Share News

Yuvagalam NavaSakam: పవన్‌తో కలిసి మరో రెండు సభలు-చంద్రబాబు

ABN , First Publish Date - Dec 20 , 2023 | 04:08 PM

Yuvagalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ ‘యువగళం నవశకం’ విజయవంతంగా ముగిసింది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరిగిన ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తోపాటు ఇరు పార్టీలకు చెందిన నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Yuvagalam NavaSakam: పవన్‌తో కలిసి మరో రెండు సభలు-చంద్రబాబు

Live News & Update

  • 2023-12-20T20:19:39+05:30

    పవన్‌తో కలిసి మరో రెండు సభలు: చంద్రబాబు

    సూపర్ సిక్స్ తరహాలో త్వరలో మరిన్ని పథకాలు ప్రకటిస్తాం: చంద్రబాబు

    త్వరలో అమరావతి, తిరుపతిలో పవన్‌తో కలిసి సభలు నిర్వహిస్తాం

    ఆయా సభల్లో టీడీపీ-జనసేన ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం: బాబు

    20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం: చంద్రబాబు

    నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తాం: చంద్రబాబు

    బీసీల కోసం రక్షణ చట్టం తీసుకువస్తాం: చంద్రబాబు

    మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. సైకో ముఖ్యమంత్రి జగన్‌ను

    ఎన్నికల ముందు ఏం చెప్పారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?

    ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారు

    టీడీపీ, జనసేన మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారు: చంద్రబాబు

    దేశంలో ఏ రాష్ట్రంలో జరగని ఘటనలు ఏపీలో జరుగుతున్నాయి

    అర్హులందరూ తమ ఓటును చెక్ చేసుకోవాలని పిలుపునిస్తున్నా

    సోషల్ మీడియా మాదిరిగా ప్రతిరోజూ తమ ఓటును చెక్ చేసుకోవాలి: బాబు

    టీడీపీ-జనసేన పొత్తు చారిత్రాత్మకం...

    ఇరు పార్టీల కార్యకర్తలు సహకరించుకోవాలని కోరుతున్నా: చంద్రబాబు

    Chandrababu.jpg

  • 2023-12-20T20:12:56+05:30

    రాజధాని పేరుతో జగన్ మూడు ముక్కలాట: చంద్రబాబు

    అమరావతిని జగన్ సర్వనాశనం చేశాడు: చంద్రబాబు

    వైసీపీ కబ్జా కోరల్లో ఉత్తరాంధ్ర నలిగిపోతోంది

    విశాఖకు రాకముందే రిషికొండను జగన్ బోడిగుండు చేశాడు

    రూ.500 కోట్లు ఖర్చుపెట్టి జగన్ విలాసాల భవనం నిర్మించుకున్నాడు

    ప్రజాధనాన్ని వృథా చేసే హక్కు జగన్‌కు ఎవరు ఇచ్చారు?: చంద్రబాబు

    రాజధాని పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నాడు: చంద్రబాబు

    టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020లోనే పోలవరం పూర్తయ్యేది

    బాబాయ్‌ను హత్య చేసి ఎవడో హత్య చేశాడని జగన్ ఆరోపించాడు: బాబు

  • 2023-12-20T20:03:37+05:30

    జగన్‌కు తెలిసింది కక్ష సాధింపు.. విధ్వంసకర పాలనే: చంద్రబాబు

    ఏపీకి వచ్చిన పరిశ్రమలను జగన్ సర్కారు తరిమికొట్టింది: చంద్రబాబు

    యువత జీవితాలను జగన్ నాశనం చేశాడు: చంద్రబాబు

    జగన్ దెబ్బకు విశాఖలో పరిశ్రమలన్నీ పారిపోయాయి

    విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కూడా పోయింది: చంద్రబాబు

    విశాఖ గంజాయికి రాజధానిగా మారడం బాధాకరం: చంద్రబాబు

    జగన్‌కు తెలిసింది కక్ష సాధింపు.. విధ్వంసకర పాలనే: చంద్రబాబు

    ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిన పరిస్థితి: చంద్రబాబు

    రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలందరూ ఆలోచించాలి: చంద్రబాబు

    వైసీపీ వ్యతిరేక ఓటును కాపాడుకోకపోతే రాష్ట్రాన్ని కాపాడుకోలేం

    యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటాం

    మాకు రాజకీయ వ్యతిరేకత తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు: చంద్రబాబు

