NTR 30: జూనియర్ ఎన్‌టీఆర్‌‌కు విలన్ ఫిక్స్ అయ్యారా..?

ABN , First Publish Date - 2023-02-09T16:33:33+05:30 IST

‘ఎన్‌టీఆర్ 30’ ని యువ సుధా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. పాన్ ఇండియాగా రూపొందించనుంది. అందువల్ల విలన్‌ను ఇతర ఇండస్ట్రీల నుంచి తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట.

NTR 30: జూనియర్ ఎన్‌టీఆర్‌‌కు విలన్ ఫిక్స్ అయ్యారా..?

‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత జూనియర్ ఎన్‌టీఆర్‌ (Junior NTR) కు దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందువల్ల ఆయన నుంచి నెక్ట్స్ వచ్చే ప్రాజెక్టుల కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తన తర్వాతి సినిమాలు ‘ఆర్ఆర్ఆర్’ ను మించి ఉండాలని తారక్ భావిస్తున్నారు. అందువల్ల ఇంత వరకు కొత్త చిత్రాలను పట్టాలెక్కించలేదు. ఇప్పటికే కొరటాల శివ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి. వర్కింగ్ టైటిల్స్‌గా ‘ఎన్‌టీఆర్ 30’ (NTR 30), ‘ఎన్‌టీఆర్ 31’ (NTR 31) అని వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘ఎన్‌టీఆర్ 30’ కి సంబంధించిన ఓ అప్‌డేట్ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..

‘ఎన్‌టీఆర్ 30’ ని యువ సుధా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. పాన్ ఇండియాగా రూపొందించనుంది. అందువల్ల విలన్‌ను ఇతర ఇండస్ట్రీల నుంచి తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ (Vikram), బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) తో చర్చలు జరుపుతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరు ప్రతినాయకుడిగా నటించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు.

NTR-30-Villain.jpg

‘ఎన్‌టీఆర్ 30’ కి ‘దేవర’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. పోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెరకెక్కనుంది. అందుకు సంబంధించి రెండు భారీ సెట్స్‌ను మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకొనుంది. మార్చి 20 నుంచి లేదా అంతకు మందే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి

Janhvi Kapoor: నెపోకిడ్ ట్యాగ్‌పై స్పందించిన జాన్వీ

Prakash Raj: ‘ది కశ్మీర్ ఫైల్స్’ చెత్త సినిమా.. భాస్కర్ అవార్డు కూడా రాదంటున్న నటుడు

Updated Date - 2023-02-09T16:43:23+05:30 IST