Share News

Telangana Exit Polls: మరో సర్వే కూడా కాంగ్రెస్ వైపే..!! ఎన్ని సీట్లు వస్తాయంటే..?

ABN , First Publish Date - 2023-12-01T21:20:56+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో గురువారం వరుసగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. అయితే ఇండియాటుడే యాక్సిస్ మై సర్వే మాత్రం గురువారం తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించలేదు. ఒకరోజు ఆలస్యంగా శుక్రవారం సదరు సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Telangana Exit Polls: మరో సర్వే కూడా కాంగ్రెస్ వైపే..!! ఎన్ని సీట్లు వస్తాయంటే..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో గురువారం వరుసగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. అయితే ఇండియాటుడే యాక్సిస్ మై సర్వే మాత్రం గురువారం తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించలేదు. ఒకరోజు ఆలస్యంగా శుక్రవారం సదరు సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇండియా టుడే సర్వేలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పదని స్పష్టమైంది. ఈ సర్వేలో బీఆర్ఎస్‌కు 34-44 సీట్లు వస్తాయని ఇండియా టుడే-యాక్సిస్ మై సర్వే పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ 63- 73 సీట్లు సాధిస్తుందని.. బీజేపీ 4 -8 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఇతరులు (ఎంఐఎం) 5-8 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది.

మరోవైపు మిగతా నాలుగు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ఇండియా టుడే ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలుస్తుందని.. ఆ పార్టీ 140-162 సీట్లు గెలుస్తుందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 68-90 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు 0-3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. రాజస్థాన్‌లో జరిగిన 199 అసెంబ్లీ సీట్లలో బీజేపీకి 80 నుంచి 100 సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. అటు కాంగ్రెస్ పార్టీకి 86-106 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు 9-18 సీట్లు గెలుస్తారని ఈ సర్వే స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి 36-46 సీట్లు వస్తాయని.. కాంగ్రెస్ 40- 50 సీట్లు సాధిస్తుందని ఇండియా టుడే సర్వే తెలిపింది. ఇతరులు 1 నుంచి 5 సీట్లు గెలుస్తాయని చెప్పింది. మిజోరంలో MNF మిజోరాం నేషనల్ ఫ్రంట్ 3-7 సీట్లు, ZPM 28-35 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 2-4 సీట్లు, బీజేపీ 0-4 సీట్లు సాధిస్తుందని ఇండియా టుడే సర్వే పేర్కొంది.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-01T21:23:47+05:30 IST