  • 2023-12-20T19:55:48+05:30

    ఇది ఎన్నికల యుద్ధభేరి-చంద్రబాబు

    నాకు ఉత్తరాంధ్ర ప్రజలు ఘనస్వాగతం పలికారు: చంద్రబాబు

    ఎన్నికల యుద్ధభేరి మోగించేందుకు ప్రజలు కదిలివచ్చారు

    సైకో జగన్ పాలనలో యువగళం పాదయాత్రపై దండయాత్ర జరిగింది

    పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు సృష్టించారు: చంద్రబాబు

    జగన్ పాలనలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు.. ఉద్యోగాలు రాలేదు: చంద్రబాబు

  • 2023-12-20T19:35:37+05:30

    మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. ముఖ్యమంత్రిని-పవన్

    జగన్‌రెడ్డి పాలనలో ఏపీ సర్వనాశనమైంది: పవన్

    దశాబ్ధ కాలం పాటు పార్టీని నడపాలంటే ఎంతో ధైర్యం ఉండాలి

    మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. ముఖ్యమంత్రిని

    ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం విలువ తెలియదు: పవన్‌

    ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లిని విలువ ఇవ్వనివాడు మనకు ఎందుకు?

    ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్‌కు విలువ తెలియదు: పవన్‌

    ఏపీలో ఒంటరి మహిళలు అన్యాయానికి గురవుతున్నారు: పవన్

    టీడీపీ-జనసేన మైత్రి వర్ధిల్లాలి..

    తమ మైత్రికి బీజేపీ ఆశీస్సులు ఉంటాయని ఆకాంక్షిస్తున్నా: పవన్

  • 2023-12-20T19:23:35+05:30

    లోకేష్‌ది బుగ్గలు నిమిరే పాదయాత్ర కాదు: పవన్ కళ్యాణ్

    లోకేష్ చేసింది జగన్ లాంటి పాదయాత్ర కాదు: పవన్

    లోకేష్‌ది మాటల పాదయాత్ర కాదు.. చేతల పాదయాత్ర: పవన్

    ఇది బుగ్గలు నిమిరే పాదయాత్ర కాదు.. ప్రజల కష్టాలు విన్న పాదయాత్ర

    ప్రజా సమస్యలు వింటూ లోకేష్ పాదయాత్ర చేశారు

    నాకు పాదయాత్ర చేసే అవకాశం లేనందుకు బాధగా ఉంది: పవన్

    పాదయాత్ర చేసిన లోకేష్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు

    చంద్రబాబును జైలులో పెట్టడం బాధాకరం: పవన్

    ఏదో ఆశించి నేను టీడీపీకి మద్దతు ఇవ్వలేదు

    కష్టాల్లో ఉన్న టీడీపీని చూసి తన వంతు సాయం చేశా: పవన్

    2024లో జగన్‌ను ఇంటికి పంపిస్తాం: పవన్

  • 2023-12-20T19:12:17+05:30

    జగన్ ఐపీఎల్ టీమ్ కోడికత్తి వారియర్స్-నారా లోకేష్

    జగన్‌ ఐపీఎల్‌ టీమ్‌ పేరు కోడి కత్తి వారియర్స్‌: లోకేష్

    కోడికత్తి వారియర్స్‌ ఆటగాడు అవినాశ్‌రెడ్డి: లోకేష్

    బెట్టింగ్‌ స్టార్‌ అనిల్‌ యాదవ్‌.. అరగంట స్టార్‌ అంబటి

    గంట స్టార్‌ అవంతి.. ఆల్‌రౌండర్‌ గోరంట్ల మాధవ్‌: లోకేష్

    రీల్‌ స్టార్‌ భరత్‌.. పించ్‌ హిట్టర్‌ బియ్యపు మాధవరెడ్డి: లోకేష్

  • 2023-12-20T18:48:40+05:30

    ఇది ముగింపు కాదు.. ఆరంభం మాత్రమే-నారా లోకేష్

    యువగళం ముగింపు సభ కాదు.. ఆరంభం మాత్రమే: లోకేష్

    ఇది నవశకం.. యుద్ధం మొదలైంది: నారా లోకేష్

    చంద్రబాబు, పవన్‌ను ఒకే వేదికపై చూసి జగన్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి: లోకేష్

    ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుంది: లోకేష్

    రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుంది

    తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు యుద్ధం ఆగదు: లోకేష్

    జగన్ ఐపీఎల్ టీమ్ పెడతాడట.. ఆ టీమ్ పేరు కోడికత్తి వారియర్స్: లోకేష్

    కోడికత్తి వారియర్స్ ఆటగాడు వైఎస్ అవినాష్‌రెడ్డి

    నాది అంబేద్కర్ రాజ్యాంగం.. జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం: లోకేష్

    ఈ సభ బొమ్మ చూసి జగన్ దిమ్మ తిరుగుతోంది: లోకేష్

    నా గొంతు నొక్కే నాయకుడు పుట్టలేదు.. పుట్టడు: లోకేష్

    నా పాదయాత్ర ఆపాలని జగన్ ఎన్నో కుట్రలు చేశాడు: లోకేష్

    జగన్‌ను చూస్తే అప్పుల అప్పారావు గుర్తుకొస్తున్నాడు

    లక్ష కోట్లు లూటీ చేసిన జగన్ పేదవాడా?: లోకేష్

    జగన్ పాలనలో ప్రకాశం జిల్లా ఎడారిగా మారింది: లోకేష్

    రాజధానిని చంపి జగన్ రాక్షసానందం పొందుతున్నాడు: లోకేష్

    విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును జగన్ సర్కారు నాశనం చేసింది

    కోడిగుడ్డు మంత్రి వచ్చాక ఉన్న పరిశ్రమలన్నీ పోయాయి: లోకేష్

    మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్‌ ఏంటో చూపిస్తాం

    ఆడుదాం ఆంధ్రా అంటూ కొత్త పథకం తెచ్చారు

    మా జీవితాలతో ఆడారని ప్రజలు చెబుతున్నారు: లోకేష్

    యువగళం పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది: లోకేష్

    రాష్ట్రంలో అడుగడుగునా జగన్‌ విధ్వంసం కనిపించింది: లోకేష్

    టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చాక విశాఖ అభివృద్ధి చేస్తాం

    చెత్తపైనా పన్ను వేసే చెత్త నాయకుడు సైకో జగన్: లోకేష్

    పీల్చే గాలిపైనా పన్ను వేయగల నాయకుడు జగన్ మాత్రమే: లోకేష్

    జగన్ ఓ ఫిటింగ్.. కటింగ్ మాస్టర్: లోకేష్

    ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశాడు: లోకేష్

    nara lokesh.jpg

  • 2023-12-20T18:31:47+05:30

    వైసీపీ అక్రమాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలి: బాలకృష్ణ

    ‘‘లోకేశ్‌ యువగళం.. ప్రజాగళంగా కదంతొక్కింది. పాదయాత్రలో బాధిత ప్రజలను లోకేశ్‌ ఓదార్చారు. లోకేశ్‌ పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించారు. ప్రజా సమస్యలపై పవన్‌ కల్యాణ్ పోరాడుతున్నారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా జగన్‌ మార్చారు. పోలవరాన్ని పూర్తి చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది. డ్రగ్స్ దందాలో మాత్రం రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారు. వైసీపీ నేతలు శాండ్‌, ల్యాండ్‌ స్కామ్‌లతో కోట్లు దోచుకుంటున్నారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా గాలికొదిలేశారు. అమరావతికి భూములిచ్చిన రైతుల ఉద్యమాన్ని అణిచివేస్తున్నారు. రాజధాని కోసం పోరాడుతున్న ప్రజలపై అక్రమ కేసులు. వైసీపీ అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రపంచపటంలో ఏపీ ఉండదు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉంది’’ అని బాలకృష్ణ అన్నారు.

  • 2023-12-20T18:03:05+05:30

    జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నాడు: అచ్చెన్నాయుడు

    లోకేష్ వారసుడు కాదు.. రాజకీయ నాయకుడు: అచ్చెన్నాయుడు

    లోకేష్ నాయకుడే కాదు.. పోరాటయోధుడు కూడా

    నాడు జగన్‌రెడ్డి పాదయాత్రకు ఎక్కడా ఆటంకాలు కలగలేదు

    కానీ లోకేష్ పాదయాత్రకు ఎన్నో అడ్డంకులు సృష్టించారు: అచ్చెన్న

    పాదయాత్రలో బాధితులను లోకేష్ ఓదార్చారు: అచ్చెన్నాయుడు

    పాదయాత్రలో ప్రభుత్వ తప్పులు, అవినీతిని లోకేష్ ఎండగట్టారు

    టీడీపీ- జనసేన శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలి: అచ్చెన్న

    టీడీపీ- జనసేనను బలహీనవర్గాలకు దూరం చేయాలని..

