందర్బాలలో వారం రోజులలో తగ్గుతుంది. కానీ దగ్గు ఎంతకూ తగ్గకపోతే జాగ్రత్తగా ఉండాలి. దగ్గు తగ్గించుకోవడానికి జామ ఆకు అద్బుతంగా పనిచేస్తుంది. జామ ఆకులో విటమిన్-ఎ, విటమిన్-సి, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం సమృద్దిగా ఉంటాయి. జామ ఆకులతో కింది విధంగా చేస్తే వేధించే దగ్గు కూడా సులువుగా తగ్గిపోతుంది(Cough remedies with guava leaves).

చలికాలంలోనే కాకుండా ఏ కాలంలో అయినా దగ్గు అటాక్ చేసినప్పుడు జామ ఆకులను లవంగాల(cloves)తో కలిపి ఉపయోగించాలి. దీనివల్ల తొందరగా ఉపశమనం లభిస్తుంది.

గ్లాసు నీటిలో 4 నుండి 5 జామ ఆకులు వేయాలి. ఇందులోనే నాలుగైదు లవంగాలు కూడా వేసి బాగా ఉడికించాలి. ఈ నీటిని మెల్లిగా సిప్ బై సిప్ తాగాలి. కావాలంటే ఇందులో ఒక చెంచా తేనె లేదా బెల్లం కూడా కలిపి తాగచ్చు. ఇది తీసుకోవడం వల్ల గొంతులో చికాకు, బ్యాక్టీరియా తగ్గి దగ్గు తగ్గుముఖం పడుతుంది.

ఇది కూడా చదవండి: ఈ 8 కూరగాయలను.. ఇంట్లో ఉండే గార్డెన్‌లోనూ పెంచొచ్చు..!


జామ ఆకులు, లవంగాల పొడిని కూడా దగ్గు తగ్గించుకోవడానికి ఉపయోగించవచ్చు. జామఆకులు ఎండబెట్టి పొడి చేసుకోవాలి. లవంగాలను మిక్సీ వేసుకోవాలి. ఈ రెండింటిని నిల్వ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. కావాలంటే ఈ పొడిని నీళ్ళలో ఉడికించి అయినా తీసుకోవచ్చు. ఇది కేవలం దగ్గునే కాదు, లివర్ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది.

జామ ఆకులలోనూ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు, లవంగాలలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిసి దగ్గును సులువుగా తగ్గిస్తాయి.

(గమనిక: ఈ సమాచారం వైద్యులు, ఆరోగ్య నిపుణులు పేర్కన్న విషయాల ఆధారంగా రూపొందించబడింది. ఆరోగ్య సందేహాలు ఏమైనా ఉంటే వైద్యులను సంప్రదించం మంచిది)

ఇది కూడా చదవండి: Relationship Advice: ఎప్పుడూ ఉండే సమస్యలే కదా అని లైట్ తీసుకోవద్దు.. ఈ 4 టిప్స్‌ను పాటిస్తేనే సంసార జీవితం ఫుల్లు హ్యాపీ..!


Updated Date - 2023-12-01T16:52:45+05:30 IST