TS congress: తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు.. ఏడాది క్రితం వరంగల్‌లో...

ABN , First Publish Date - 2023-05-08T22:23:13+05:30 IST

ఈసారి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా అడుగులు వేస్తోంది.

TS congress: తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు.. ఏడాది క్రితం వరంగల్‌లో...

సరిగ్గా ఏడాది క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేతుల మీదుగా వరంగల్‌లో ‘రైతు డిక్లరేషన్’ (Rythu Declaration) ప్రకటన... ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అతిథిగా హైదరాబాద్‌లో ‘యూత్ డిక్లరేషన్’ (Youth declaration) ఆవిష్కరణ... ఒక్కొక్క వర్గానికి చేరువయ్యే ప్రయత్నాలు.. మొత్తంగా ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే (Assembly election) లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈసారి అధికారాన్ని దక్కించుకునేందుకు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకు దగ్గరవ్వడమే లక్ష్యంగా పకడ్బందీగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు 6 నెలల ముందుగానే ప్రియాంక గాంధీ ‘యూత్ డిక్లరేషన్’తో కాంగ్రెస్ పార్టీ సమరశంఖాన్ని పూరించిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ (Telangana) ఇచ్చిన పార్టీగా సానుభూతి ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress party) ఈసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. పార్టీలో అంతర్గత విభేదాలు, సీనియర్ల మధ్య సఖ్యత లేకపోయినప్పటికీ వేర్వేరు కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండే ప్రయత్నాలను ఆ పార్టీ నేతలు ముమ్మరం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క‌తోపాటు ముఖ్యమైన నేతల ఇప్పటికే పాదయాత్రలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ఓటర్లను చేరువవ్వడంతోపాటు పార్టీ శ్రేణులను ఉత్తేజితం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఒక్కొక్క వర్గానికి చేరువయ్యేందుకు అడుగులు వేస్తున్నారు.

ప్రియాంక సభ ద్వారా కేడర్‌లో ఉత్సాహం..!

కాంగ్రెస్ పార్టీ యాక్టివ్‌గా వేర్వేరు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రియాంక గాంధీ ‘యూత్ డిక్లరేషన్’ ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసింది. ఆ విషయంలో కాంగ్రెస్ సభ విజయవంతమయ్యిందా లేదా అనేది వేచిచూడాలి. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల ఫలితాలు రావొచ్చనే అంచనాలు, అక్కడి ఫలితాలు తెలంగాణలో పార్టీకి స్థైర్యాన్ని ఇస్తాయనే విశ్లేషణలు కూడా పార్టీ కేడర్‌కు కొత్త ఊపు తీసుకొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కూడా కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయాలని నిర్ణయించిందని సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫ్యలాలను ఎండగట్టడంతోపాటు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజల ముందుకు వెళ్లాలని నాయకత్వం భావిస్తోందని టాక్ వినిపిస్తోంది. మరి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పోరాటం ఏవిధంగా ఉంటుందో వేచిచూడాలి.

Updated Date - 2023-05-08T22:24:32+05:30 IST