Chennai: రూ.2 వేలు బదిలీ చేస్తే.. రూ.753 కోట్లు జమయ్యాయి.. తరువాత ఏమైందంటే?

ABN , First Publish Date - 2023-10-08T18:52:35+05:30 IST

అదృష్టం ఎప్పుడు, ఎవర్ని, ఎలా వరిస్తుందో చెప్పలేం. కొందరికి రాత్రికి రాత్రే అదృష్ట దేవత తలుపు తడితే మరికొందరికి కాస్త ఆలస్యంగానైనా వరించొచ్చు. ఇప్పుడిదంతా ఎందుకనుకుంటున్నారా? ఓ వ్యక్తి అదృష్టం గురించే మాట్లాడుకోబోయేది.. ఆ వ్యక్తిది మామూలు అదృష్టం కాదు.. అతనికి ఒక్క క్లిక్‌తో లక్ష్మీ దేవి తలుపు తట్టింది.

Chennai: రూ.2 వేలు బదిలీ చేస్తే.. రూ.753 కోట్లు జమయ్యాయి.. తరువాత ఏమైందంటే?

తమిళనాడు: అదృష్టం ఎప్పుడు, ఎవర్ని, ఎలా వరిస్తుందో చెప్పలేం. కొందరికి రాత్రికి రాత్రే అదృష్ట దేవత తలుపు తడితే మరికొందరికి కాస్త ఆలస్యంగానైనా వరించొచ్చు. ఇప్పుడిదంతా ఎందుకనుకుంటున్నారా? ఓ వ్యక్తి అదృష్టం గురించే మాట్లాడుకోబోయేది.. ఆ వ్యక్తిది మామూలు అదృష్టం కాదు.. అతనికి ఒక్క క్లిక్‌తో లక్ష్మీ దేవి తలుపు తట్టింది. చెన్నైకి చెందిన ఓ ఫార్మసీ ఉద్యోగి తన ఫ్రెండ్‌కి రూ.2 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అనంతరం అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందోనని చెక్ చేశాడు.


ఇంకేముందీ.. అకౌంట్లో డబ్బులు చూసి షాక్ తిన్నాడు. రూ.రెండు వేలు బదిలీ చేశాక అతని అకౌంట్లో అక్షరాలా రూ.753 కోట్లు వచ్చి చేరాయి. వాటిని తీసుకుందామనుకునే లోపే బ్యాంకు వాళ్లు సమస్యను గుర్తించారు. క్షణాల్లో అతని అకౌంట్‌ని ఫ్రీజ్ చేశారు. ఇంకేముంది బాధితుడి ఆవేదన అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో చెన్నైలో ఇలాంటి ఘటనే జరిగింది. స్థానికంగా నివసించే క్యాబ్ డ్రైవర్ అకౌంట్లో రూ.9 వేల కోట్ల నగదు జమ అయింది. సంబంధిత బ్యాంకు సమస్యను గుర్తించి అకౌంట్ ఫ్రీజ్ చేసి డబ్బు తిరిగి తీసుకుంది.

Updated Date - 2023-10-08T18:53:48+05:30 IST