రోజూ ఓ 10నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే.. కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!

బ్రిస్క్ వాక్ అంటే  వేగంగా నడవడం. రోజూ 10నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే కలిగే లాభాలివీ..

బ్రిస్క్ వాక్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె సమర్థవంతంగా రక్తాన్ని పంప్ చేసేలా చేసి శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. గుండె కండరాలు బలపరుస్తుంది.

బరువు తగ్గడానికి ప్రయత్నించేవారికి బ్రిస్క్ వాక్ భలే సహాయపడుతుంది.  ఇది కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. 10-15నిమిషాల బ్రిస్క్ వాక్ గంట సాధారణ నడకకు సమానం.

వేగంగా నడవడం వల్ల మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్పిన్లు విడుదల అవుతాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ  తగ్గుతాయి.

బ్రిస్క్ వాక్ లో శ్వాస  వేగంగా లోతుగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. శరీరాన్ని ఆక్సిజనేట్ చేసి శరీరంలో టాక్సిన్లను తొలగిస్తుంది.

బ్రిస్క్ వాక్  కీళ్లు, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారికి  ఇది మంచి ఎంపిక.

వేగంగా నడవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. రోగనిరోధక శక్తి పెరగడం ద్వారా  ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం మెరుగవుతుంది.

రోజూ సాయంత్రం బ్రిస్క్ వాక్ చేస్తే రాత్రి  హాయిగా నిద్ర పడుతుంది. ఇది నిద్ర చక్రాన్ని సరిచేస్తుంది.  నిద్ర సమస్యలకు చెక్ పెడుతుంది.

వేగంగా నడవడం వల్ల మెదడు కూడా ఉత్తేజం అవుతుంది.  జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు మెరుగవుతాయి.