YSRCP Vs Janasena : వైఎస్ జగన్.. చెవులు రిక్కించు విను.. నీ వ్యక్తిగత జీవితం క్షణక్షణం నాకు తెలుసు.. పవన్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-30T21:53:00+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-వైసీపీ నేతల మధ్య వ్యక్తిగత జీవితాలపై రచ్చ రచ్చ అవుతోంది..!. అధికార పార్టీ నేతలను ఒకటంటే ప్రతిపక్షాలు అంతకుమించి అనడం.. దానికి కౌంటర్లు రావడం గతం వారం, పదిరోజులుగా పరిపాటిగానే వస్తోంది. ఇటీవల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan Reddy).. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లతో (Pawan kalyan Marriages) పాటు వ్యక్తిగత జీవితంపై మాట్లాడారు..

YSRCP Vs Janasena : వైఎస్ జగన్.. చెవులు రిక్కించు విను.. నీ వ్యక్తిగత జీవితం క్షణక్షణం నాకు తెలుసు.. పవన్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-వైసీపీ నేతల మధ్య వ్యక్తిగత జీవితాలపై రచ్చ రచ్చ అవుతోంది..!. అధికార పార్టీ నేతలను ఒకటంటే ప్రతిపక్షాలు అంతకుమించి అనడం.. దానికి కౌంటర్లు రావడం గతం వారం, పదిరోజులుగా పరిపాటిగానే వస్తోంది. ఇటీవల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan Reddy).. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లతో (Pawan kalyan Marriages) పాటు వ్యక్తిగత జీవితంపై మాట్లాడారు. అది కూడా విద్యార్థులున్న సభలో మాట్లాడటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటంతో పవన్‌కు చిర్రెత్తుకొచ్చింది. శుక్రవారం నాడు భీమవరంలో జరిగిన వారాహీ యాత్ర (Varahi Yatra) వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. అంతేకాదు.. జగన్ వ్యక్తిగత జీవితం (YS Jagan Personal Life) గురించి, హైదరాబాద్ వేదికగా ఏమేం చేశారనే విషయాలను ప్రస్తావించి మరీ మాట్లాడారు.

WhatsApp Image 2023-06-30 at 9.45.07 PM (2).jpeg

పవన్ ఇంకా ఏమన్నారంటే..!

సీఎం జగన్ చెవులు రిక్కించు విను.. నీ వ్యక్తిగత జీవితం క్షణక్షణం నాకు తెలుసు. నా వ్యక్తిగత జీవితాల గురించి పనికిమాలిన మాటలు మాట్లాడితే చూస్తూ ఉండను. హైదరాబాద్‌లో జగన్ ఏమేం చేశాడో.. చాలా లోతైన విషయాలు నాకు తెలుసు. అవన్నీ నేను మాట్లాడలేక కాదు.. మళ్లీ చెబుతున్నా నీ (వైఎస్ జగన్) పర్సనల్ లైఫ్ గురించి నాకు అంతా తెలుసు. నీ మనిషిని పంపించు.. నేను చెప్పే విషయాలు వింటే చెవులు నుంచి రక్తం వస్తుంది. ఇది వార్నింగ్ అనుకో. బలమైన పోరాటం ఇవ్వబోతున్నాను. ఇక్కడ ఉన్న నాయకులు సైలెన్సర్లతో ఇంటి చుట్టూ తిరుగుతున్నారని కొందరు బాధపడుతున్నారు. మీ నోటికి సైలెన్సర్లు బిగిస్తాను. నాకు యువత అంటే ఇష్టం.. మిమ్మల్ని కులాల వారీగా విడదీయడం నాకు ఇష్టం లేదు. ఆడవారి మాన ప్రాణాలకు అండగా ఉంటాను. కుల వైషమ్యాలను వదిలేద్దాం.. చిన్న చిన్న గొడవలను పెద్దగా చెయ్యవద్దు అని భీమవరం సభా వేదికగా పవన్ వ్యాఖ్యానించారు.

WhatsApp Image 2023-06-30 at 9.45.07 PM (1).jpeg

నా గురించి మాట్లాడారో..?

పాతిక సంవత్సరాలు మీకు కూలీగా పనిచేయడానికి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బీసీలకు సంపూర్ణ రాజ్యాధికారం కావాలి. దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. మనస్పూర్తిగా చెబుతున్నాను.. నాకు హీరోలంటే చాలా ఇష్టం. జగన్.. ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్, రౌడీయిజం బ్యాగ్రౌండ్ ఉందని ఎగురుతున్నావేమో.. వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. 151 మంది ఎమ్మెల్యేలుగా నా గురించి గానీ, పార్టీ గురించి మాట్లాడితే ఊరుకోను. మీ నోటికి సైలెన్సర్లు బిగించుకుంటే మంచిది. గాంధీజీ ఎక్స్ పీరియన్స్ విత్ ట్రూత్ అనే పుస్తకం రాస్తే.. జగన్ మాత్రం ఎక్స్ పీరియన్స్ విత్ లైస్, ఎక్స్ పీరియన్స్ విత్ ఎక్స్ టార్షన్ అనే పుస్తకాలు రాశారు. చిన్నప్పుడే జగన్ పోలీసులను కొట్టాడు. అటువంటి వ్యక్తి ఎంపీ రఘురామను పోలీసులతో కొట్టించడంలో పెద్ద విశేషమేముంది. అయన ఇప్పుడు పోలీసులతో పరిపాలన చేస్తున్నారు. గొడ్డలి రాష్ట్ర ఆయుధంగా చేశారు. వైసీపీకి సవాల్ చేస్తున్నా.. మీరు గెలుస్తారా..? మేము గెలుస్తామో..? చూద్దాం. నిండా మునిగిన నాకు చలేంటి..?. తుందుర్రు అక్వా పోరాటంలో కొందరిపై కేసులు పెట్టారు. అధికారంలోకి వస్తే వాటిని ఎత్తివేస్తాం. ఆ కేసులు ఇప్పటికీ ఎత్తేయ్యలేదు .. మేము అధికారంలోకి వస్తే ఆ కేసులు ఎత్తివేస్తాం అని భీమవరం ప్రజలకు పవన్ హామీ ఇచ్చారు.

WhatsApp Image 2023-06-30 at 9.45.07 PM.jpeg

మొత్తానికి చూస్తే.. పవన్ వర్సెస్ జగన్ మధ్య వ్యక్తిగత జీవితాలపై రోజురోజుకూ విమర్శలు, ప్రతి విమర్శలు.. కౌంటర్లు పెరుగుతూనే వస్తున్నాయ్. ఇప్పుడు సేనాని కామెంట్స్‌కు వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

ఇవి కూడా చదవండి


Minister KTR : ఏంటిది సారూ.. టచ్ చేయకూడదా..? దండం పెట్టినా ఎందుకిలా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!


Telangana BJP : ఈటల రాజేందర్ బీజేపీకి అక్కర్లేదా.. మరీ ఇంత దారుణమా.. ఒక్కరూ పట్టించుకోలేదేం.. ఇదంతా దేనికి సంకేతం..!?


Byreddy Vs Jagan : వైఎస్ జగన్‌కు బైరెడ్డి అల్టిమేటం.. నాలుగు ఆప్షన్లు ఇచ్చిన యువనేత.. దిక్కుతోచని స్థితిలో సీఎం.. ఏ నిమిషానికి..!


Updated Date - 2023-06-30T22:05:33+05:30 IST