July Bank Holidays: జూలైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..

ABN , First Publish Date - 2023-06-29T17:05:11+05:30 IST

జూలై నెలలో బ్యాంకులు సగం రోజులే పని చేయనున్నాయి. ఎందుకంటే జూలైలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు జాతీయ సెలవు దినాలు, ఇతర సెలవు దినాలు కలుపుకుంటే మిగిలింది 15 రోజులే.

July Bank Holidays: జూలైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..

జూలై నెలలో బ్యాంకులు సగం రోజులే పని చేయనున్నాయి. ఎందుకంటే జూలైలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు జాతీయ సెలవు దినాలు, ఇతర సెలవు దినాలు కలుపుకుంటే మిగిలింది 15 రోజులే. కాబట్టి జూలైలో బ్యాంకులు 15 రోజులే పని చేయనున్నాయి. ఇందులో 5 ఆదివారాలు, రెండు శనివారాల రూపంలో వారాంతపు సెలవులే 7 ఉండనున్నాయి. మిగిలిన 8 రోజులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు కారణాలతో బ్యాంకులు పని చేయవు. కస్టమర్లు ఇది గమనించడం మంచిది. అయితే బ్యాంకులు పని చేయకపోయినప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు నిత్యం అందుబాటులో ఉంటాయి. కాగా బ్యాంకులు పని చేయని తేదీలు ఇలా ఉన్నాయి. 2, 5, 6, 8, 9, 11, 13, 16, 17, 21, 22, 23, 28, 29, 30 తేదీలలో బ్యాంకులు పని చేయవు.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం ఇందులో ఎనిమిది సెలవు దినాలు నెగోటియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కింద లభిస్తాయి. మిగిలినవి వారాంతపు సెలవులు. కాగా రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్ ఇండియా సెలవులను మూడు బ్రాకెట్ల క్రింద విభజించింది. అవి నెగోటియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలీడే, నెగోటియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలీడే అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలీడే, బ్యాంకుల ఖాతాల ముగింపు. బ్యాంకు ఖాతాదారులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవులు ఒకే విధంగా ఉండవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Updated Date - 2023-06-29T17:05:11+05:30 IST