Share News

AP Politics: వైసీపీ నేతల కీలక నిర్ణయం.. మంగళగిరి టిక్కెట్ బీసీకే..!!

ABN , First Publish Date - 2023-12-11T15:13:16+05:30 IST

AP Politics: ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయడంతో వైసీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి సీటును వచ్చే ఎన్నికల్లో బీసీలకు కేటాయించాలని సీఎం జగన్ భావిస్తున్నారని.. అందుకే బీసీ అయిన గంజి చిరంజీవికి ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గంజి చిరంజీవి సోమవారం సాయంత్రం సీఎం జగన్‌ను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

AP Politics: వైసీపీ నేతల కీలక నిర్ణయం.. మంగళగిరి టిక్కెట్ బీసీకే..!!

ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నాయి. అయితే ఎన్నికలకు ముందే అధికార పార్టీ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు తట్టుకోలేక ఆర్కే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా ఒక్క రూపాయి కూడా ఆర్కే సంపాదించుకోలేదని.. రాజకీయాల్లో ప్రవేశించేటప్పుడు ఆయనకు ఉన్న ఆస్తిలో ఇప్పుడు సగం హారతి కర్పూరంలా కరిగిపోయిందని.. ఉన్నది కూడా పోగొట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకోవడానికి మొగ్గు చూపారని వివరిస్తున్నారు.

మరోవైపు ఆర్కే రాజీనామా చేయడంతో వైసీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి సీటును వచ్చే ఎన్నికల్లో బీసీలకు కేటాయించాలని సీఎం జగన్ భావిస్తున్నారని.. అందుకే బీసీ అయిన గంజి చిరంజీవికి ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గంజి చిరంజీవి సోమవారం సాయంత్రం సీఎం జగన్‌ను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన్ను మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీలోని కీలక నేతలు కూడా చిరంజీవి అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓటమి చెందిన గంజి చిరంజీవి.. 2019లో మాత్రం పోటీ చేయలేదు. ఆయన స్థానంలో నారా లోకేష్ పోటీ చేశారు. దీంతో గంజి చిరంజీవి మనస్తాపం చెందారు. గత ఏడాది టీడీపీ నుంచి వైసీపీలోకి మారారు. అప్పటి నుంచి వైసీపీలో వర్గ పోరు నడుస్తోంది.


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-11T15:13:17+05:30 IST