Share News

YSRTP : ఎన్నికల ముందు వైఎస్ షర్మిలకు ఊహించని షాక్..

ABN , First Publish Date - 2023-11-07T17:00:31+05:30 IST

ఎన్నికల్లో వైఎస్సార్టీపీ (YSRTP) పోటీ చేయట్లేదని.. కాంగ్రెస్‌ పార్టీకి (Congress) బేషరతుగా మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించిన సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో విలీనం అని ఢిల్లీ, బెంగళూరు వేదికగా పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ చివరికి ఎందుకు ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ఒంటరిగా పోటీచేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది కానీ.. ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. సడన్‌గా కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని షర్మిల నిర్ణయించారు...

YSRTP : ఎన్నికల ముందు వైఎస్ షర్మిలకు ఊహించని షాక్..

ఎన్నికల్లో వైఎస్సార్టీపీ (YSRTP) పోటీ చేయట్లేదని.. కాంగ్రెస్‌ పార్టీకి (Congress) బేషరతుగా మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించిన సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో విలీనం అని ఢిల్లీ, బెంగళూరు వేదికగా పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ చివరికి ఎందుకు ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ఒంటరిగా పోటీచేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది కానీ.. ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. సడన్‌గా కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని షర్మిల నిర్ణయించారు. ఈ ప్రకటన చేసిన రోజుల వ్యవధిలోనే వైఎస్సార్టీపీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీకి పలువురు కీలక నేతలు, ద్వితియ శ్రేణి నేతలు మూకుమ్మడిగా రాజీమా చేశారు. ఈ మేరకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ నేత గట్టు రామచంద్రరావు నేతృత్వంలో రాజీనామాలు చేసి, మీడియా మీట్ నిర్వహించారు.


YSRTP-Leaders-Resigns.jpg

ఏం జరిగింది..?

తెలంగాణ సమాజం నుంచి వైఎస్ షర్మిలను బహిష్కరించాలని.. తమను నట్టేట ముంచిందని రాజీనామా చేసిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల తెలంగాణలో తిరిగితే అడ్డుకుంటామని శపథం చేశారు. ‘ఆంధ్ర షర్మిల.. గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణను విడిచిపెట్టాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి పేరును షర్మిల చెడగొట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో నిలబడతా అని చివరగా అందరిని రోడ్డు మీద నిలబెట్టింది. ఇన్ని రోజులకు షర్మిలను సపోర్ట్ చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాం. మేమంతా షర్మిలను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాం. తెలంగాణ ప్రజలంటే షర్మిలకు చిన్నచూపు.. షర్మిల రాజకీయాలకు పనికిరాదు. భవిష్యత్ కార్యచరణ త్వరలోనే చెబుతాంఅని గట్టు చెప్పుకొచ్చారు.

YSRTP.jpg

మోసం.. మోసం!

మహిళా నేత సత్యవతి మాట్లాడుతూ.. వైఎస్సార్ అభిమానులను షర్మిల మోసం చేసిందని మండిపడ్డారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తామంటే పార్టీలో చేరి.. పాదయాత్రలో పాల్గొన్నానని చివరికి ఇలా జరగడం బాధాకరమన్నారు. ‘వైఎస్సార్ కార్యకర్తలు అందరూ అభిమానంతో పార్టీలో చేరారు. నేతలు, కార్యకర్తలందర్నీ షర్మిల మోసం చేసింది. తెలంగాణ నుండి షర్మిలను బహిష్కరిస్తున్నాం. షర్మిల ఎవర్ని గౌరవించలేదు.. సొంత ఎజెండాతో ముందుకు వెళ్ళింది. పాదాల మీద కాదు.. మా అందరి శవాల మీద నడిచేందుకు సిద్ధమైంది. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాం. రాబోయే ఎన్నికల్లో షర్మిల ఎక్కడ పొటీ చేసినా ఓడిస్తాం’ అని సత్యవతి చెప్పారు. మరో నేత గణేష్ నాయక్ మాట్లాడుతూ.. బయ్యారం గుట్టను దోచుకోవడానికి షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. తెలంగాణ సొమ్మును దోచుకోవడానికి పార్టీ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. షర్మిల తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా రాళ్లతో కొట్టి ఆంధ్రప్రదేశ్‌కు పంపుతామన్నారు. సంజీవ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో షర్మిల ఎన్నో డ్రామాలు నడిపిందన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై.. నేతలను రోడ్డుపైకి లాగారన్నారు. తెలంగాణ ద్రోహి షర్మిలకు తగిన గుణపాఠం చెబుతామని.. ఆమె రాష్ట్రంలో తిరిగి హక్కేలేదన్నారు.

YSRTP-Letter.jpg

ఆందోళన వద్దు..

కాగా మూకుమ్మడి రాజీనామాలు, కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధి నీలం రమేష్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్టీపీ శ్రేణులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మన పార్టీ కేవలం ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయలేదు. పార్టీ లేదని.. పార్టీని ఇక నడపరు అని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదని, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో రాకూడదని మన అధినేత్రి చేసింది త్యాగమే తప్ప.. మోసం కాదు. ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వంపై ప్రజల కోసం పోరాటం ఉంటుంది. ప్రజల పక్షాన వైఎస్సార్ తనయ నిలబడుతుంది. ఈ అంశాలను గౌరవించి ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదుఅని ప్రకటనలో రమేష్ పేర్కొన్నారు.

sharmila.jpg

Chandrababu : చంద్రబాబు‌కు కంటి ఆపరేషన్ పూర్తి.. ఎక్స్‌క్లూజివ్ ఫొటో..

Updated Date - 2023-11-07T17:42:38+05:30 IST