Budati Venkateswarlu: ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు రచించిన 'అంతరాలోకనం' ఆవిష్కరణ

ABN , First Publish Date - 2023-01-25T19:36:12+05:30 IST

కాశీ హిందూ విశ్వవిద్యాలయం (Banaras Hindu University) తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు (Budati Venkateswarlu) రచించిన ''అంతరాలోకనం'' (Antaraalookanam) అనే సాహిత్య వ్యాసాల సంకలనాన్ని వారణాసిలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న కే.సత్యనారాయణ (K Satyanarayana) ఆవిష్కరించారు.

Budati Venkateswarlu: ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు రచించిన 'అంతరాలోకనం' ఆవిష్కరణ

వారణాసి: కాశీ హిందూ విశ్వవిద్యాలయం (Banaras Hindu University) తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు (Budati Venkateswarlu) రచించిన ''అంతరాలోకనం'' (Antaraalookanam) అనే సాహిత్య వ్యాసాల సంకలనాన్ని వారణాసిలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న కే.సత్యనారాయణ (K Satyanarayana) ఆవిష్కరించారు. సాహిత్యంలో అనుబంధమున్న ప్రతిఒక్కరూ చదవాల్సిన వ్యాస సంకలనమని బూదాటి పుస్తకాన్ని ఆయన ప్రశంసించారు.

BOOK-RELEASE1.jpg

మరాఠి విభాగ శాఖాధ్యక్షులైన ఆచార్య ప్రమోద్ పడ్వాల్ ఈ సభకు అధ్యక్షత వహించారు. సాహిత్యంతో సమాజానికి గల అనుబంధాన్ని ఆయన విశ్లేషించారు. సాహిత్యంలో జరగాల్సిన పరిశోధనకు ఈ ''అంతరాలోకనం'' ఒక మార్గసూచి అని పేర్కొన్నారు. ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ఆచార్య విజయ బహుదూర్ సింగ్ మాట్లాడుతూ.. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖ ఉత్తర భారత౦ మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు. తెలుగుశాఖ అధ్యక్షులైన ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు కృషి అభినందనీయని ఆయన అన్నారు. కాగా ‘అంతరాలోకనం’లోని విషయాలను ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి సమీక్షించారు. ఆ కార్యక్రమానికి డా. టి. జగదీశన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుశాఖ, భారతీయ భాషల విభాగంలోని పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

BKR2.jpg

Updated Date - 2023-01-25T19:39:53+05:30 IST