Telangana Politics: పోటీకి రెడీగా ఎమ్మెల్యే సీత‌క్క కొడుకు..!

ABN , First Publish Date - 2023-01-06T16:57:39+05:30 IST

ఎమ్మెల్యే సీత‌క్క‌.. తెలంగాణ‌లో తనకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత‌. పార్టీల‌కు అతీతంగా సీత‌క్క‌ను జ‌నం అభిమానిస్తుంటారు. పేద‌ల మ‌నిషిగా నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే సీత‌క్క కొడుకు గురించి..

Telangana Politics: పోటీకి రెడీగా ఎమ్మెల్యే సీత‌క్క కొడుకు..!

హైదరాబాద్: ఎమ్మెల్యే సీత‌క్క‌ (MLA Seethakka).. తెలంగాణ‌లో తనకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత‌. పార్టీల‌కు అతీతంగా సీత‌క్క‌ను జ‌నం అభిమానిస్తుంటారు. పేద‌ల మ‌నిషిగా నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే సీత‌క్క కొడుకు గురించి బ‌య‌ట ప్ర‌పంచానికి పెద్ద‌గా తెలియ‌దు. కానీ, ఇప్పుడు సీత‌క్క కొడుకు సూర్య కూడా పోటీకి రెడీ అవుతున్నారు. సీత‌క్క తిరిగి ములుగు (Mulugu) నియోజకవర్గం నుంచే పోటీలో ఉండ‌నుండ‌గా, ములుగుకు ఆనుకొని ఉన్న పిన‌పాక (Pinapaka) నియోజ‌క‌వ‌ర్గం నుండి సూర్య పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

పిన‌పాక‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రేగ కాంతారావు.. పార్టీ మారిన నాటి నుండి సూర్య అక్క‌డ క్యాడ‌ర్‌తో మ‌మేకం అవుతున్నారు. వివాదాల‌కు దూరంగా ఉంటూనే... గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అన్ని గ్రామాల‌నూ చుట్టేస్తూ, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తున్న సూర్య.. తొలిసారిగా పోటీకి రెడీ అంటూ ప్ర‌క‌టించేశారు. అధిష్టానం ఆదేశిస్తే పిన‌పాక నుండి బ‌రిలో ఉంటానంటున్న సూర్య‌, కొంత‌కాలంగా మ‌రింత దూకుడు పెంచి ప్ర‌జ‌ల్లోనే ఉంటూ వ‌స్తున్నారు. రాహుల్ గాంధీ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న సీత‌క్క కొడుక్కి.. పిన‌పాక సీటు ద‌క్కుతుందో లేదో చూడాలి మ‌రీ.

Updated Date - 2023-01-06T17:15:57+05:30 IST