The Legend Movie OTT Streaming: నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసిన శరవణన్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎందులో అంటే..

ABN , First Publish Date - 2023-03-03T15:05:50+05:30 IST

తమిళనాడుకి చెందిన పెద్ద బిజినెస్‌మేన్ అరుళ్ శరవణన్ (Arul Saravanan) గతేడాది హీరోగా మారిన సంగతి తెలిసిందే.

The Legend Movie OTT Streaming: నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసిన శరవణన్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎందులో అంటే..

తమిళనాడుకి చెందిన పెద్ద బిజినెస్‌మేన్ అరుళ్ శరవణన్ (Arul Saravanan) గతేడాది హీరోగా మారిన సంగతి తెలిసిందే. 53 ఏళ్ల వయస్సు తన అభిరుచిని అనుసరిస్తూ ‘ది లెజెండ్’ (The Legend) అనే చిత్రంలో నటించాడు. జేడీ-జెర్రీ దర్శకద్వయం డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా, రాయ్ లక్ష్మి హీరోయిన్లుగా నటించగా.. హార్వీస్ జయరాజ్ సంగీతం అందించాడు. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. ఈ చిత్రం అప్పట్లో హాట్‌ టాపిక్ అయ్యింది. దానికి కారణం ఈ సినిమా బడ్జెట్. తన మొదటి సినిమా కోసం శరవణన్ దాదాపు రూ.60 కోట్లు ఖర్చు పెట్టడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అదే సమయంలో శరవణన్ వయస్సుపై సైతం విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. (OTT Streaming)

అయినా.. అవేవి పట్టించుకోకుండా శరవణన్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మామూలు సూపర్ హిట్ చిత్రాలే నెల రోజుల్లో ఓటీటీలోకి వస్తున్న క్రమంలో.. ‘ది లెజెండ్’ మాత్రం దాదాపు 7 నెలల తర్వాత స్ట్రీమింగ్ కావడం విశేషం. ఈ మూవీని మార్చి 3 మధ్యాహ్నం గం.12.30 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. హాట్‌స్టార్ యాజమాన్యం సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ని షేర్ చేసింది. అయితే తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు అందులో రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-03T15:05:50+05:30 IST