TS Congress : గద్దర్ చివరికోరిక నెరవేరస్తున్న రేవంత్ రెడ్డి.. సూర్య కోసం పరిశీలనలో రెండు నియోజకవర్గాలు..!?

ABN , First Publish Date - 2023-08-17T23:09:12+05:30 IST

‘పొడుస్తున్న పొద్దు మీద’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు..! బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది..! భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది..! నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు.. వేల ఆందోళనల్లో కదంతొక్కిన ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం ముగిసింది..!

TS Congress : గద్దర్ చివరికోరిక నెరవేరస్తున్న రేవంత్ రెడ్డి.. సూర్య కోసం పరిశీలనలో రెండు నియోజకవర్గాలు..!?

‘పొడుస్తున్న పొద్దు మీద’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు..! బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది..! భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది..! నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు.. వేల ఆందోళనల్లో కదంతొక్కిన ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం ముగిసింది..! గద్దర్ (Gaddar) ఇక తిరిగిరాడన్న వార్తను అభిమానులు, కళాకారులు, కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గద్దర్ తన కుమారుడు సూర్యుడు అలియాస్ సూర్యను (Gaddar Son Surya) రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. ఉన్నత స్థానంలో చూడాలని చాలా ప్రయత్నాలే చేశారు. ఆ మధ్య ఢిల్లీకెళ్లి మరీ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో పార్టీలో కూడా చేరారు. కుమారుడికి కూడా కాంగ్రెస్ కండువా కప్పించారు. అలా చనిపోయే ముందువరకు కాంగ్రెస్‌తో మంచి సంబంధాలు కొనసాగించారు. కొత్త పార్టీ పెట్టాలని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఆలోచన పక్కనెట్టి ఖమ్మం కాంగ్రెస్ నిర్వహించిన ‘ప్రజా గర్జన’లో (Khammam Praja Garjana) ప్రత్యక్షమవ్వడం, రాహుల్‌ను ముద్దాడటం ఇవన్నీ చూశాక పార్టీ లేదనే విషయం అర్థమైంది. అయితే తాజాగా గద్దర్ కుటుంబానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.


Rahul-And-Gaddar.jpg

ఇదీ అసలు కథ..!

గద్దర్ మరణ వార్త విన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అత్యవసర పనులు సైతం పక్కనెట్టి హుటాహుటిన అపోలో ఆస్పత్రికి వెళ్లడం, ఎల్బీ స్టేడియం అభిమానుల సందర్శనకు ఏర్పాట్లు చేయడం.. ఆ తర్వాత దగ్గరుండి అంతిమ యాత్రను ముందుకు నడిపించడం, అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా తానే చూసుకోవడం.. ఇలా అన్నీ తానై రేవంత్ చూసుకున్నారు. ప్రభుత్వం పేరుకే అధికారిక లాంఛనాలతో అని చెప్పిందేకానీ రేవంత్ రెడ్డే అన్నీ చూసుకున్నారని వార్తలు వచ్చిన విషయం విదితమే. ఆ తర్వాత సోనియా గాంధీ (Sonia Gandhi).. గద్దర్ సతీమణికి లేఖ రాయడం.. ఇవన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే గద్దర్‌ను కాంగ్రెస్ సొంత మనిషిలా చూసుకుంది. రాజకీయాల్లోకి తన కుమారుడిని తీసుకురావాలన్న కోరికను రేవంత్‌కు అప్పట్లో ఒకసారి చెప్పారట. దీంతో ఆయన మరణాంతరం ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్న రేవంత్.. సూర్యుడిని ఎమ్మెల్యే లేదా ఎంపీ పోటీచేయించి.. గద్దరన్నకు ఇచ్చిన మాటను, చివరి కోరికను తీర్చాలని అనుకున్నారట.

Revanth-And-Gaddar.jpg

పరిశీలనలో రెండు..!

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి సూర్యను బరిలోకి దింపాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని (Secunderabad Cantonment Assembly) పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఇక్కడ కాస్త అటు ఇటు అయితే.. పెద్దపల్లి పార్లమెంట్ (Peddapalli Lok Sabha) నుంచి పోటీచేయించాలని కూడా రేవంత్ మనసులో ఉందట. గద్దర్ మంచి స్వభావం ఉన్న వ్యక్తి.. ఆయన లేకున్నా.. కుమారుడి రూపంలో చూడాలని.. టికెట్ ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలువాలని కాంగ్రెస్ భావిస్తోందట. అంటే ఎమ్మెల్యే లేదా ఎంపీగా సూర్యను బరిలోకి దింపడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్న మాట. ఇప్పటికే ఈ విషయాన్ని ఢిల్లీ హైకమాండ్‌కు కూడా రేవంత్ చేరవేసినట్లు.. అక్కడ్నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని తెలియవచ్చింది. ఎన్నికల ముందు ఏం జరుగుతుందో.. టికెట్ ఇచ్చాక పరిస్థితులు ఏ మాత్రం కలిసొస్తాయో వేచి చూడాల్సిందే మరి.

Gaddar-And-Sonia.jpg


ఇవి కూడా చదవండి


RajyaSabha : రాజ్యసభకు ఈసారి ‘కేకే’ డౌటే.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే..!?


TS Assembly Elections 2023 : కేసీఆర్ ప్రకటించబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదే.. 10 ఉమ్మడి జిల్లాలకు ఫిక్స్..!?


TS Politics : తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. ఒకేసారి బీజేపీలోకి 22 మంది ముఖ్య నేతలు..!?


Updated Date - 2023-08-17T23:13:24+05:30 IST