Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవాళ్లంతా తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది.. అందరూ కామన్‌గా చేసే ఈ మిస్టేక్ వల్లే..!

ABN , First Publish Date - 2023-04-25T21:33:19+05:30 IST

ఆధార్ కార్డ్ విషయంలో చాలా మందికి ఈ సీక్రెట్ విషయం తెలియదు..

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవాళ్లంతా తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది.. అందరూ కామన్‌గా చేసే ఈ మిస్టేక్ వల్లే..!

ఇప్పట్లో ఆధార్ కార్డ్ లేకుంటే ఏ పనీ జరగదు . బ్యాంకింగ్ కు సంబంధించిన పనుల నుండి ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవడం వరకూ ఆధార్ ఉండాలి. పెద్దవారు బస్ ఎక్కేటప్పుడు బస్ ఛార్జీ తగ్గించుకోవడం నుండి, ఎక్కడైనా హోటల్స్ లో స్టే చేయడం వరకు ఆధార్ కార్డ్ అడుగుతారు. స్కూల్స్, హాస్పిటల్స్, ఉద్యోగాలు, బ్యాంకింగ్ ఇలా ప్రతీదానికి ఆధార్ తప్పనిసరి. కానీ ఆధార్ గురించి చాలా మందికి తెలియని విషయం ఒకటుంది అదే రెండు రకాల ఆధార్ కార్డ్ లు అందుబాటులో ఉన్నాయిప్పుడు. ఒకటి సాధారణ ఆధార్ కార్డ్(common Aadhar card) కాగా.. మరొకటి మాస్క్డ్ ఆధార్ కార్డ్(Masked Aadhar card). అసలు ఈ మాస్క్డ్ ఆధార్ కార్డ్ ఏమిటి? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇది ఎలా పొందాలి పూర్తీగా తెలుసుకుంటే..

ఇప్పట్లో ఆధార్ కార్డ్ లేకుండా ఏ పనీ జరగదు. మరీ ముఖ్యంగా బ్యాంకులో ఆర్థిక లావాదేవీలు(bank transactions) అన్నీ ఆధార్ కార్డ్ తో ముడిపడి ఉంటాయి. దీన్ని అలుసుగా తీసుకుని చాలామంది బ్యాంకు ఖాతాల్లో డబ్బును సులువుగా కాజేస్తారు. బ్యాంకులు కూడా ఈ విషయంలో కస్టమర్లదే తప్పని చెబుతాయి. ఇలా మోసపోయే పని తప్పించుకోవడానికి UIDAI ద్వారా మాస్క్డ్ ఆధార్ కార్డ్ ఎంచుకునే వెసులుబాటు ఉంది. దీని ద్వారా డిజిటల్ సంతకం చేయబడిన ఆధార్ కార్డ్ పొందవచ్చు. ఇందులో కార్డు మీద ఉన్న మొత్తం నెంబర్లలో మొదటి ఎనిమిది నెంబర్లు కనిపించవు(hidden first eight numbers), చివరి నాలుగు నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి(appear last four numbers). దీనివల్ల ఆధార్ కార్డ్ యూజర్ వివరాలు ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ మాస్క్డ్ ఆధార్ కార్డ్ ఉపయోగించుకుంటే ఇతరుల ద్వారా జరిగే అర్థిక నష్టానికి కళ్ళెం వేయవచ్చు.

Viral Video: ఓరి దేవుడో.. వీళ్లేం మనుషులండీ బాబూ.. గులాబీ పువ్వును నూనెలో ఫ్రై చేసి.. మసాలా దట్టించి మరీ తినేస్తున్నారుగా..!


ఈ మాస్క్డ్ ఆధార్ కార్డును ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..(How to download masked Aadhar card?)

ముందుగా uidai.gov.in అనే వెబ్సైట్(uidai website) కు వెళ్లాలి. ఈ వెబ్సైట్ లో 'డౌన్లోడ్ ఆధార్'(Download Aadhar) అనే ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో వారు సూచించిన విధంగా ఆధార్ నెంబర్, పేరు, పిన్ కోడ్ పూరించాల్సి(Aadhar number, name, Pincode) ఉంటుంది. ఇది పూరించాక రెండు ఆప్షన్స్(two options) వస్తాయి. ఒకటి సాధారణ ఆధార్ కార్డ్(Regular Aadhar card), రెండవది మాస్క్డ్ ఆధార్ కార్డ్(Masked Aadhar card). మొదటి దాన్ని ఎంచుకుంటే సాధారణ ఆధార్ కార్డ్ కాపీ వస్తుంది. రెండవ దాన్ని ఎంచుకుంటే మాస్క్డ్ ఆధార్ కార్డ్ కాపీ అందుతుంది. మనకు రెండవది కావాలి కాబట్టి మాస్క్డ్ ఆధార్ ను ఎంపిక చేసుకోవాలి(Select Masked Aadhar card). దీన్ని ఎంపిక చేసుకున్న తరువాత send OTP ని ఎంచుకోవాలి. దీన్ని ఎంచుకున్న తరువాత ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నెంబర్(Aadhar linked mobile number) కు OTP వస్తుంది. దీన్ని పూరించిన తరువాత ధృవీకరణ పూర్తీ అవుతుంది. దీని తరువాత 'డౌన్లోడ్ ఆధార్'(download Aadhar) ను సెలక్ట్ చేసుకోవడం ద్వారా మాస్క్డ్ ఆధార్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్నో రకాల ఆర్థిక కలాపాలు జరిపేటప్పుడు ఈ మాస్క్డ్ ఆధార్ ఉపయోగించడం వల్ల మీ ఆధార్ నెంబర్ బహిర్గతం కాకుండా ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త పడవచ్చు.

Viral Video: ఈ ఆంటీ తెలివి తేటలు మామూలుగా లేవుగా.. రెండు నిమిషాల్లో అయే మ్యాగీతో ఇలా కూడా చేస్తారా..?


Updated Date - 2023-04-25T21:36:28+05:30 IST