Share News

CBN : చంద్రబాబుకు మరో బిగ్ రిలీఫ్.. ఆనందంలో మునిగితేలుతున్న టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2023-10-31T15:48:25+05:30 IST

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి (TDP Chief Chandrabbu) మధ్యంతర బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే...

CBN : చంద్రబాబుకు మరో బిగ్ రిలీఫ్.. ఆనందంలో మునిగితేలుతున్న టీడీపీ శ్రేణులు

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి (TDP Chief Chandrabbu) మధ్యంతర బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. బాబు అనారోగ్య (CBN Health) కారణాల రీత్యా బెయిల్ ఇస్తున్నట్లు ఏపీ హైకోర్టు పేర్కొంది. దీంతో చంద్రబాబు ఇవాళ సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. టీడీపీకి ఇదొక ఊరట కాగా.. తాజాగా చంద్రబాబుకు మరో బిగ్ రిలీఫ్ దక్కింది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన మద్యం కేసులో (Liquor Case) బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ (Anticipatory Bail) గడువు పూర్తయ్యే వరకూ.. ఈ కేసులో అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ స్పష్టం చేసింది. అరెస్ట్ చేయబోమనే విషయాన్ని ఈ మేరకు హైకోర్టుకు ఏజీ లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు.


ap-high-court.jpg

ఎవరేం వాదించారు..?

ఈ మద్యం కేసులో దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబును ఇరికించారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. అనంతరం.. ఇందుకు సంబంధించి కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు నవంబరు- 21కి వాయిదా వేయడం జరిగింది. దీంతో చంద్రబాబుకు ఒకే రోజు రెండు భారీ ఊరటలే లభించినట్లయ్యింది. టీడీపీ శ్రేణులు, చంద్రబాబు వీరాభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

Updated Date - 2023-10-31T15:50:08+05:30 IST