Share News

Vamsi Birth Day : ఎన్నడూ లేని విధంగా వల్లభనేని వంశీ బర్త్ డే వేడుకలు.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు!

ABN , First Publish Date - 2023-10-21T12:04:23+05:30 IST

మందేస్తూ.. చిందేయ్‌ రా...చిందేస్తూ మందెయ్ రా పాట అందరికీ గుర్తుండే ఉంటుంది కదూ..! సామాన్యుడి పుట్టిన రోజుకే ఇప్పుడు చాలా వరకు హడావుడి ఉంటుంది. కేక్ కటింగ్స్, పార్టీలు, మందు, విందు అనేది కామన్. ఇక అదే ప్రజాప్రతినిధి పుట్టిన రోజు అయితే.. ఆ వేడుకలు, పార్టీలు గురించి మాటల్లో చెప్పలేం..

Vamsi Birth Day : ఎన్నడూ లేని విధంగా వల్లభనేని వంశీ బర్త్ డే వేడుకలు.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు!

మందేస్తూ.. చిందేయ్‌ రా...చిందేస్తూ మందెయ్ రా పాట అందరికీ గుర్తుండే ఉంటుంది కదూ..! సామాన్యుడి పుట్టిన రోజుకే ఇప్పుడు చాలా వరకు హడావుడి ఉంటుంది. కేక్ కటింగ్స్, పార్టీలు, మందు, విందు అనేది కామన్. ఇక అదే ప్రజాప్రతినిధి పుట్టిన రోజు అయితే.. ఆ వేడుకలు, పార్టీలు గురించి మాటల్లో చెప్పలేం.. ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పుట్టిన రోజు వేడుకలు కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి మొదలైన హంగామా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి వంశీ పుట్టిన రోజు వేడుకలు అంటే అంత హడావుడి చేయరని అభిమానులు, అనుచరులు చెబుతుంటారు. అయితే ఈసారి ఎందుకో మునుపెన్నడూ లేని విధంగా జరుపుతున్నారు. ఆయన ఇస్తున్న గిఫ్ట్స్, విందు గురించి తెలుసుకున్న జనాలు అవాక్కవుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదే చర్చ జరుగుతోంది.


Vamsi.jpg

ఓ లుక్కేయండి..!

వంశీ పుట్టిన రోజుకు ఎమ్మెల్యే కార్యాలయం ముస్తాబు అయ్యింది. కార్యాలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వల్లభనేని ఫ్లెక్సీలు, బ్యానర్లే కనిపిస్తున్నాయి. తన పుట్టిన రోజుకు మందు, విందు, చిందు గట్టిగానే ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే. ఇక అభిమానులు, నేతల నుంచి గిఫ్ట్స్ వంశీ తీసుకోవడం కాదు.. ఎమ్మెల్యేనే రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇస్తున్నారు. నియోజకవకర్గంలో పనిచేస్తున్న ప్రతి వలంటీర్‌‌కు ఎమ్మెల్యే ఆఫీసు నుంచి సందేశం వెళ్లింది. గ్రామ/వార్డు వలంటీర్లు అందరూ సెలబ్రేషన్స్‌కు ఏ ఒక్కరూ మిస్ కావొద్దు.. ఊహించని గిఫ్ట్‌లు ఉంటాయన్నది ఆ మెసేజ్ సారాంశం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒక్కో వలంటీరుకు 10 వేల రూపాయిల విలువ చేసే మొబైల్ ఇవ్వనున్నారని తెలిసింది. మొత్తం 2700 వలంటీర్లకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్లకు మొత్తం రెండు కోట్లా 70 లక్షల రూపాయిలు ఖర్చు చేసినట్లు తెలియవచ్చింది.

Vamsi-Birth-Day.jpg

విలాసమైన విందు!

మరోవైపు.. ఇవాళ రాత్రికి అయోధ్య వెంచర్లలో బార్ కోడ్‌తో విలాసమైన విందును వల్లభనేని వంశీ ఇస్తున్నారు. ఇప్పటికే వందలాది మందికి పాస్‌లను పంపిణీ చేయగా.. ఇంకా ఇస్తున్నారు. పాస్‌లను రెండు కేటగిరీలుగా వంశీ అనుచరులు పంపిణీ చేస్తున్నారు. వీఐపీ పాస్‌‌కు మందు, విందు.. జనరల్ పాస్‌కు విందు మాత్రమే ఏర్పాట్లు చేశారు. సుమారు 5వేల మందికి వంశీ విందు ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఎక్కువగా గోవా లాంటి ప్రాంతాల్లో ఎప్పుడూ జరుగుతుంటాయి. అయితే.. ఇప్పుడు వంశీ కూడా గోవా పద్ధతిని గన్నవరం తీసుకొచ్చారని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈ విందుకు సుమారు 2 కోట్ల రూపాయిలు పైనే ఖర్చు అయ్యిందనే టాక్ నడుస్తోంది. చూశారుగా.. వలంటీర్లకు ఫోన్లు.. ఇక్కడేమో విందు ఓ రేంజ్‌లు హడావుడి చేస్తున్నారు వంశీ.

Birth-Day-1.jpg

టార్గెట్ ఇదేనా..?

ఎంతైనా ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది కదా.. ఆ మాత్రం కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు.. ద్వితియ శ్రేణి నేతలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే ఇలా చేశారనే టాక్ నడుస్తోంది. ఈ పార్టీలో నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉండే ముఖ్య కార్యకర్తలు, నేతలను కూడా పాల్గొనాలనే కబురు వెళ్లిందట. మొత్తానికి చూస్తే ఎన్నికల ముందు జనాలను మచ్చిక చేసుకోవడానికే గట్టిగానే వల్లభనేని ప్లాన్ చేశారన్న మాట. మరీ ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గం అంటేనే వివాదాస్పదం.. పైగా టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ వైసీపీ వకల్తా పుచ్చుకోవడం.. ఇక వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం రానున్న ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్యే పోటీ ఉంటోంది. అందుకే ఇప్పట్నుంచే వంశీ.. నియోజకవర్గాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఇలా ఫంక్షన్లు, పార్టీలకు కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

Vallabhaneni-Vamsi.jpg

Vallabhaneni Vamsi : ‘మమ్మల్ని ఎవడ్రా ఆపేది..’ అర్ధరాత్రి హైవేపై వంశీ ఫ్యాన్స్ హంగామా!


Updated Date - 2023-10-21T12:06:28+05:30 IST