Share News

Gorantla Madhav : కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా గోరంట్ల మాధవ్.. ఈసారి ఏం చేశారో చూడండి!!

ABN , First Publish Date - 2023-11-19T17:23:59+05:30 IST

Gorantla Madhav Issue : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Kuruva Gorantla Madhav).. ఈయన గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు.! ఖాకీ చొక్కా నుంచి ఖద్దరు చొక్కా వేసిన వేసినా ఆయన తీరు మారలేదు.. కానీ కాంట్రవర్సీలకు మాత్రం కేరాఫ్ అడ్రస్‌గా మారారు..

Gorantla Madhav : కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా గోరంట్ల మాధవ్.. ఈసారి ఏం చేశారో చూడండి!!

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Kuruva Gorantla Madhav).. ఈయన గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు.! ఖాకీ చొక్కా నుంచి ఖద్దరు చొక్కా వేసిన వేసినా ఆయన తీరు మారలేదు.. కానీ కాంట్రవర్సీలకు మాత్రం కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఖద్దరు ధరించాక అంతకుమించి విర్రవీగిపోతున్నారనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహుశా వివాదాల్లో ఇరుక్కోవడం సరదా ఏమో..!. రెండ్రోజులకోసారి ఏదో ఒక వివాదం లేకుంటే ఈయనకు నిద్రపట్టేలా లేదు. అంతేకాదు.. నిద్రలేచింది మొదలుకుని మళ్లీ నిద్రపోయే వరకూ వివాదాల్లేకుండా ఏ ఒక్కటీ జరగదన్నట్లుగా గోరంట్ల పరిస్థితి ఉందని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. ఆ మధ్య జిమ్‌లో న్యూడ్ వీడియోతో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ సభ్య సమాజం తిట్టిపోసింది. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. ఆ తర్వాత పలుమార్లు వివాదాలతో వార్తల్లో నిలిచారు కూడా. ఈ మధ్యనే టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) తీవ్ర వ్యాఖ్యలు చేసి.. తెలుగు తమ్ముళ్లు, పార్టీ శ్రేణుల నుంచి గట్టిగానే విమర్శలు వచ్చాయి. ఇక రెండు మూడ్రోజుల క్రితమే హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యపై (Balakrishna) కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ సద్దుమణగక ముందే మరో వివాదంలో ఇరుక్కున్నారు గోరంట్ల.


Gorantla-Madhav.jpg

అసలేం జరిగింది..?

శ్రీ సత్యసాయి జిల్లా‌లో కురుబల గుడికట్ల సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కురుబ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా విచ్చేశారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి (BK Parthasarathi) కూడా రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. స్టేజీపైన సారథిపై గోరంట్ల దురుసుగా ప్రవర్తించారు. వేదికపై నేతలు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో సంబరాలు కాస్త రసాభాసగా మారింది. గోరంట్ల తీరుతో సంబరాలు కాస్త రచ్చ రచ్చగా మారిపోయాయి. దీంతో ఎంపీపై బీకే పార్థాసారిథి వర్గీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు కురుబ సంఘం నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడితో ఆగి ఉంటే ప్రశాంతంగా సంబరాలు జరిగేవేమో కానీ.. గోరంట్ల మరింత రెచ్చిపోయి ప్రవర్తించారు. తమ అభిమాన నేత పార్థసారథికి గజమాల వేయడానికి అభిమానులు, జిల్లా నేతలు, సామాజిక వర్గ నేతలు ఆశపడ్డారు. స్టేజ్ దగ్గరికి వచ్చి సారథికి పూల దండ వేశారు.. అబ్బే తనను ఎవరూ పట్టించుకోలేదని అనుకున్నారో ఏమో కానీ ఆ దండను తనకు తానుగా మెడలో వేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారు. అయితే.. వీలు కాలేదు. దీంతో మీకెవరు పూల మాల తెచ్చారు..? మీరెందుకు వేసుకుంటున్నారు..? అని కిందున్న కార్యకర్తలు, కొందరు నేతలు గట్టిగా ఈలలు, కేకలు వేశారు. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేసేయాలని భావించిన గోరంట్ల పక్కనే ఉన్న పార్థసారథిపై గొడవకు దిగినంత పనిచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడికెళ్లినా సరే వివాదాలు తన వెంటనే ఉండాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Madhav.jpg

మారేదేలే..!

మొత్తానికి చూస్తే.. నేనింతే.. ఎవరు ఏమన్నా.. ఏమనుకున్నా సరే మారే ప్రసక్తే లేదన్నట్లుగా గోరంట్ల తీరు ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో వివాదాలు ఉన్నప్పటికీ.. వివాదాలతోనే సాహవాసం చేస్తున్నారే తప్ప కనీసం మారే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. మరోవైపు.. ఎంపీ దురుసు వైఖరివల్ల వైసీపీకి చెడ్డ పేరు వస్తోందని చాలా రోజులుగా అధిష్టానం ఆగ్రహంతో ఉందన్న విషయం తెలిసిందే. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఇష్టపడటంలేదని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్న గతంలో నాయకులు ఎంతో కొంత సంయమనం పాటించేవారన్నది జగమెరిగిన సత్యమే. అడపాదడపా ఒకరిద్దరు నోరు జారినా వారిని మందలించి.. దారికి తెచ్చే వ్యవస్థ పార్టీల్లో ఉండేది. కానీ ఇటీవల అలాంటి పరిస్థితి కనిపించకపోవడం గమనార్హం. మరోవైపు రానున్న ఎన్నికల్లో మాధవ్‌కు టికెట్ ఇవ్వబోరని.. ఇస్తే అంతే సంగతులు సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి.

Gorantala-Vs-BK.jpg

Updated Date - 2023-11-19T17:26:46+05:30 IST