Baby Girl Born with Two Hearts: నాలుగు కాళ్లు.. నాలుగు చేతులే కాదు.. రెండు గుండెలు కూడా.. వింత శిశువు పుట్టిన 20 నిమిషాల్లోనే..

ABN , First Publish Date - 2023-03-07T16:07:00+05:30 IST

ఏ స్త్రీకైనా తల్లికావడం అనేది జీవితంలో సంతోషకరమైన క్షణం. ఇక కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి రకరకాల ఊహాగానాలు చేస్తారు. పుట్టేది ఆడో.. మగో తెలియకపోయినా

Baby Girl Born with Two Hearts: నాలుగు కాళ్లు.. నాలుగు చేతులే కాదు.. రెండు గుండెలు కూడా.. వింత శిశువు పుట్టిన 20 నిమిషాల్లోనే..
పుట్టిన 20 నిమిషాల్లోనే..

ఏ స్త్రీకైనా తల్లికావడం అనేది జీవితంలో సంతోషకరమైన క్షణం. ఇక కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి రకరకాల ఊహాగానాలు చేస్తారు. పుట్టేది ఆడో.. మగో తెలియకపోయినా బట్టల దగ్గర నుంచి ఆడుకునే ఆట వస్తువుల దాకా అన్నీ ముందే కొనేస్తారు. అంత ఉత్సుకత అంటుంది తల్లిదండ్రులకు. అలాగే బిడ్డ ఆరోగ్యం పట్ల కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. డాక్టర్లను సంప్రదించి టెస్టులు చేయించుకుంటూ.. స్కానింగ్‌లు తీసుకుంటూ జాగ్రత్త పడుతుంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఓ తల్లి వింత శిశువుకు జన్మనివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ అరుదైన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

రాజస్థాన్‌ (Rajasthan) చురు జిల్లాలోని రతన్‌గఢ్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో (Private hospital) 19 ఏళ్ల గర్భిణి చేరింది. అనంతరం రెండు గుండెలు.. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న పాపకు జన్మనిచ్చింది. అలా పుట్టిన 20 నిమిషాలకే శిశువు మరణించిందని వైద్యులు తెలిపారు.

హజారీ సింగ్‌ (Hazari Singh) అనే మహిళ ప్రసవ నొప్పులతో ఆదివారం రాత్రి గంగారామ్‌ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించగా అందులో వింత శిశువు కనిపించిందని డాక్టర్లు పేర్కొన్నారు. శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు, రెండు గుండెలు, రెండు వెన్నెముకలు, తల మాత్రం ఒకటే ఉందని వెల్లడించారు. అనంతరం ఆమెకు సాధారణ ప్రసవం జరిగింది. కాకపోతే పుట్టిన కొన్ని నిమిషాలకే ఆ శిశువు ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. ఇతర ఆస్పత్రుల్లో సోనోగ్రఫీ నిర్వహించినప్పుడు రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రసవం చేయడం కష్టమైన పని అన్నారు. కాకపోతే సకాలంలో డెలివరీ చేయడంతో తల్లి ప్రాణాలతో బయటపడిందని డాక్టర్ రీటా అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: Free Beer Offer: రెండు బీర్లు ఫ్రీ అంటూ ఊరంతా పోస్టర్లు.. ఒకే ఒక్క కండీషన్ పెట్టినా క్యూ కట్టిన జనం..!

Updated Date - 2023-03-07T16:07:00+05:30 IST