AP Bhavan : ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోం శాఖ కీలక ప్రతిపాదనలు.. లెక్క తేలిపోయినట్టేనా..?

ABN , First Publish Date - 2023-05-04T18:03:26+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ (AP Bhavan) విభజన దాదాపు కొలిక్కి వచ్చేసింది. ఇప్పటికే పలుమార్లు ఏపీ, తెలంగాణ అధికారులతో సమావేశమైన..

AP Bhavan : ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోం శాఖ కీలక ప్రతిపాదనలు.. లెక్క తేలిపోయినట్టేనా..?

దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ (AP Bhavan) విభజన దాదాపు కొలిక్కి వచ్చేసింది. ఇప్పటికే పలుమార్లు ఏపీ, తెలంగాణ అధికారులతో సమావేశమైన కేంద్ర హోం శాఖ గురువారం నాడు మరోసారి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక నూతన ప్రతిపాదనలను హోం శాఖ చేసింది. ప్రస్తుతం ఉన్న భూములు భవనాల విభజనపై ఏపీ (Andhra Pradesh) గతంలోనే మూడు ప్రతిపాదనలు చేయగా.. తాజాగా తెలంగాణ (Telangana) మరో ప్రతిపాదన చేసింది. 7.64 ఎకరాల్లో పటౌడిహౌస్‌ను తెలంగాణ తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. మిగతా 12.09 ఎకరాల్లో ఖాళీ భూమితో పాటు గోదావరి, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌ను ఏపీ తీసుకోవాలని హోం శాఖ సూచించింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఒకవేళ ఏపీకి అదనంగా భూమి దక్కితే అందుకు సమాన విలువను తెలంగాణకు ఏపీ కేంద్రం ఇస్తుందని కేంద్రం తేల్చి చెప్పింది. భూములు, భవనాల విభజనపై గతంలోనే ఏపీ 3 ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ మరో ప్రతిపాదన చేయగా దానిపై పూర్తిభిన్నమైన ప్రతిపాదన చేసింది కేంద్రం. ఇలా చేయడం వల్ల జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు దక్కలిసినంతే భూమి దక్కుతుందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. అయితే కేంద్ర ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

AP-Bhavana.jpg

తెలంగాణ ప్రతిపాదనలు ఏంటి..!?

ఏపీ భవన్‌ ఎలాగైనా సరే దక్కించుకోవాలని నిన్న, మొన్నటి వరకూ తెలంగాణ ప్రభుత్వం (TS Govt) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. ఎందుకంటే.. ఈ భవన్‌తో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయి. కాబట్టి వదులుకునేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదు. తమకు వదిలేస్తే.. దానికి బదులుగా పటౌడీ హౌస్‌లో తమకున్న ఏడెకరాలకు పైగా స్థలాన్ని తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని ఏపీ అధికారులను తెలంగాణ ప్రభుత్వం పదేపదే కోరింది. నిజాం నిర్మించిన హైదరాబాద్‌ హౌస్‌కు అనుకొని ఉన్న స్థలంతో రాష్ట్ర ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని తెలంగాణ సర్కార్ మొదట్నుంచీ చెబుతూ వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో శబరి బ్లాక్‌ గవర్నర్‌ విడిది కేంద్రంగా ఉండేది. దీంతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు ఇందులోనే బస చేసేవారు. శబరి, గోదావరి బ్లాక్‌ల మధ్య రోడ్డు ఉంది. శబరి బ్లాక్ సైతం తెలంగాణకే కావాలని అధికారులు కోరారు. దీనికి ఏపీ అంగీకరిస్తే మాత్రం కీలకమైన కూడలిలో ఏపీ అస్తిత్వం,చరిత్ర కనుమరుగు అవుతుందనే వాదనలు గట్టిగానే వినిపించాయి.

AP-Bhavan-2.jpg

గత సమావేశంలో ఇలా..!

58:42 నిష్పత్తిలో ఏపీకి దక్కాల్సిన భూమికి మార్కెట్‌ ధర ప్రకారం ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉందని గత సమావేశంలో తెలంగాణ అధికారులు చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనకు ఏపీ అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో (CM YS Jagan Mohan Reddy) చర్చించాక ఏ నిర్ణయమైనా తీసుకుంటామని కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs ) జరిపిన చర్చల్లో ఏపీ అధికారులు తెలిపారు. దీంతో సమావేశం ప్రారంభమైన అరగంట వ్యవధిలోనే పూర్తయ్యింది. కీలకంగా చర్చించిన తర్వాత వచ్చేవారం మరోసారి సమావేశం కావాలని కేంద్రం హోం శాఖ ఆదేశించగా.. ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకారం తెలిపారు. ఇలా మే-04న మరోసారి సమావేశం జరగ్గా కేంద్ర హోం శాఖ పైవిధంగా పంపకాలు తేల్చేసింది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

AP Bhavan Issue : ఏపీ భవన్ వివాదం ఇప్పట్లో కొలిక్కి రాదా.. కావాల్సిందే అంటున్న కేసీఆర్.. ఆలోచనలో పడిన వైఎస్ జగన్.. ఏకాభిప్రాయం కుదిరేనా..!

******************************

AP Politics : వీడియోతో చిక్కుల్లో పడిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌.. వారం రోజుల్లో ఏం జరుగుతుందో..!?

******************************

Updated Date - 2023-05-04T18:17:50+05:30 IST