CID Enquiry : లోకేష్‌‌ విచారణ టైమ్‌లో సీఐడీ ఆఫీసర్లకు పదే పదే ఫోన్ చేసిందెవరు.. ఆ ‘ముక్క’ గురించే..!?

ABN , First Publish Date - 2023-10-10T22:54:06+05:30 IST

లోకేష్‌ను ఓ వైపు సీఐడీ అధికారులు విచారిస్తుండగా మరోవైపు విచారణ అధికారులకు ఒక్కటే ఫోన్లు, మెసేజ్‌లు వచ్చినట్లు తెలిసింది. ఒకసారి కాదు రెండుసార్లు కాదు మొత్తం..

CID Enquiry : లోకేష్‌‌ విచారణ టైమ్‌లో సీఐడీ ఆఫీసర్లకు పదే పదే ఫోన్ చేసిందెవరు.. ఆ ‘ముక్క’ గురించే..!?

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ఇవాళ సీఐడీ విచారణకు (Lokesh CID Enquiry) హాజరైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకూ సీఐడీ (AP CID) అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఐడీ సంధించిన ప్రతి ప్రశ్నకు లోకేష్ సూటిగా.. సుతిమెత్తంగా సమాధానమిచ్చారు. లోకేష్‌పై సీఐడీ అధికారులు మొత్తం 50 ప్రశ్నలు సంధించారు. అయితే ఈ ప్రశ్నలన్నింటిలో ఒకే ఒక్క ప్రశ్న మాత్రమే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు్కు సంబంధించినది ఉండటం గమనార్హం. మిగిలిన 49 సంబంధం లేని ప్రశ్నలే ఉండటంతో లోకేష్ ఆశ్చర్యపోయారు.


Lokesh-CID.jpg

ఫోన్ చేసిందెవరు..?

ఇక అసలు విషయానికొస్తే.. లోకేష్‌ను ఓ వైపు సీఐడీ అధికారులు విచారిస్తుండగా మరోవైపు విచారణ అధికారులకు ఒక్కటే ఫోన్లు, మెసేజ్‌లు వచ్చినట్లు తెలిసింది. ఒకసారి కాదు రెండుసార్లు కాదు మొత్తం ఏడుసార్లు సీఐడీ అధికారులు బయటికి వెళ్లి ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు సమాచారం. ఫోన్ చేసిన వ్యక్తి చెప్పినట్లే ఇక్కడ అధికారులు ప్రశ్నలు అడిగినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. విచారణకు పిలిచాం సరే.. లోకేష్‌ను ఏ ప్రశ్న ముందు అడగాలి ? ఎవరు అడగాలి..? అంటూ సీఐడీ అధికారులు తర్జన భర్జన పడ్డారట. ఈ క్రమంలో కలుగజేసుకున్న లోకేష్.. సార్.. మీరు ఇబ్బంది పడొద్దు మొత్తం 50 ప్రశ్నలు ఇవ్వండి.. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని అధికారులతో లోకేష్ అన్నారట. ఇప్పుడిదే విషయంపై అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Phone-Calls.jpg

అంగీకరించని సీఐడీ..!

హెరిటేజ్‌లో ఎటువంటి బాధ్యతలు నిర్వహించారు.. ?. ప్రభుత్వంలో మీరు ఎటువంటి బాధ్యతలు నిర్వహించారు..? అనే దానిపైనే ఎక్కువ శాతం ప్రశ్నలు లోకేష్‌ను అడిగినట్లు లీకులు వస్తున్నాయి. 50 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తరువాత కూడా.. బుధవారం మళ్లీ విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడం గమనార్హం. అయితే.. తాను ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో సంప్రదింపులు చెయ్యాల్సిన అవసరం ఉన్నందున ఆలస్యం అయినా ఇవాళే విచారణ పూర్తి చేయమని లోకేష్ కోరగా.. అధికారులు అంగీకరించలేదు. కోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటలకు విచారణ ముగించాలని.. అందుకే బుధవారం మళ్లీ రమ్మంటున్నట్లు అధికారులు ఆయనకు చెప్పారు. అయితే.. ఇరువురి అంగీకారంతోనే విచారణ జరిగిందని కోర్టుకి చెప్పొచ్చు కదా..? అని అధికారులతో లోకేష్ చెప్పినప్పటికీ వారు మాత్రం అంగీకరించలేదు. లోకేష్ మాటలకు బదులిస్తూ.. తాము ప్రశ్నలు సిద్ధం చేసుకోవాలని అందుకే బుధవారం రమ్మంటున్నామని.. సహకరించాలని చెప్పారు. ఇందుకు అంగీకరించిన లోకేష్ సరేనని బయటికి వచ్చేశారు.

lokesh.jpg

ఆ ప్రశ్నలు ఇవే..

