Share News

TS Assembly Polls : 45 మందితో కాంగ్రెస్ రెండో జాబితా

ABN , First Publish Date - 2023-10-27T20:01:25+05:30 IST

అవును.. ఆలస్యమైనా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను పక్కా వ్యూహంతోనే హైకమాండ్ రిలీజ్ చేసింది. అదిగో.. ఇదిగో అంటున్న అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు శుక్రవారం రాత్రి రిలీజ్ అయ్యింది..

TS Assembly Polls : 45 మందితో కాంగ్రెస్ రెండో జాబితా

అవును.. ఆలస్యమైనా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను పక్కా వ్యూహంతోనే హైకమాండ్ రిలీజ్ చేసింది. అదిగో.. ఇదిగో అంటున్న అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయ్యింది. గత వారం రోజులుగా అభ్యర్థుల విషయంపై కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తీవ్ర కసరత్తు చేసింది. జాబితాకు సంబంధించిన కసరత్తును సీఈసీ ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. అధిష్టానం ముందు పెట్టారు. పార్టీలో చేరికలు దాదాపు పూర్తి కావడంతో అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మొత్తం 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ 45 మందితో మందితో రెండో జాబితాను కాంగ్రెస్ పెద్దలు రిలీజ్ చేశారు.


అభ్యర్థులు వీరే..

  • సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌- గద్దర్‌ కూతురు వెన్నెల

  • సిర్పూర్‌- రావి శ్రీనివాస్‌

  • మునుగోడు- రాజగోపాల్‌రెడ్డి

  • ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు

  • పాలేరు- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

  • కూకట్‌పల్లి- బండి రమేష్

  • ఎల్బీనగర్- మధుయాష్కి

  • సిద్దిపేట- పి.హరికృష్ణ

  • హుస్నాబాద్‌- పొన్నం ప్రభాకర్

  • ఖైరతాబాద్- విజయారెడ్డి

  • అంబర్‌పేట్- రోహిన్‌రెడ్డి

  • జూబ్లీహిల్స్‌- అజారుద్దీన్‌

  • దుబ్బాక- చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

  • వరంగల్ ఈస్ట్- కొండా సురేఖ

  • వరంగల్ వెస్ట్- నాయిని రాజేందర్‌రెడ్డి

  • దేవరకొండ- బాలునాయక్

  • భువనగిరి- కుంభం అనిల్

  • జడ్చర్ల- అనిరుధ్‌రెడ్డి

  • నారాయణపేట- చిట్టెంరెడ్డి

  • తాండూర్- మనోహర్‌రెడ్డి

  • ఆసిఫాబాద్- శ్యామ్‌నాయక్

  • ఆదిలాబాద్‌- కంది శ్రీనివాసరెడ్డి

  • బోథ్- వి.అశోక్‌

  • ఖానాపూర్- వెడ్మ బొజ్జు

  • ముధోల్- బి.నారాయణరావు

  • నిజామాబాద్ రూరల్‌- భూపతిరెడ్డి

  • చొప్పదండి- ఎం.సత్యం

  • ఎల్లారెడ్డి- మదన్‌మోహన్‌రావు

  • హుజురాబాద్‌- ప్రణవ్

  • కోరుట్ల- జువ్వాడి నర్సింగరావు

  • జనగాం- కె.ప్రతాప్‌రెడ్డి

  • పరకాల- రేవూరి ప్రకాశ్‌రెడ్డి

  • వర్ధన్నపేట- కేఆర్ నాగరాజు

  • పాలకుర్తి- యశస్విని

  • మహబూబాబాద్- మురళీనాయక్

  • నర్సాపూర్‌- రాజిరెడ్డి

  • పినపాక- పాయం వెంకటేశ్వర్లు

  • ఇబ్రహీంపట్నం- మల్‌రెడ్డి రంగారెడ్డి

  • మహేశ్వరం- లక్ష్మారెడ్డి

  • రాజేంద్రనగర్‌- కె.నరేందర్

  • శేరిలింగంపల్లి- జగదీశ్వర్‌గౌడ్

  • మహబూబ్‌నగర్- ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి

  • మక్తల్- వి.శ్రీహరి

  • దేవరకద్ర- మధుసూధన్‌రెడ్డి

  • వనపర్తి- జి.చిన్నారెడ్డి

01.jpeg

02.jpeg

Updated Date - 2023-10-27T21:22:55+05:30 IST