MLC Kavitha ED Enquiry : కవితకు రేపో మాపో ఈడీ నోటీసులు ఇచ్చే ఛాన్స్.. బీఆర్ఎస్‌లో పెరిగిపోయిన టెన్షన్.. ఈసారి విచారణకు వెళ్లగానే...!!

ABN , First Publish Date - 2023-03-29T17:05:38+05:30 IST

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam Case) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..

MLC Kavitha ED Enquiry : కవితకు రేపో మాపో ఈడీ నోటీసులు ఇచ్చే ఛాన్స్.. బీఆర్ఎస్‌లో పెరిగిపోయిన టెన్షన్.. ఈసారి విచారణకు వెళ్లగానే...!!

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam Case) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) మరోసారి ఈడీ విచారణకు (ED Enquiry) వెళ్లాల్సిందేనా..? అతి త్వరలోనే ఆమెకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉందా..? కవిత నోటీసులపై ఢిల్లీలో (New Delhi) పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందా..? అంటే తాజా పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తోంది. కవితకు నోటీసులు (ED Notices To Kavitha) ఇస్తే ఎప్పుడు ఇవ్వొచ్చు..? ఈసారి విచారణలో ఏమేం ప్రశ్నించే ఛాన్స్ ఉంది..? నోటీసులు వస్తే బీఆర్ఎస్ (BRS) ఎలా ముందుకెళ్తుందనే విషయాలపై ప్రత్యేక కథనం.

ఎక్కడ చూసినా ఇదే చర్చ..!

ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) ఇప్పటికే మూడుసార్లు ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. కవిత విచారణ జరిగిన మూడు రోజులు అటు ఢిల్లీలో.. ఇటు హైదరాబాద్‌లో ఏ రేంజ్‌లో పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే మరోసారి కవితను ఈడీ విచారణకు పిలుస్తారని.. రెండు మూడ్రోజుల్లో నోటీసులు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. మూడుసార్లు విచారించినా ఇంకా విచారించాల్సింది చాలానే ఉందని.. లోతైన దర్యాప్తు చేయాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. నోటీసులు ఇవ్వొచ్చన్న వార్తలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం రేపుతున్నాయి. ఈసారి కవిత విచారణకు వెళ్తే ఏం జరుగుతుందో ఏంటో అని బీఆర్ఎస్ పెద్దల్లో కూడా ఆందోళన మొదలైందట. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఈ నోటీసుల వ్యవహారంపైనే పెద్ద చర్చ జరుగుతోంది.

ఏం విచారించొచ్చు..!

నాలుగోసారి విచారణలో కవిత సమర్పించిన మొబైల్స్ (Kavitha Mobiles), డాక్యుమెంట్లకు సంబంధించి విచారణ జరిగే ఛాన్స్ ఉంది. మూడోసారి విచారణలో కవిత సమర్పించిన ఫోన్లను టెక్ నిపుణుల సాయంతో డేటా రికవరీ (Kavitha Phone Data) చేసినట్లు తెలుస్తోంది. అసలు కవిత సమర్పించిన ఫోన్లు.. తాము అడిగిన ఫోన్లు ఒక్కటేనా కాదా..? అందులో డేటా ఉందా.. లేకుంటే డెలీట్ అయ్యిందా అనే దానిపై నిశితంగా పరిశీలించి అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నాలుగోసారి విచారణలో ఆ డేటా గురించే కవితపై ప్రశ్నలు సంధించే అవకాశాలున్నాయి. మరోవైపు.. మనీష్ సిసోడియా (Manish Sisodia), అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai), గోరంట్ల బుచ్చిబాబుతో (Gorantla Buchi Babu) కలిపి కన్‌ఫ్రంటేషన్ పద్ధతిలో విచారణ (Confrontation Enquiry) జరిపే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ముగ్గుర్నీ విచారణకు ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కూడా ఆశ్రయించే ఛాన్స్ ఉందని తెలియవచ్చింది.

ఇదిలా ఉంటే.. కవితకు మరోసారి నోటీసులిస్తే ఎలా ముందుకెళ్లాలనే దానిపై సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రులు కేటీఆర్ (KTR) , హరీష్ (Harish Rao) సమాలోచనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం నాడు మరోసారి బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు, న్యాయ నిపుణులతో కవిత, కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం. అయితే.. వరుసగా రెండో రోజు ఈడీ ముందు విచారణకు కవిత తరపు ప్రతినిధి న్యాయవాది సోమా భరత్ (Soma Bharath) హాజరవ్వడం.. ఇటు కవితకు మళ్లీ నోటీసులు ఇస్తారనే వార్తలు బీఆర్ఎస్ శ్రేణులను మరోసారి టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈ రెండు మూడ్రోజుల్లో ఏం జరుగుతుందో.. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.

Updated Date - 2023-03-29T17:08:41+05:30 IST