    జగన్‌రెడ్డి కొత్త నాటకాలు ఆడుతున్నాడు: అచ్చెన్న

    జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు.. మొత్తం దోచేశాడు: అచ్చెన్నాయుడు

  • 2023-12-20T17:48:50+05:30

    టీడీపీ, జనసేన కార్యకర్తలకు అభినందనలు: నాదెండ్ల మనోహర్

    జగన్ పాలనలో అవమానాలు, వేధింపులకు గురయ్యాం: నాదెండ్ల

    టీడీపీతో పొత్తుపై పవన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం: నాదెండ్ల

    లోకేష్ నాయకత్వాన్ని బలపరచాలంటే యువగళం సభకు వెళ్లడం సబబు కాదని పవన్ భావించారు

    కానీ లోకేష్ స్పందించిన తీరు పవన్‌ను కదిలించింది

    తాను పవన్ కోసం వెనకడుగు వేయడానికైనా సిద్ధమని లోకేష్ అన్నారు-నాదెండ్ల

    చంద్రబాబులోని పాలనా దక్షత, పవన్‌లోని నూతన ఉత్తేజాన్ని చూసి ప్రజలు ఆశీర్వదించాలి

    సంక్రాంతిలోగా టీడీపీ-జనసేన మేనిఫెస్టో సిద్ధం చేస్తాం-నాదెండ్ల

    జగన్ అరాచక పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం-నాదెండ్ల మనోహర్

  • 2023-12-20T17:30:34+05:30

    ఏపీ అభివృద్ధి కోసమే చంద్రబాబు-పవన్ కలయిక-పంచకర్ల

    గత నాలుగున్నరేళ్లుగా ఏపీకి పట్టిన పీడను వదిలించడానికే టీడీపీ-జనసేన పొత్తు: పంచకర్ల

    వైసీపీ హయాంలో ఉద్యోగాలు లేవు.. ఉపాధి లేదు

    ఉన్న పరిశ్రమలను కూడా వెళ్లగొట్టిన ఘనత వైసీపీదే-పంచకర్ల రమేష్‌బాబు

    పరిశ్రమల గురించి మాట్లాడమంటే వైసీపీ మంత్రి కోడి, గుడ్డు అంటూ ఏదేదో అంటున్నాడు

    జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ప్రజలకు నరకం చూపిస్తున్నాడు-పంచకర్ల

  • 2023-12-20T17:06:28+05:30

    సభా ప్రాంగణానికి చేరుకున్న పవన్ కళ్యాణ్

    యువగళం నవశకం సభ వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్‌ను రిసీవ్ చేసుకున్న నందమూరి బాలయ్య

  • 2023-12-20T17:01:39+05:30

    సభకు చేరుకున్న టీడీపీ అధినేత

    సభా ప్రాంగణానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, బాలయ్య

    ఘన స్వాగతం పలికిన టీడీపీ, జనసేన శ్రేణులు

    యువగళం ముగింపు సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు

  • 2023-12-20T16:54:23+05:30

    అవినీతి పాలకుల గుండెల్లో సింహస్వప్నంలా యువగళం-వర్ల రామయ్య

    ఏపీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో యువగళం-నవశకం సభ జరుగుతోంది: వర్ల రామయ్య

    యువగళం ద్వారా రాష్ట్ర ప్రజలకు నేనున్నానని లోకేష్ భరోసా కల్పించారు

    యువగళం పాదయాత్ర అవినీతి పాలకుల గుండెల్లో సింహస్వప్నంలా మారింది

    రాబోయే రోజుల్లో టీడీపీ-జనసేన పార్టీలు విజయం సాధిస్తున్నాయి.. అందుకు ఈ సభకు హాజరైన ప్రజలే నిదర్శనం: వర్ల రామయ్య

  • 2023-12-20T16:45:01+05:30

    చంద్రబాబు వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్

    యువగళం సభకు చంద్రబాబు వచ్చే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్‌

