Share News

Bear Grylls: మగవాళ్లు ఏడిస్తే జరిగేదేంటి? బేర్ గ్రిల్స్ బయటపెట్టిన షాకింగ్ నిజాలివీ..!

ABN , Publish Date - Dec 17 , 2023 | 09:55 AM

ఒళ్లు గగుర్పోడిచే సాహాసాలు చేసే బేర్ గ్రిల్స్ మగవారి ఏడుపు గురించి షాకంగ్ నిజాలు బయటపెట్టాడు.

Bear Grylls: మగవాళ్లు ఏడిస్తే జరిగేదేంటి? బేర్ గ్రిల్స్ బయటపెట్టిన షాకింగ్ నిజాలివీ..!

బేర్ గ్రిల్స్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. బ్రిటీష్ సర్వైవల్ హోస్ట్ అయిన ఈయన అడవుల్లో, కొండల్లో ఒంటరిగా ప్రయాణిస్తూ ప్రమాదాలతో సహవాసం చేస్తుంటారు. ఇవన్నీ చూస్తే ఒళ్లు గగుర్పాటుకు లోనవుతుంది. ఇన్ని సాహసాలు చేసే బేర్ గ్రిల్స్ ఏడుపు గురించి మాట్లాడటం కాస్త వింతగా అనిపిస్తుంది. అందులోనూ మగవాళ్లు ఏడిస్తే జరిగేదేంటో.. ఆయన ఏం చెప్పాడో తెలిస్తే షాకవుతారు.

ఇంట్లో మగపిల్లలు ఏడుస్తుంటే.. 'ఛీ.. ఆడపిల్లలా ఆ ఏడుపేంటి? మగపిల్లలు అలా ఏడవకూడదు' 'మగవాడివి అయి ఉండి అలా పిరికి వాడిలా, భయస్తుడిలా ఉంటావేంటి? అలా ఉండకూడదు' అని అంటూ ఉంటారు. మగవాళ్లంటే ఎప్పుడూ గంభీరంగా ఉండాలని చాలా మంది అభిప్రాయం. కానీ మగవారు ఏడుపు, భయం, బాధ వంటి ఎమోషన్స్ ను అణిచివేయడం వల్ల వారిలో కోపం, అసహనం స్థాయిలు పెరుగుతాయని. ఇవి డిప్రెషన్ కు దారితీస్తాయని అంటున్నారు. ఈ ఎమోషన్స్ ను అణిచివేయడం వల్లే అవి మగవారిని కఠినంగా ఉంచుతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల మగవారి మానసిక ఆరోగ్యంపై(Men's mental health) ఒక యాప్ ను ప్రారంభించిన సందర్బంగా బేర్ గ్రిల్స్(Bear Grylls) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. "నేను కూడా ఏడుస్తాను. అందుకే ఒంటరి ప్రయాణాలలో ఇంత ధైర్యంగా ఉంటాను" అని అతను ఆసక్తికరవిషయాలు చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: పిల్లలు ఉదయాన్నే నిద్రలేస్తే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!


దుఃఖమే కాదు, ఎక్కువ సంతోషం కలిగినా కళ్ళలో నీళ్లు వస్తాయి. అయితే ఏడ్చేటప్పుడు వచ్చే కన్నీళ్ళు శరీరంలో బోలెడు మార్పులకు కారణం అవుతాయి.

ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సరిచేస్తుంది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఏడ్చినపుడు ఆక్సిటోసిన్, ఎండార్పిన్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి శారీరక, మానసిక నొప్పులను కూడా తగ్గిస్తాయి.

ఒత్తిడికి ప్రధాన కారణం కార్టిసాల్ హార్మోన్. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఇది శరీరంలో ఎక్కువగా విడుదల అవుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగడం, గుండెకు ప్రమాదం కలగడం జరుగుతుంది. రక్తపోటు సమస్యలు మగవారిలోనే ఎక్కువగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. ఆడవాళ్లు ఏడ్చినంతగా మగవారు ఏడ్చరు. అందుకే సందర్భానుసారంగా.. కనీసం ఒంటరిగా అయినా మగవారు ఏడుస్తూ ఉంటే కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది.

ఇది కూడా చదవండి: నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందంటే..!


మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకీర్తి(Vikas Divyakirti) కూడా అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలనే విషయంలో ఒక సలహా ఇచ్చారు. పెళ్లిచూపుల్లోనే మీరెప్పుడైనా ఏడ్చారా అని అబ్బాయిని ప్రశ్నించమని అమ్మాయిలకు సలహా ఇచ్చారు. చిన్నప్పుడు తప్ప జీవితంలో అస్సలు ఏడవలేదని చెప్పే అబ్బాయిలను పెళ్లి చేసుకోవద్దని వారికి ఎమోషన్స్, ఫీలింగ్స్ ను అర్థం చేసుకోవడం తెలియదని చెప్పారు.

ఇది కూడా చదవండి: Health Tips: కళ్లజోడు వాడుతుంటారా ? రోజూ ఈ గింజలను కొన్ని తీసుకోండి చాలు.. !!


Updated Date - Dec 17 , 2023 | 09:55 AM