Amazing Photo: ఈ ఫొటోలో మీకేం కనిపిస్తోంది.. ఎవరు తీశారో కానీ.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

ABN , First Publish Date - 2023-08-21T14:29:11+05:30 IST

చూడటానికి మురికివాడలా కనిపించే ఈ ఫోటోను బాగా పరిశీలనగా చూస్తే షాకవడం ఖాయం.

Amazing Photo: ఈ ఫొటోలో మీకేం కనిపిస్తోంది.. ఎవరు తీశారో కానీ.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. కానీ కొన్ని ఫోటోలు మాత్రం పైకి ఒకవిధంగా, దాన్ని బాగా పరిశీలనగా చూసిన తరువాత మరొకవిధంగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో మొదట చూసిన వారు ఇదేంటీ.. దీంట్లో ఏముంది అంతగా? అని పెదవి విరుస్తారు. కానీ దీన్ని సరిగ్గా గమనిస్తే అవాక్కవుతారు. అంతేకాదు ఈ ఫోటో తీసినవారిని మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ ఫోటో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఫోటోలు చాలా గొప్ప జ్ఞాపకాలు. ఇవి చరిత్రను ప్రతిబింబిస్తాయి. వెనుకటి కాలాన్ని తమలో బంధించుకుంటాయి. ఫోటోగ్రఫీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫోటోలను చాలా ప్రత్యేకంగాతీయడం ఫోటోగ్రఫీలో ఉన్న ప్రతిభగా చెప్పవచ్చు. ఓ ప్రత్యేకమైన ఫోటో(Photo) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూడగానే మురికివాడలా(Slum area) కనిపిస్తుంది. మురికివాడ ప్రాంతంలో అటు, ఇటు కొన్ని ఇళ్లు ఉన్నాయి. వాటి మధ్యన ఒక మురికి కాలువ పొడవునా వ్యాపించి ఉంది. దీన్ని చూడగానే అందరికీ మొదట ఇదే కనిపిస్తుంది. ఇందులో వింత ఏముంది అని పెదవి విరిచేవారు కూడా ఉండొచ్చు. కానీ ఆ తరువాత బాగా గమనిస్తే విచారంగా ఉన్న ఒక మనిషి ముఖం ఆ ఫోటోలో కనిపిస్తుంది(man face in slum photo). ఫోటోలో ఉన్నఇళ్ళలో కొన్ని కళ్ళుగానూ, ముక్కు గానూ, పెదవులుగానూ కనిపిస్తాయి. మరొక విచిత్రం ఏమిటంటే ఆ కళ్లు విచారంగా ఉన్నట్టు కనిపించడం. ఈ ఫోటోను కాస్త దూరం నుండి చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోటో ఎవరు తీసారో తెలియదు.

Health Tips: బూడిద గుమ్మడికాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? ఇన్నాళ్ళు ఇంటికి దిష్టి తగలకుండా కడతారనుకున్నాం కానీ..



ఈ ఫోటోను Tansu YEGEN అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'గొప్ప ఫోటో' అనే క్యాప్షన్ ను మెన్షన్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. కొందరు దీన్ని AIజనరేటర్ అని పిలుస్తున్నారు. మరికొందరు ఫోటోషాప్ లో చేసిన ఎడిటింగ్ అని అంటున్నారు. 'ఇది చాలా అధ్బుతంగా ఉంది' అని ఒకరు కామంట్ చేసారు. 'చుట్టూ ఉన్న పరిసరాలలో ఇలాంటి ప్రత్యేకతను చూడాలంటే అది కేవలం ప్రతిభావంతుడైన ఫోటోగ్రాఫర్ కే సాధ్యం'అని ఫోటోగ్రాఫర్ మీద ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: ఈ సైకిల్ ఓనర్ ట్యాలెంట్ మాములుగా లేదుగా.. కారుకు ధీటుగా ఇతను క్రియేట్ చేసిందేంటో చూస్తే అవాక్కవడం ఖాయం..


Updated Date - 2023-08-21T14:30:51+05:30 IST