Share News

1Crore remuneration: 80ల కాలంలోనే కోటి పారితోషికం తీసుకున్న కథానాయిక.. ఆ ఒక్క సీన్ కోసమే..

ABN , Publish Date - Dec 29 , 2023 | 03:39 PM

ఓ 15,20 ఏళ్ల కిందట హీరో హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువ. అలాంటిది 80ల కాలంలోనే కోటి తీసుకున్న హీరోయిన్ ఈమె..

1Crore remuneration: 80ల కాలంలోనే  కోటి పారితోషికం తీసుకున్న కథానాయిక.. ఆ ఒక్క సీన్ కోసమే..

రంగుల ప్రపంచం అయిన సీన్ ఫీల్డ్ లో తారలు సమాజానికి ఎప్పుడూ హాట్ టాపిక్కే. సహజంగానే ప్రజలకు వీరి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు సినిమాలలో నటించేందుకు తీసుకునే పారితోషికం కూడా చర్చనీయాంశంగా ఉంటుంది. గత 10-15 ఏళ్ళ నుండి కోటి మార్కు టచ్ అవుతోంది. కానీ అంతకు ముందు సినీతారల పారితోషికం లక్షలలోపే ఉండేది. అందునా హీరోయిన్ల పారితోషికం హీరోలతో పోలిస్తే తక్కువే. శ్రీదేవి, ఐశ్వర్య, దీపికా, ప్రియాంక, అలియా, నయనతార, సమంత మొదలైనవారు కోటి పారితోషికం తీసుకున్న హీరోయిన్ల లిస్ట్ లో ఉన్నారు. కానీ 1980ల కాలంలోనే కోటి పారితోషికం అందుకున్న కథానాయిక గురించి మీకు తెలుసా? ఈమె గురించి తెలుసుకుంటే..

80,90 ల కాలంలో చాలా సినిమాలు విడుదల అయ్యాయి. ముఖ్యంగా ఈ కాలంలో బాలీవుడ్ లో చాలా వివాదాలు నడిచాయి. 1988 సంవత్సరంలో 'దయావన్'(Dayavan) అనే యాక్షన్, థ్రిల్లర్ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ఫిరోజ్ ఖాన్(Feroz Khan), మాధురీ దీక్షిత్(Madhuri Dixit), అమ్రిష్ పూరి(Amrish Puri), వినోద్ ఖన్నా(Vinod Khanna) లాంటి పలురువు ప్రముఖులు నటించారు. ఈ సినిమా విడుదలైన తరువాత పెద్ద దుమారమే రేగింది. సినిమాలో కథానాయిక మాధురీ దీక్షిత్ కు, హీరో వినోద్ ఖన్నాకు ముద్దు సన్నివేశం, వారిద్దరూ సన్నిహితంగా మెలిగే సందర్బాలు ఉన్నాయి. ఈ ఒక్క సీన్ కోసమే మాధురీ దీక్షిత్ కు అక్షరాలా కోటి పారితోషికం(1Crore remuneration for one scene) అందిందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: మునగ ఆకులు తింటే కలిగే టాప్ 8 లాభాలివీ..!


అప్పట్లో దయావన్ సినిమా ద్వారా వినోద్ ఖన్నా తన స్థానాన్ని సినిమా పరిశ్రమలో సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో దర్శకుడు ఫిరోజ్ ఖాన్ ఈ సినిమాలో ఏ ఒక్క సీన్ కు నో చెప్పకూడదని హీరోయిన్ మాధురికి ముందే చెప్పేశారు. ఈ కారణంగా మాధురీ దీక్షిత్ కోటి పారితోషికం తీసుకుని ఈ సీన్ చేసినట్టు సినీ పరిశ్రమ వర్గాల సమాచారం. ఈ సినిమా విడుదల తరువాత ఈ సీన్ ను బ్యాన్ చెయ్యాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో పాటు నేరుగా దర్శకుడు ఫిరోజ్ ఖాన్ కు కూడా ఈ చిత్రంలో అభ్యంతకర సన్నివేశాలను తొలగించమని కోరారు. తండ్రి వయసులో వ్యక్తితో ఇలాంటి సీన్ చేయడం వల్ల మాధురీ దీక్షిత్ కూడా అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఈ సీన్ గురించి చర్చలు నడుస్తూనే ఉండటంతో ఈ టాపిక్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: రోజూ ఓ 10నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!

మరిన్ని వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 29 , 2023 | 03:39 PM