Funny Video: అయ్యయ్యో.. ఆంటీ.. ఎంత పనయింది..? చిన్న పిల్లల్లా జారుడు బల్లపై ఆటాడుకుందామనుకుంటే ఇలా జరిగిందేంటి..?

ABN , First Publish Date - 2023-03-16T13:23:22+05:30 IST

బాల్యం అనేది దేవుడు ఇచ్చిన వరం. అప్పుడు చేసే అల్లర్లు, సరదా ఆటలు మళ్లీ జీవితంలో రావు.

Funny Video: అయ్యయ్యో.. ఆంటీ.. ఎంత పనయింది..? చిన్న పిల్లల్లా జారుడు బల్లపై ఆటాడుకుందామనుకుంటే ఇలా జరిగిందేంటి..?

Funny Video: బాల్యం అనేది దేవుడు ఇచ్చిన వరం. అప్పుడు చేసే అల్లర్లు, సరదా ఆటలు మళ్లీ జీవితంలో రావు. అలా వస్తే బావుండు అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఏం లాభం అవి తిరిగి వచ్చే విషయాలు కావు కదా. అయితే, అప్పుడప్పుడు చిన్ననాటి స్మృతులను నెమరేసుకునేందుకు కొన్ని సందర్భాలు మనకు దొరుకుతుంటాయి. ఇదిగో ఈ వీడియోలో ఉన్న ఆంటీకి కూడా అలాంటి ఓ సందర్భంలో ఒక అవకాశం వచ్చింది. అంతే.. పాపం ఆంటీ.. తన చిన్ననాటి గుర్తులను నెమరేసుకునేందుకు రెడీ అయింది. కానీ, ఆమె అనుకుంది ఒకటైతే.. అక్కడ జరిగింది మరోకటి. ఇంకేముంది ఆమెను చూసి నవ్వుకోవడం అక్కడ ఉన్నవారి వంతైంది.

ఈ ఘటన తాలుకూ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఓ పార్కులో ఆంటీ చిన్న పిల్లల్లా జారుడు బల్లపై ఆటాడుకుందామనుకుంది. దానిపై ఎక్కి ఎంతో ఉత్సాహంగా కిందికి జారింది. కానీ, కిందికి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ చేయలేక జారుడు బల్లపై నుంచి అదే స్పీడ్‌లో వచ్చి నెలను తాకింది. ఆ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌ కెమెరాలో బంధించాడు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో ఆంటీ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోకు ఇన్‌స్టా‌గ్రామ్‌లో 4.51లక్షల లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కెనడాలో 700 మంది భారతీయ విద్యార్థులకు బహిష్కరణ నోటీసులు.. కారణమేంటంటే..

Updated Date - 2023-03-16T13:23:28+05:30 IST