Share News

Komatireddy : ర్యాలీ జోష్‌లో నామినేషన్ మరిచిన రాజగోపాల్.. ఆఖరి నిమిషంలో ఉరుకులు, పరుగులు..!!

ABN , First Publish Date - 2023-11-09T20:42:01+05:30 IST

Komatireddy Raj Gopal Reddy Nomination : అవును.. నిమిషం ఆలస్యమైనా సరే పరీక్ష హాల్‌లోకి అడుగు పెట్టడానికి వీలుండదు అనే నిబంధన.. పరీక్షలు పెట్టిన ప్రతిసారీ చూస్తుంటాం కదా..! సమయం దాటాక వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చాలానే చూసే ఉంటాం..! ఇప్పుడెందుకు ఇవన్నీ ఇప్పుడేం పరీక్షలు లేవ్.. ఉన్న పరీక్షలనే వాయిదా వేసేశారుగా అనే సందేహం కలిగింది కదూ.. అవును మీరు అనుకుంటున్నది అక్షరాలా నిజమే...

Komatireddy : ర్యాలీ జోష్‌లో నామినేషన్ మరిచిన రాజగోపాల్.. ఆఖరి నిమిషంలో ఉరుకులు, పరుగులు..!!

అవును.. నిమిషం ఆలస్యమైనా సరే పరీక్ష హాల్‌లోకి అడుగు పెట్టడానికి వీలుండదు అనే నిబంధన.. పరీక్షలు పెట్టిన ప్రతిసారీ చూస్తుంటాం కదా..! సమయం దాటాక వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చాలానే చూసే ఉంటాం..! ఇప్పుడెందుకు ఇవన్నీ ఇప్పుడేం పరీక్షలు లేవ్.. ఉన్న పరీక్షలనే వాయిదా వేసేశారుగా అనే సందేహం కలిగింది కదూ.. అవును మీరు అనుకుంటున్నది అక్షరాలా నిజమే. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ నేతలకు పెద్ద పరీక్షలే జరుగుతున్నాయ్.. అదే అసెంబ్లీ ఎలక్షన్స్.. శుక్రవారమే నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇవాళ (గురువారం) బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. భారీ ర్యాలీలు, బలప్రదర్శన చేస్తూ నామినేషన్లు వేయడం జరిగింది. అయితే.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బంది పడిన నేతలు కొందరు ఉంటే.. ర్యాలీలో పడి అసలు విషయం మరిచిపోయిన నేతలు మరికొందరు ఉన్నారు. ఇక నామినేషన్ వేయడానికి అభ్యర్థులు వచ్చిన తీరులో చిత్ర విచిత్రాలన్నీ చూడాల్సిన పరిస్థితి.


Raja-Gopal-2.jpg

అసలేం జరిగింది..?

సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలక నియోజకవర్గమైన మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నాడు నామినేషన్ కూడా వేశారు. అయితే.. ఇంతవరకూ అంతా బాగుంది కానీ.. చివరి నిమిషంలో కోమటిరెడ్డి నామినేషన్ వేయాల్సి రావడంతో నానా హైరానా పడాల్సి వచ్చింది. నామినేషన్‌కు ముందు భారీ ర్యాలీగా.. కార్యకర్తలు, అభిమానులతో రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు బయల్దేరారు. అభిమానం పోటెత్తడం, అడుగడుగునా ఈలలు, కేకలు.. నినాదాలతో హోరెత్తడం, పైగా ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా ఇవాళే నామినేషన్ వేయడంతో ఆ జోష్‌లో రాజగోపాల్ రెడ్డి మునిగిపోయారు. దీంతో అసలు నామినేషన్ దాఖలు చేయాలన్న విషయం మరిచిపోయినట్లున్నారు. పైగా సమయం కూడా మధ్యాహ్నం 3 గంటల వరకే కావడంతో ‘అర్రే.. టైమ్ అయిపోయిందే..’ అని ర్యాలీ మధ్యలో నుంచే ఉరుకులు, పరుగులు పెట్టారు రాజా.!.

Raja.jpg

కారు దిగుడే అలస్యం..!

రిటర్నింగ్ ఆఫీసుకు 500 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపేస్తారు కదా.. ఇక కారు దిగడం ఆలస్యం రాజగోపాల్ ఒక్కటే పరుగే పరుగు..! ఆయనతో పాటు సెక్యూరిటీ, ప్రధాన అనుచరుడు కూడా ఉరకాల్సి వచ్చింది. ఆఖరికి గడువుకు కాస్త ముందు వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి దామోదర్ రావుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. వాస్తవానికి.. నిమిషం ఆలస్యం అయినా సరే పరీక్షల్లోకి నో ఎంట్రీ లాగానే.. నామినేషన్లు కూడా స్వీకరించరు. మంచి ముహూర్తం ఉండటంతో ముఖ్యనేతలంతా గురువారం రోజునే నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ఒక్క సెట్ మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా.. శుక్రవారం నాడు మరో సెట్ నామినేషన్ వేసేందుకు రాజగోపాల్ ఏర్పాట్లు చేస్తున్నారు. చూశారుగా.. ఇదీ సంగతి. ప్రస్తుతం ఈ ఉరుకులు, పరుగులకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కామెంట్స్ గురించి అయితే మాటల్లో చెప్పలేం.. ఆ రేంజ్‌లో వస్తున్నాయ్.!

Raja-Gopal.jpg

CM KCR : కేసీఆర్ ఆస్తులు తెలుసుకుని ఆశ్చర్యపోతున్న జనం.. ఎన్ని కోట్లు ఉన్నాయంటే..!?


Updated Date - 2023-11-09T20:51:41+05:30 IST