Prakash Raj: ‘ది కశ్మీర్ ఫైల్స్’ చెత్త సినిమా.. భాస్కర్ అవార్డు కూడా రాదంటున్న నటుడు

ABN , First Publish Date - 2023-02-08T16:31:03+05:30 IST

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashhmir Files). లో బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి వివాదాలు ఎదుర్కొంటూనే ఉంది.

Prakash Raj: ‘ది కశ్మీర్ ఫైల్స్’ చెత్త సినిమా.. భాస్కర్ అవార్డు కూడా రాదంటున్న నటుడు

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashhmir Files). లో బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి వివాదాలు ఎదుర్కొంటూనే ఉంది. గోవా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ (IFFI) జ్యూరీ హెడ్ న‌ద‌వ్ లపిడ్ (Nadav Lapid) కొన్ని రోజుల క్రితమే ఇదో వల్గర్ సినిమా అన్నారు. ఆ ఘటనను మరచిపోకముందే నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) అదో చెత్త చిత్రం అని చెప్పారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) వంటి వారు దేశ ప్రజలను ప్రతిసారి పిచ్చోళ్లను చేయలేరని వ్యాఖ్యానించారు.

కేరళలో జరిగిన ఓ ఈవెంట్‌కు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనేక సినిమాలపై మాట్లాడారు. ‘పఠాన్’ (Pathaan) చిత్రంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాపై నిషేధం విధించాలన్న వారిని ఇడియట్‌గా అభివర్ణించారు. ‘‘.. ‘పఠాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. అందువల్లే ఈ సినిమాపై ఇడియట్స్ బ్యాన్ విధించాలంటున్నారు. కానీ, నరేంద్ర మోదీ మూవీని మాత్రం ఈ ఇడియట్స్ చూడలేదు. ఈ సినిమా రూ.30కోట్ల వసూళ్లను కూడా సాధించలేదు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనేది చెత్త సినిమా. ఈ చిత్రాన్ని నిర్మించడం సిగ్గుచేటు. ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా ఉమ్మేసింది. అయినప్పటికీ, ఆ సినిమా డైరెక్టర్ మాత్రం ఆస్కార్ తనకేందుకు రావడం లేదంటున్నారు. ఆయనకు ఆస్కార్ కాదు కదా భాస్కర్ అవార్డు కూడా రాదు. అటువంటివన్ని పనికి రాని చిత్రాలు’’ అని ప్రకాష్ రాజ్ చెప్పారు.

కశ్మీరీ పండిట్స్‌పై 1990లో జరిగిన హత్యకాండను ఆధారంగా చేసుకుని ‘ది కశ్మీర్ ఫైల్స్’ ను రూపొందించారు. ఆ కాలంలో కశ్మీరీ పండిట్స్ ఎదుర్కొన్న ఇబ్బందులను సినిమాలో చూపించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ కు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి, జీ స్టూడియోస్ కలసి ఐ యామ్ బుద్ధ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నిర్మించాయి. ‘ది కశ్మీర్ ఫైల్స్’ గతేడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-02-08T16:36:08+05:30 IST