పిల్లలు ఉదయాన్నే నిద్రలేస్తే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!

పిల్లలు ఉదయాన్నే నిద్రలేస్తే మార్నింగ్ డ్రింక్,  అల్పాహారం అస్సలు మిస్ కారు. పిల్లలు ఎదుగుదల బాగుంటుంది.

పొద్దున్నే నిద్ర లేచే పిల్లల మెదడు పనితీరు అద్భుతంగా ఉంటుంది. పిల్లలలో నైపుణ్యాలు, ఆలోచనలు, వారి పనితీరు సూపర్ కిడ్ ను తలపిస్తాయి.

 రాత్రి తొందరగా పడుకోవడం అలవాటు అవుతుంది. ఇది పిల్లలలో ఏకాగ్రతను,  జ్ఞాపకశక్తిని పెంచుతుంది.  చదువులో చురుగ్గా ఉంటారు.

త్వరగా నిద్రపోవడం, త్వరగా లేవడం వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉంటారు.

ఉదయాన్నే నిద్రలేచే పిల్లలు సమయానికి పనులన్నీ పూర్తీచేసుకోగలుగుతారు.   అలసట, చిరాకు వంటివి మచ్చుకైనా కనిపించవు.

ఉదయం నిద్ర లేస్తే పిల్లలకు కూడా వ్యాయామం చేసే సమయం ఉంటుంది. పెద్దలతో పాటు ధ్యానం, యోగా వంటివి చేస్తే ధృడంగా ఉంటారు.

 జీవనశైలి దెబ్బతినడం వల్ల వచ్చే ఊబకాయం, థైరాయిడ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వంటి వ్యాధుల ప్రమాదం తప్పుతుంది.

 ఉదయాన్నే నిద్ర లేచే పిల్లలు చదువులో చాలా చురుగ్గా ఉంటారు. తరగతిలో గ్రేడ్ లు, మార్కులు, ర్యాంకులు, ఆటలు ఇలా అన్నింటిలో ప్రతిభ చూపిస్తారు.

 చదువు, ఇష్టాఇష్టాలు, అప్పగించిన పనులు పూర్తీచెయ్యడానికి సమయాన్ని బ్యాలెన్స్ చేసుకునే మెంటాలిటీ కేవలం ఉదయం నిద్రలేవడం అనే అలవాటు వల్ల అలవడుతుంది.