Older Couple: ఆమెకు 63, ఆయనకు 72.. లవ్ స్టోరీలో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఏమైందో తెలిస్తే అవాక్కవుతారు

ABN , First Publish Date - 2023-08-22T18:51:40+05:30 IST

ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని ప్రేమికులు అంటుంటారు. అది నిజమే.. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు, ఎవరి మీద పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ముసలివారిని యుక్త వయస్కులు ప్రేమించడం..

Older Couple: ఆమెకు 63, ఆయనకు 72.. లవ్ స్టోరీలో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఏమైందో తెలిస్తే అవాక్కవుతారు

ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని ప్రేమికులు అంటుంటారు. అది నిజమే.. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు, ఎవరి మీద పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ముసలివారిని యుక్త వయస్కులు ప్రేమించడం.. వృద్ధులు కూడా ప్రేమలో పడటం వంటివి మనం ఇప్పటికే ఎన్నో చూశాం. కానీ.. కర్ణాటకలో మాత్రం ఎవ్వరూ ఊహించని ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. తనని ప్రేమించి మోసం చేశాడంటూ.. 63 ఏళ్ల వృద్ధురాలు 73 ఏళ్ల వృద్ధిడిపై ఫిర్యాదు చేసింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. సభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..

హలసూరుకు చెందిన 63 ఏళ్ల వృద్ధురాలికి ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఆమె భర్త చాలా సంవత్సరాల క్రితమే మరణించారు. ఒక బ్యాంక్‌ మేనేజర్‌ ఇంట్లో ఆమె వంటపని చేస్తోంది. ఈ సమయంలోనే ఆమెకు లోకనాథ్‌ అనే వృద్ధునితో పరిచయం ఏర్పడింది. ఆయన భార్య కూడా కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటోన్న ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరు కలిపి పర్యాటక ప్రాంతాలకు షికార్లకు వెళ్లారు. ఈ క్రమంలోనే లోక్‌నాథ్ ఆమెను ప్రపోజ్ చేశాడు. ‘నిన్ను పెళ్లి చేసుకుంటాను, బాగా చూసుకుంటాను, పిల్లలను వదిలి నాతో వచ్చెయ్’ అని వృద్ధుడు చెప్పాడు.


చాలాకాలం నుంచి ఒంటరిగా ఉన్న తనకు ఇన్నేళ్ల తర్వాత తోడు దొరకడంతో.. కుమారుడు వద్దని చెప్పినప్పటికీ, అతని మాటని లెక్కచేయకుండా ఆ వృద్ధురాలు లోక్‌నాథ్ వద్దకు వెళ్లింది. పిల్లల్ని వదిలేసి అతనితో ఉండసాగింది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ, ఆ వృద్ధురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన లోకనాథ్‌ ఇప్పుడు మాట మారుస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. అసభ్య పదజాలంతో తనని నిత్యం దూషిస్తున్నాడని, తనని ఇప్పుడు దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. అతని కారణంగా తాను వీధిన పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో తాను పిల్లల్ని, పనిని వదిలేసి వచ్చానని.. కానీ ఇప్పుడు లోక్‌నాథ్ తనని మోసం చేశాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. ఆ వృద్ధురాలి ఆరోపణల్ని లోక్‌నాథ్ ఖండించాడు. ఆమెను తాను మోసం చేయలేదని.. అడిగినంత డబ్బులు చెల్లించాలనని చెప్తున్నాడు. ఇలా ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేస్తుండటంతో.. ఈ వృద్ధుల వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో పోలీసులకు అర్థం కావట్లేదు.

Updated Date - 2023-08-22T18:51:40+05:30 IST