Warts on Face: ముఖంపై పులిపిర్లు ఎందుకొస్తాయి..? అసలు మొటిమలకు పులిపిర్లకు సంబంధమేంటో తెలుసా..?
ABN , First Publish Date - 2023-03-28T18:01:42+05:30 IST
పులిపిర్లు దేహంలో ఎక్కడొచ్చినా ఇబ్బంది ఉండదు గానీ.. అదే మొఖం మీద వస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అంతగా ఇబ్బంది పడుతుంటారు. అందుకోసమే చాలా మంది ఏం చేస్తుంటారంటే.. వేళ్లతో
పులిపిర్లు దేహంలో ఎక్కడొచ్చినా ఇబ్బంది ఉండదు గానీ.. అదే మొఖం మీద వస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అంతగా ఇబ్బంది పడుతుంటారు. అందుకోసమే చాలా మంది ఏం చేస్తుంటారంటే.. వేళ్లతో నలిపేయడమో.. లేదంటే బ్లేడ్‌తో కోసేసి పసుపు పెట్టడమో చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత ముదురుతోంది తప్ప తగ్గదు. అసలు ఇవి ఎందుకు వస్తాయి. పరిష్కారం ఏంటో తెలుసుకుందాం.
పులిపిర్లు (Pulipirlu) చాలా మంది శరీరంపై కనిపిస్తుంటాయి. చేతులు, కాళ్లపై ఉంటే ఎవరూ పట్టించుకోరు కానీ ముఖంపై వస్తే మాత్రం వాటిని అలా గిల్లుతూ ఉంటారు. వాటిని ఎలాగైనా తొలగించుకోవాలనుకుంటారు. ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే పులిపిర్లు వచ్చేది కూడా వైరస్ వల్లే. వైరస్ వల్ల వచ్చే ఒక చర్మ ఇన్ఫెక్షనే ఈ పులిపిర్లు (Warts on Face). చర్మం మీద దెబ్బలు, లేదా మొటిమలు వచ్చినప్పుడు ఆ సందుల్లోంచి చర్మంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ వైరస్ తిష్ట వేసుకుని కూర్చుని అదనపు కణాలు ఒకేచోట పెరిగేలా చేస్తుంది. ఆ కణాలన్నీ చర్మం వెలుపలకు పెరిగి గట్టిపడి పోతాయి. అవే పులిపిర్లుగా మారుతాయి. వీటిని ‘వాట్స్’ అని పిలుస్తారు. ఇవి ఎలా పోతాయో తెలియక చాలా మంది చేత్తో గిల్లుతూ ఉంటారు. అలా గిల్లడం సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు.
ఇది కూడా చదవండి: Cashew Price: మార్కెట్లో కిలో జీడిపప్పు వెయ్యి రూపాయలకు పైనే.. కానీ ఇక్కడ మాత్రం కేవలం 30 రూపాయలకే..!
పులిపిర్లను తొలగించుకోవాలంటే డెర్మటాలజిస్టు (Dermatologist)ను సంప్రదించాలి. రేడియో ఫ్రీక్వెన్సీతో వాటిని కత్తిరిస్తారు. కొన్ని పులిపిర్లు కాయల్లా కాకుండా, బల్లపరుపుగా ఉంటాయి. అలాంటి వాటికి మాత్రం క్రయోథెరపీ చికిత్స చేయాల్సి వస్తుంది. ఈ చికిత్సతో వైరస్‌ను చంపేస్తోంది. వైరస్ చనిపోయాక ఆ ప్రాంతంలో చర్మంపై పొరతో సహా వైరస్‌ను తీసి పడేస్తారు. ఆ వైరస్ పొరపాటున గొంతులోకి చేరిందంటే గొంతులో కూడా పులిపిర్లు వచ్చేస్తాయి. అందుకే చికిత్స చేస్తున్నప్పుడు ముక్కు ద్వారా వైరస్ చేరకుండా చూసుకుంటారు. మళ్లీ వైరస్ పెరగకుండా వాటితో పోరాడేందుకు కొన్ని రకాల మందులు ఇస్తారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం పొడి బారకుండా చూసుకోవాలి. పొడి చర్మం కలవారికే పులిపిర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: BirthMarks: పుట్టు మచ్చల వెనుక కథేంటి..? పుట్టినప్పుడు లేని మచ్చలు ఆ తర్వాత ఎలా వస్తాయంటే..
ఇంకో విషయం ఏంటంటే పుల్లిపిర్లు అనేవి అంటు వ్యాధి. ఇవి ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటాయి. పులిపిర్లు ఉన్న వారిని ముట్టుకుంటే వారికి కూడా పులిపిర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారితో సామాజిక దూరం పాటిస్తే మంచిది. మేడి చెట్టు నుంచి వచ్చే పాలను కూడా ఈ పులిపిర్లకు రాస్తే తగ్గిపోతుంది. ఆ పాలు వైరస్‌ను అంతం చేస్తోంది. అంతే కాదు ఆయుర్వేదంలో వీటికి చికిత్స అందుబాటులో ఉంది. వైద్యుల సూచన మేరకు ఇవి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Banana: ఆరోగ్యానికి మంచిది కదా అని భోజనం చేసిన వెంటనే అరటిపండ్లు తింటున్నారా..? అసలు నిజం తెలిస్తే..