సీఐడీ : ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ ప్రతిపాదన.. లేదా దానికి సంబంధించిన చర్చ ఎప్పుడైనా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందుకు వచ్చిందా..?

లోకేష్ : లేదు.


సీఐడీ : జీవో నంబర్-282 ద్వారా 99 మందికి రాజధాని ప్రాంతంలో లేఅవుట్ రిజిస్ట్రేషన్ మినహాయిపు ఎందుకు ఇచ్చారు..?

లోకేష్ : ఆ 99 మంది కోర్టుకు వెళ్లారు.. కోర్టు ఆదేశాల మేరకు జీవో వచ్చింది


సీఐడీ : హెరిటేజ్ ఫుడ్స్ మేనెజ్మెంట్ కమిటీ, బోర్డు పాత్ర ఏంటి? నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు..?

లోకేష్ : : బోర్డు దే అంతిమ నిర్ణయం.. మేనేజ్మెంట్‌ కమిటీకి నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఉండవు


సీఐడీ : చార్టెడ్ అకౌంటెంట్ పుస్తకం తీసుకొచ్చి మేనెజ్మెంట్ కమిటీ కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు అనే సూచన ఈ పుస్తకంలో ఉంది కదా..?

లోకేష్ : అది కేవలం సూచన అమలు చెయ్యాలా.. వద్దా..? అనే అంతిమ నిర్ణయం బోర్డుకే ఉంటుంది.


సీఐడీ : 2014 మార్చి-21న హెరిటేజ్ సంస్థ ఎక్కడెక్కడ భూములు కొనాలని నిర్ణయం తీసుకుంది..?

లోకేష్ : బయ్యవరం, పామర్రు (తూర్పుగోదావరి), ఉప్పల్, అనంతపురం, విజయవాడ- గుంటూరు, హర్యానా- రాజస్థాన్ ప్రాంతాల్లో భూములు కొనాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత 4 పాంత్రాల్లో భూములు కంపెనీ కొన్నది.


సీఐడీ : పార్టీ అకౌంట్ నుంచి లింగమనేని కంపెనీకి డబ్బులు వెళ్లాయా..?

లోకేష్ : పార్టీ కార్యాలయం నిర్మాణం సమయంలో వాస్తు రీత్యా ఒక చిన్న ముక్క భూమి ఆ కంపెనీ నుంచి కొన్నాం.. దాని కోసం పార్టీ అకౌంట్ నుంచి డబ్బులు చెల్లించాం.


సీఐడీ : మీరు ఉంటున్న ఇల్లు అద్దె ఇళ్లా..?

లోకేష్ : ఉండవల్లిలో మేం ఉంటున్న ఇల్లు అద్దెదే. అద్దె చెల్లిస్తున్నాం. మా అమ్మ భువనేశ్వరి అద్దె చెల్లిస్తున్నారు.


NARA-LOKESH-CID.jpg

ఎవరెవరున్నారు..?

కాగా.. విచారణలో ముగ్గురు సీఐడీ అధికారులు పాల్గొనగా.. మరొకరు టైపిస్టు, ఇద్దరు తాడేపల్లి మున్సిపల్ అధికారులు సాక్షులు మధ్య ఇవాళ లోకేష్ ఎంక్వయిరీ జరిగింది. ఇవాళ మొత్తం ఆరున్నర గంటల పాటు విచారణ జరగ్గా.. మధ్యహా భోజన విరామంలో తప్ప ఒక్కసారి కూడా బయటకు వెళ్లకుండా అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకూ లోకేష్ సవివరంగా సమాధానాలు చెప్పారు. అనంతరం మరోసారి విచారణకు రావాలని.. అడగాల్సిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయని నోటీసులివ్వగా.. సరేనని సీఐడీ కార్యాలయం నుంచి లోకేష్ బయటికి వచ్చారు.

Lokesh.jpg


ఇవి కూడా చదవండి


CBN Case : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ ఇంత జరిగిందా..!?


Lokesh CID Enquiry : సీఐడీ విచారణలో 7 గంటలపాటు లోకేష్‌ను ఏమేం అడిగారు..?


CBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై మొన్న అమిత్ షా.. నిన్న గవర్నర్ రియాక్షన్.. ఇక ఏం జరగబోతోంది..!?


NCBN Case : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తీర్పు ఎప్పుడొస్తుంది..!?


TS Assembly Polls 2023 : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక.. బీఆర్ఎస్ కీలక ప్రకటనలు



Updated Date - 2023-10-10T23:11:56+05:30 IST