    చంద్రబాబు కాన్వాయ్‌ను మరో మార్గంలో తీసుకువస్తున్న పోలీసులు

    సభకు వచ్చే నాలుగు వైపుల దారుల్లో భారీగా టీడీపీ, జనసేన శ్రేణులు

    జాతీయ రహదారిపై 6 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్

    సభా ప్రాంగణానికి తండోపతండాలుగా తరలివస్తున్న కార్యకర్తలు

  • 2023-12-20T16:32:05+05:30

    యువగళం పేరుతో జైత్రయాత్ర-పితాని

    రాష్ట్రంలో యువగళం పేరుతో జైత్రయాత్ర సాగింది: పితాని సత్యనారాయణ

    అవినీతి పాలకులకు దడ పుట్టించిన యువగళం పాదయాత్ర: పితాని

    బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పట్టం కట్టబోతున్నాం: పితాని

    పోలిపల్లి సభతో సైకో సర్కార్‌కు అంతిమ ఘడియలు మొదలు

    జగన్ అరాచకపాలనతో ప్రజల ఆశలు, ఆశయాలను ఆవిరి: పితాని

    నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటున్న జగన్.. ఆ వర్గాలకు ఏం చేశారో చెప్పగలడా?: పితాని సత్యనారాయణ

    జగన్ పాలనలో శాండ్, లిక్కర్, ల్యాండ్, మైన్ మాఫియా పేట్రేగిపోతోంది

    సెంటు పట్టాల పేరుతో పేద, బడుగుల అసైన్డ్ భూములను దోచుకున్నారు

    వచ్చే కురుక్షేత్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలే గెలిపించాలి: పితాని

  • 2023-12-20T16:31:33+05:30

    100 రోజుల్లో ఏపీకి పట్టిన శని పోతుంది-ఎంపీ రామ్మోహన్ నాయుడు

    ఉత్తరాంధ్ర ఉత్సాహంతో ఉద్యమిస్తూ ముందుకు సాగుతోంది

    ఎన్నికలకు టీడీపీ, జనసేన సిద్ధమని ఈ సభ చాటుతోంది: రామ్మోహన్‌

    కార్యకర్తలు మరో వంద రోజులు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి

    వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే: ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

    త్వరలో యువతకు ఉపాధి, రైతులను రారాజులను చేయబోతున్నాం

    వంద రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోబోతున్నాం: రామ్మోహన్‌

  • 2023-12-20T16:29:34+05:30

    సభకు చేరుకున్న నారా లోకేష్

    యువగళం ముగింపు సభా ప్రాంగణానికి చేరుకున్న నారా లోకేష్

    నారా లోకేష్ వెంట వచ్చిన నందమూరి సుహాసిని

    లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన టీడీపీ, జనసేన శ్రేణులు

  • 2023-12-20T16:20:50+05:30

    పొత్తు తర్వాత ఇదే తొలిసారి

    టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ సభ పట్ల ఇరు పక్షాల అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఈ సభలో వచ్చే ఎన్నికల సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

  • 2023-12-20T16:18:02+05:30

    విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్

  • 2023-12-20T16:16:45+05:30

    టీడీపీ విజయోత్సవ సభ దగ్గర పండుగ వాతావరణం

    డీజే చప్పుళ్లు, బెలూన్లు, నినాదాలతో హోరెత్తున్న ప్రాంగణం

    నవశకం వేదికపై అలరిస్తున్న సాంప్రదాయ కళా నృత్యాలు

    ప్రాంగణంలో ఆకర్షణీయంగా నేతల భారీ కటౌట్లు

    ఆకర్షణీయంగా ఎన్టీఆర్‌, చంద్రబాబు, లోకేశ్‌, బాలయ్య, పవన్‌ కటౌట్లు

    సభా ప్రాంగణానికి తండోపతండాలుగా తరలివస్తున్న కార్యకర్తలు

  • 2023-12-20T16:13:05+05:30

    యువగళం-నవశకం సభ ప్రత్యక్ష ప్రసారం

  • 2023-12-20T16:05:51+05:30

    విజయనగరం జిల్లాలో యువగళం నవశకం పేరుతో సభ

    110 ఎకరాల స్థలంలో టీడీపీ విజయోత్సవ సభ

    50వేల మంది కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు

    స్టేజీపై 600మంది కూర్చునేలా ఏర్పాటు

    పార్కింగ్ కోసం ఉత్తరాంధ్ర వైపు 2 పార్కింగ్ స్థలాలు,..

    విశాఖ వైపు 2 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసిన టీడీపీ శ్రేణులు

    భోగాపురం నుంచి విశాఖ వరకు భారీ స్థాయిలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు